Prepaid auto service started at secunderabad railway station

prepaid auto service started at Secunderabad railway station

prepaid auto service started at Secunderabad railway station

prepaid-autos.gif

Posted: 11/24/2011 05:17 PM IST
Prepaid auto service started at secunderabad railway station

auto-photoపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ చేతులు మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రీపెయిడ్ ఆటో సర్వీస్ ప్రారంభమైంది.  ప్రయాణీకులు ఆటో వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా, వారు వెళ్ళాల్సిన ప్రదేశాన్నిబట్టి ముందుగా నిర్ణయించిన ప్రకారం కంప్యూటర్ ద్వారా బిల్లింగ్ జరుగుతుంది.  దీనివలన సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి నగరంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుంది. ఆటోకి అధికంగా చెల్లించాల్సిన అవస్త తప్పిపోవటమే కాకుండా, బిల్లు బయటకు వచ్చే ముందు ప్రయాణీకుల వివరాలు, ఆటో వివరాలు కూడా కంప్యూటర్ ల్ పొందుపరుస్తారు కాబట్టిసామాన్లు పోవటం లాంటి ఫిర్యాదుల్లో దర్యాప్తు సులభతరం కూడా అవుతుంది.

ఈ సదుపాయాన్ని అమలులోకి తెచ్చిన నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ సివి ఆనంద్ని ఈ సందర్భంగా బొత్స అభినందించారు.  నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కూడా ఈ ప్రీపెయిడ్ ఆటో విదానం ప్రయాణీకులకు చాలా మేలు చేస్తుందని అన్నారు. 

దీనివలన మరో ఉపయోగం కూడా ఉంది.  బయటకు వచ్చే వాళ్లకి అడ్డుగా వచ్చి ఆటో కావాలా అని నిలదీసేవారుండరు.  పైగా రైల్పే స్టేషన్ చుట్టు పక్కల తిరుగుతూ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే ఆటోవాలాలు, దానికంటే క్యూలో వెళ్ళి ప్రయాణీకులను పద్ధతి ప్రకారం ఎక్కించుకుని పోవటంలోనే ప్రయోజనముందని గ్రహిస్తారు.  కాకపోతే రైలు దిగగానే ఇంటికెళ్ళే తొందరలో క్యూలో నిలిచి కంప్యూటర్ బిల్లింగ్ కోసం వేచివుండటానికి ఇష్టపడక పోవచ్చు.  దాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఆటోవాలాలు పాత పద్ధతిలో సవారీలను తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యవచ్చు. అందువలన కొన్ని రోజుల పాటు అందరికీ అవగాహన కలిగించి ప్రోత్సహించే విదంగా ఈ సిబ్బంది కృషి చెయ్యవలసివుంటుంది.

-శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Janumaddi hanumachastri gets loknayak foundation award
Kiran kumar government in snakes and ladders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles