Indira gandhi birth anniversary

Indira Gandhi birth anniversary, 93rd birthday, indira gandhi,indira gandhi birth anniversary, Nehru’s death in 1964, Jawaharlal Nehru,

Nation pays tribute to Indira Gandhi on her 93rd birthday,

Indira Gandhi birth anniversary.GIF

Posted: 11/19/2011 05:12 PM IST
Indira gandhi birth anniversary

indira

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెడ్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. కరీంనగర్‌లోని డిసిపి కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు ఈ అంశంపై స్పందించారు.అవిశ్వాసాన్ని ఎదుర్కొనే తగిన సంఖ్యాబలం తమకుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇవాళ రైతుయాత్రలు చేయడం విడ్డురంగా ఉందని ఆయన విమర్శించారు. జిల్లాలో కరవు మండలాల్లో తగిన విధంగా సర్వేలు చేయించి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉక్కుమహిళగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇందిర జవహర్‌లాల్‌ నెహ్రూ కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగెపెట్టినా.. తదనంతర చరిత్రకు తానే సృష్టికర్త అయ్యారు. సస్య విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్‌ పరిరక్షణ, పోఖ్రాన్‌ అణు పరీక్ష, గరీబ్‌ హఠావో, రాజభరణాలరద్దు, ఎమర్జెన్సీ.. ఇలా ఇందిరా తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం.. ఓ చరిత్రాత్మక ఘట్టమే! నేడు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఆర్థికమాంద్యాన్ని భారతదేశం తట్టుకొని నిలబడిందంటే.. నాడు బ్యాంకులను జాతీయకరణ చేసిన ఇందిరగాంధీ ముందుచూపే.

బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి ఇందిరాగాంధీ అందించిన నైతిక, సైనిక, ఆర్థిక, రాజకీయ మద్ధతు మనదేశాన్ని అంతర్జాతీయ చిత్రపటంలో ఓ బలమైన శక్తిగా నిలిపిందంటే అతిశయోక్తికాదు. అగ్రరాజ్యాన్ని సైతం ఎదరించిన ఇందిర రాజకీయ శక్తికి బంగ్లాదేశ్‌ యుద్ధం ఓ సజీవ ఉదాహరణ! బ్యాంకుల జాతీయీకరణ, గరీబ్‌ హఠావో నినాదాలతో వామపక్షాలకు ఎదురులేని దెబ్బ కొట్టిన ఇందిర.. ఎమర్జెన్సీ, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌తో అపప్రధను మూటగట్టుకొన్నారు.

తండ్రి జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రభావం, స్వాతంత్ర్యద్యోమ అగ్ని కీలల్లో రాటుదేలిన అనుభవం ఇందిరా వ్యక్తిత్వం. భర్త ఫిరోజ్‌ గాంధీ హఠాన్మరణంతో కుంగిపోకుండా, ధీశాలిగా ఇద్దరు కుమారులు రాజీవ్‌, సంజయ్‌లను పెంచిన ఇందిర.. బిజీ పొలిటికల్‌ షెడ్యూల్డ్‌లోనూ తన కుటుంబానికీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. రాజీవ్‌ విదేశీ వనితను పెళ్ళాడినా పెద్దమనసుతో స్వాగతించిన తల్లామె. చివర వరకు అండగా ఉంటాడని భావించిన సంజయ్‌ను విమాన ప్రమాదం కబళించినా.. కుంగిపోకుండా.. దేశం కోసం సర్వశక్తులు కూడదీసుకొని 1980లో ఆఖరిసారిగా ప్రధాని పీఠం అధిరోహించారు. నిర్భీతితో, నిశ్చలతతో తీవ్రవాదానికి వ్యతిరేకంగా చిట్టచివరి క్షణం వరకు పోరాడిన ఇందిరా ప్రియదర్శిని మహిళాశక్తికి మారురూపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Enquiry on chandrababu starts within a day or two says cbi jd
Telugu desam party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles