Kiran kumar government in snakes and ladders

kiran kumar government in snakes and ladders

kiran kumar government in snakes and ladders

kiran-kumar1.gif

Posted: 11/24/2011 04:30 PM IST
Kiran kumar government in snakes and ladders

kiran-kumar-reddyవిద్యార్థి దశలోనే నాయకత్వ పగ్గాలు పుచ్చుకుని, క్రమక్రమంగా శాసన సభ్యుడిగా, చీఫ్ విప్ గా, సభాపతిగా, ముఖ్యమంత్రిగా ఎదిగిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ ఆటుపోట్లను ఎదుర్కుంటూ వచ్చారు. 

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసారు.  ఈ సంవత్సర కాలంలో ఆయన చూపించిన ఓరిమి, సహనాలు ఆయనకు మంచిచేసాయా లేకపోతే ఆయన మౌనం ఆయనను కాంగ్రస్ పార్టీలో మూలకి నెట్టే ప్రయత్నానికి తావిచ్చిందా?  ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ముందుకి తీసుకెళ్లాయా లేకపోతే శాసనసభ సముచితమైన నిర్వహణలో విఫలమైనందుకు ఆయనకు అందవలసిన ఫలాలు అందలేదా?  2014 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ సందేశాలను జనంలోకి చేరవేసి పార్టీ పట్ల సద్భావన పెంచుతారని అధిష్టానం అనుకుంటోందా లేకపోతే ఆయన సాటి నాయకులే మంచి ఫలితాలను తెచ్చిపెడతారనుకుంటోందా?  జగన్ వర్గీయులను కాంగ్రెస్ గూటికి రప్పించటానికి ఆయన చేసిన కృషి ఆయన కిరీటంలో తురాయి అవుతుందా లేకపోతే అంతర్గతంగా మిగిలిన పార్టీ శ్రేణులతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఆయన తీరు ఆయనకి ఎదురుదెబ్బవుతుందా?  ఈ విషయాలన్నీ మీడియాలోనూ, రాజకీయరంగంలోనూ చర్చనీయాంశమైంది.

గత సంవత్సర కాలం చూసుకుంటే అది ఎంతో అనుకూలమైన కాలంగా అనుకోలేము, అలాగని ప్రతికూలంగానూ లేదు.  అటూ ఇటూ కాకుండా ఎటువైపూ పూర్తిగా మొగ్గకుండా సమతౌల్యతతో నెట్టుకొచ్చింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం పట్టుబడుతూ ఆందోళనలు వెల్లువిరుస్తున్న కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి తాపీగా శాంత స్వభావంతో పరిస్థితులను తనకు అనుకూలంగా తీర్చిదిద్దిన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు.  ఆందోళన ఇంకా కొనసాగుతూనేవున్నా, అప్పటంత ఉధృతం లేకపోవటం గమనార్హం. 

రాజీవ యువ కిరణాలు కార్యక్రమం కిరణ్ కుమార్ పక్షాన బాగా పనిచేసింది.  అందులో ఆయన 2014 కల్లా ఒకటిన్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాననటం కార్యక్రమంలో మకుటాయమానమై యువతను ఆకట్టుకుంది.  రాజకీయ లబ్ధికోసం యువతను పోరాటంలోకి దించిన స్వార్థ రాజకీయ నాయకుల ఆటకట్టించటానికి బాగా పనికివచ్చింది.

రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజలు బాగా ఆదరించారనటానికి అందులో భాగం వహించిన ప్రజల సంఖ్యే తార్కాణం.  నేతలంతా తెలంగాణా ప్రాంతాలకు పోవటానికి జంకుతున్న సమయంలో ధైర్యంగా తెలంగాణా జిల్లాల్లో రచ్చబండను నిర్వహించిన ఘనత కిరణ్ కుమార్ కే దక్కుతుంది. 

ఒక రూపాయకే కిలో బియ్యం పథకం మరో జనాకర్షక పథకమైంది, ముఖ్యంగా పేదరికపు రేఖకు అడుగునున్నవారికి.  అయితే ఆ పథకం కింద సరఫరా చేసిన నాసిరకం బియ్యంలో పురుగులున్నాయని,  కిరోసిన్, పంచదార సరఫరా తగ్గిపోయిందని విమర్శలు వచ్చాయి.

మీసేవ కేంద్రాల ద్వారా ఒకే గొడుగు కింద వివిధ ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేయించటం ద్వారా లంచగొండితనం, ప్రబలిపోయిన అవినీతిని అరికట్టటానికి పనికివచ్చింది. 

పావలా వడ్డీకి ఇచ్చే స్త్రీనిధి పథకం గ్రామీణ మహిళలకు చేయూతనిస్తోంది.  ఈ పథకాన్ని ఎస్ హెచ్ జి ల ద్వారా నగరవాసం చేసే మహిళలకు కూడా అందించే ప్రయత్నం శ్లాఘనీయం.

సకల జనుల సమ్మె ఉధృతానికి అడ్డుకట్ట వెయ్యటం అన్నిటికన్నా మంచి పేరు తెచ్చిపెట్టింది.  సుదీర్ఘ సమ్మె సాగుతున్న సమయంలో మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలు అమలు జరుగుతుండటంతో సమ్మే ప్రగతికి అడ్డు వస్తున్నదనే భావన వారిలో కలిగింది.  దానితో నెమ్మదిగా అది చప్పగా చల్లబడిపోయింది. 

చివరిగా చెప్తున్నా అన్నిటినీ మించింది, జగన్ వర్గంలో చేరిన శాసనసభ్యులను తిరిగి వెనక్కి వచ్చేట్టుగా చెయ్యగలగటం.  ఇందులో విజయం ఆయన కిరీటంలో తురాయి కాదు ఏకంగా కోహినూర్ వజ్రాన్నే పెట్టేసింది. 

ప్రతికూలాంశాలను చూస్తే,  పనిలో  ఒక రకమైన విధానానికి అలవాటు పడ్డ అధికారులు సిబిఐ భయంతో జంకుతూ ఉన్నారు.  వారిలో ఆ భయాన్ని పోగొట్టి సక్రమంగా పనిచేయించటానికి అవసరమైన నైపుణ్యం, మాటకారితనం ఈ యువ ముఖ్యమంత్రిలో లేవు. నేరాలు పెరిగిపోయాయి, విద్యత్ సరఫరా కోతలకు గురైంది. ఆరోగ్యశ్రీ వైఫల్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. చిత్తూరు శాసనమండలి సీటు ఆయన సొంత అభ్యర్థికే రాకపోవటం కిరణ్ కుమార్ కి ఎదురుదెబ్బయింది.  ప్రభుత్వ యంత్రాంగాన్నంతా వాడుకుంటూ, పార్టీ సీనియర్ల మద్దతు సంపూర్ణంగా లభించినా, కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్ కి పట్టం కట్టటం పెద్ద గొడ్డలి పెట్టే అయింది.   

ఆంధ్రవిశేష్ చేసిన ఈ పై విశ్లేషణతో కిరణ్ కుమార్ రెడ్డి పట్ల సుముఖ భావం లేదా విముఖత కలిగించికోవటమనేది ఓటర్లమీద ఆధారపడివుంది.  ప్రస్తుతమున్న నాయకులందరిలోకీ చిన్నవయసులో ఉండి సహనంతో మౌనపోరాటం సాగిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రిగా సంవత్సరం నిండిన ఈ సందర్భంగా ఆంధ్రావిశేష్ తరఫుల శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రానికో బంగారు భవిష్యత్తునిస్తారని ఆశిస్తూ, ఒక చిరు సలహాతో ముగింపు పలుకుతున్నాం-  సాదారణ మానవుడి మీద పడుతున్న అసాధారణ భారాన్ని తగ్గించే దిశగా యోజనలు చెయ్యమని మా ప్రార్థన!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prepaid auto service started at secunderabad railway station
Attack on union minister sharad pawar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles