Telugu desam party

Telugu desam party, Congress Party, Chandra Babu, Raithuporu, speaker Manohar, Ys Jagan, YSR Party,

Telugu desam party

Telugu desam party.GIF

Posted: 11/19/2011 05:00 PM IST
Telugu desam party

TDP-Party

అవిశ్వాసానికి టీడీపీ రెడీ అవుతోంది. రైతు సమస్యలపై సర్కార్‌ను బలపరీక్షకు నిలిపేందుకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు సర్కార్‌ను కూలదోసేందుకు కలసిరావాలంటూ ఇన్నాళ్ళు టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన పార్టీలకు సవాల్‌ చేస్తున్నారు. ఇంతకీ అవిశ్వాసం పెడితే నెగ్గనుందా ? వీగిపోనుందా ? రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్దమైంది. ఇదే విషయాన్ని రంగారెడ్డి జిల్లాలో రైతు పోరుబాటలో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు జారి పోకుండా చూస్తారా అని ఆ పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలపై శాసనసభ శీతాకాల సమావేశాలలో అవిశ్వాస తీర్మానంపై నోటీసు అందజేస్తామన్నారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసంపై స్పీకర్‌కు నోటీసు ఇస్తే దీనిపై చర్చ జరుపకుండా స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుపుకుని అర్ధాంతరంగా వాయిదా వేశారని విమర్శించారు. రాష్ట్ర సర్కార్‌ పై టీడీపీ అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టినా ఎదుర్కోనేందుకు సిద్దంగా వున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 294 స్థానా కాంగ్రెస్‌ గెల్చుకున్నది 156 స్థానాలు..ఇందులో జగన్‌ వైపు 25 మంది వెళ్లారు. పీఆర్పీ విలినంతో ఆ పార్టీకి చెందిన 17 మంది, అలాగే ఎంఐఎం నుంచి ఏడు గురి మద్దుతు వుండనే వుందని కాంగ్రెస్‌ నేతలు ధీమాగా చెబుతున్నారు.

ఈ నెంబర్‌ గేమ్‌లో కాంగ్రెస్‌ సర్కార్‌కు డోకాలేదని ప్రధాన నేతలు టేకిట్‌ ఈజీగా తీసుకుంటున్నారు. జగన్‌వైపు ఉంటూనే కిరణ్‌సర్కార్‌కు మద్దతిస్తామని కొందరు ఎమ్మెల్యేలు అంటుంటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు టీఆర్‌ఎస్‌, లోక్‌సత్తాలు రెడీ అవుతున్నాయి. సో ఈ గేమ్‌లో కాంగ్రెస్‌ తన పంతం నెగ్గించుకుని సర్కార్‌ను కాపాడుకుంటుందా...లేక విపక్షాల మద్దతుతో ప్రభుత్వం కూలుతుందా అనే సస్పెస్‌కు అసెంబ్లీ సమావేశాలలో తెరపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indira gandhi birth anniversary
Congress minister sridhara babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles