Mayawati new plane opposition shock

Jairam targets Mayawati again, Union Minister for Rural Development Jairam Ramesh, Mayawati,Bahujan Samaj Party

Mayawati New plane opposition shock

29314Mayawathi1.GIF

Posted: 11/18/2011 11:36 AM IST
Mayawati new plane opposition shock

Mayawati New plane opposition shock

యుపిలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించటానికి పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. రాష్ట్ర విభజనపై మాయా వేసిన పాచికకు ధీటుగా నాలుగు ప్రధాన పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. యుపిలో గ్రామీణాభివృద్ధి నిధుల గోల్‌మాల్‌పై సి.బి.ఐతో విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రకటిస్తే.. అవిశ్వాసం ద్వారా BSPని ఇరుకున పెట్టాలని ఎస్పీ- బీజేపీ భావిస్తున్నాయి. యుపిలో మాయావతిని చిత్తు చేయటానికి విపక్షాలన్నీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న యుపి అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్‌పై అవిశ్వాసతీర్మానం పెట్టాలని భావిస్తున్నాయి. చిన్న రాష్ట్రాలను ఎస్పీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీకి బిజెపి మద్దతు పలుకుతోంది. సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ యుపిని నాలుగు ముక్కలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనితో యుపి రాజకీయం రంగులు మారేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో బిఎస్పీ తరవాత రెండో అతి పెద్ద పార్టీ ఎస్పీ, బిజెపి చేతులు కలిపి అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ కు నోటీసు ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే నాలుగో పార్టీయైన కాంగ్రెస్ పరిస్ధితి అగమ్య గోచరంగా వుంది. రాహుల్ గాంధీయే ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్. నెహ్రూ- గాంధీల హాయంలో యుపిలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం మిణుకు మిణుకు మంటూ వుంది. ఐతే 2009లో రాహుల్ కృషితో ఆ పార్టీ గౌరవప్రదమైన స్ధానాలు దక్కించుకుంది. కానీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ మేజిక్ పని చేస్తుందా అనే దానిపై రాజకీయ విశ్లేషకులు భిన్నా భిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాలుగా యుపిని విభజిస్తే లబ్ధిపొందేది బిఎస్పీయేనని వారి అంచనా. కేవలం మధ్య యుపిలో మాత్రమే ఎస్పీ ప్రభావం వుండేఛాన్స్ వుంది. పశ్చిమ యుపిలో బిజెపి గణనీయంగా ప్రభావం చూపవచ్చంటున్నారు. దీనితో కాంగ్రెస్ పరిస్ధితి విశ్లేషకుల అంచనాలకు అందటం లేదు. కాంగ్రెస్ పరిస్ధితి ఇంతగా దిగజారటానికి పలు కారణాలున్నాయని చెపుతున్నారు. 90 వదశకం నుంచి బిఎస్పీ, ఎస్పీ, బిజెపిలు యుపిలో రాజ్యం ఏలటంతో కాంగ్రెస్ క్యాడరను దాదాపుగా కోల్పోయింది. పైగా ఈమూడు పార్టీల వల్ల కండ బలం , ధన బలం వున్న నేతలు యుపిలో తయారయ్యారు. బిఎస్పీ సర్కార్ పై ఎన్ని ఆరోపణలు వున్నప్పటికీ 11వ పంచవర్ష ప్రణాళికలో 7.28 శాతం జాతీయాభివృద్ధి రేటు సాధించాలని నిర్ధేశించగా యుపి 6.10 శాతం సాధించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీని దెబ్బతీయాలన్న కాంగ్రెస్ ఆశలు ఫలించేలా కనిపించటం లేదు. 80 లోక్ సభ స్దానాలు వున్న యుపితో ఢిల్లీ పీఠాన్ని శాసించే సత్తా వుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఆ రాష్ట్రంలో పాగాకు ప్రతి పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. 80 సీట్లలో మెజార్టీ స్ధానాలు దక్కించుకున్న వారే భవిష్యత్ దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా నిలవనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Satya sai baba birthday celebrations
Stalwarts of t agitation meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles