The Biography Of Sonty Sarada Purna Who Made Sri Foundation In Chicago To Save Indian Cultural traditions

Sonty sarada purna biography sri foundation chicago indian cultural traditions

Sonty Sarada Purna history, Sonty Sarada Purna life story, sri foundation in chicago, Sonty Sarada Purna photos, Sonty Sarada Purna updates, indian famous women, women empowerment

Sonty Sarada Purna Biography Sri Foundation Chicago Indian Cultural traditions : The Biography Of Sonty Sarada Purna Who Made Sri Foundation In Chicago To Save Indian Cultural traditions.

అమెరికాలో దేశ సంస్కృతిని పరిరక్షించేందుకు

Posted: 10/09/2015 06:44 PM IST
Sonty sarada purna biography sri foundation chicago indian cultural traditions

భారతదేశంలో పాశ్చాత్త సంస్కృతి ఎంతమేర వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన దేశ సంస్కృతీ సంప్రదాయాలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. నేటి యువతలో కేవలం పాశ్చాత్త లక్షణాలే తప్ప.. దేశ సంస్కృతి ఏమాత్రం కనిపించడం లేదు. కానీ.. కొందరు మాత్రం అందరికి విరుద్ధంగా దేశ సంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో శొంఠి శారదాపూర్ణ ఒకరు. ఉత్తమ చదువులు అభ్యసించి రచయిత్రిగా ఎదిగిన ఈమె.. అమెరికాలో భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలను పరిరక్షించేందుకు ‘శ్రీ ఫౌండేషన్’ స్థాపించారు. స్వాతంత్రసమరయోధులైన ‘సుసర్ల గోపాలశాస్త్రి’ కుమార్తె అయిన ఈమె.. చికాగోలో తెలుగు స్టడీస్ సెంటర్ డైరక్టరుగా పనిచేస్తున్నారు.

జీవిత విశేషాలు :

శొంఠి శారదాపూర్ణ తిరుపతిలో జన్మించారు. కోస్తా ప్రాంత నగరమైన విశాఖపట్నంలో పెరిగింది. ఆమె తండ్రి ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుదు, ఆజాద్ హింద్ ఫొజ్ సభ్యుడు అయిన సుసర్ల గోపాలశాస్త్రిగారు. 1975లో ఆమె అమెరికాకు వలస వెళ్ళారు. ఆమె 1997లో తెలుగుభాషలో డాక్టరేట్ పొందడంతోపాటు త్రిపురనేని గోపీచంద్ గోల్డ్ మెడల్ ను పొందారు. 2010లో సంస్కృత భాషలో రెండవ డాక్టరేటు డిగ్రీని పొందారు. భారతదేశంలోని ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి సంగీత శాస్త్రంలో డి.లిట్ చేశారు. ఆమె భారత దేశంలో భాష, సాహిత్యం, కళా ప్రదర్శనలపై గణనీయంగా కృషిచేసారు.

1989లో ఎటువంటి లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థ అయిన ‘సప్నా’ (అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ నార్త్ అమెరికా)ను ఆమె స్థాపించారు. అదే సంవత్సరంలో చికాగో నగరంలో ‘శ్రీ ఫొండేషన్’ను స్థాపించారు. ఈ సంస్థను అమెరికాలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించేందుకుగాను స్థాపించారు. ఆమె 2000లో ‘సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్’ను స్థాపించారు. రచయిత, పండితురాలు కూడా అయిన శారదా.. 8 పుస్తకాలను ప్రచురించారు. ‘బ్రహ్మి’ అనే త్రైమాసిక జర్నల్ కు ఆమె యజమాని, సంపాదకురాలు. ఆరు సంవత్సరాలపాటు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి విజిటింగ్ ప్రొఫెసర్, ప్రోగ్రాం కో-ఆర్దినేటరుగా పనిచేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonty Sarada Purna  Indian Famous Women Writers  Sri Foundation Chicago  

Other Articles