The Biography Of Famous Actress TR Rajakumari Who Was Called As Dreamgirl Of South Film Industry | South Film Actresses

Tr rajakumari biography south film industry dreamgirl

tr rajakumari history, tr rajakumari biography, tr rajakumari life story, tr rajakumari photos, tr rajakumari family, south film industry dreamgirl, south film industry, south film actresses, beatiful heroines

TR Rajakumari Biography South Film Industry DreamGirl : The Biography Of Famous Actress TR Rajakumari Who Was Called As Dreamgirl Of South Film Industry.

సౌత్ ఇండస్ట్రీలో ‘డ్రీమ్‌గర్ల్’గా పేరుగాంచిన మొదటి తార

Posted: 09/22/2015 06:00 PM IST
Tr rajakumari biography south film industry dreamgirl

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన కథానాయికల్లో టీ.ఆర్.రాజకుమారి ఒకరు. మేనిమెరుపు సౌందర్యం కలిగిన ఈమె.. ఆనాడు ‘డ్రీమ్‌గర్ల్’గా పిలిపించుకున్న మొదటితారగా ప్రసిద్ధి గాంచింది. అందంతోపాటు తన అభినయంతో ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. తమిళనాటలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈమె.. తరువాతికాలంలో ఇతర దక్షిణ భాషల పరిశ్రమల నుంచి అవకాశాలు పొందుతూ.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

జీవిత విశేషాలు :

1922లో బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రసిడెన్స్, తంజావూరులో రాజకుమారి జన్మించింది. ఈమె పిన్ని ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి కూడా తమిళ సినీ పరిశ్రమలో నటిగా వుండటం కారణంగా రాజకుమారి సినీ ప్రస్థానం మరింత సులువుగా కొనసాగింది. ఆమె కారణంగా సినీ రంగానికి పరిచయమైన రాజకుమారి.. అనతికాలంలోనే తన ప్రతిబతో దూసుకెళ్లింది. 1941లో విడుదలైన రాజకుమారి ‘కుమార కుళోత్తుంగన్’ సినిమా ద్వారా ఈమె కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.

మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేయడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి. ఆ సినిమా తర్వాత రాజకుమారి నటించిన ‘కచదేవయాని’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆమె ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది. ‘మంత్రావతి’, ‘సూర్యపుత్రి’, ‘మనోన్మణి’ తదితర చిత్రాలు ఆమెను ఆనాటి కుర్రకారుకు కలలరాణిని చేశాయి. 1948లో రాజకుమారి కథానాయికగా నటించిన ‘చంద్రలేఖ’ చిత్రం ఆనాడు సంచలనాత్మక విజయం సాధించింది. ఆ చిత్రం అటు తమిళనాడులోనే కాక, ఆంధ్రదేశంలోనూ రజతోత్సవం జరుపుకుంది. దాంతో రెండు భాషల్లోనూ రాజకుమారి పేరు మారుమ్రోగింది.

రాజకుమారి కుటుంబమంతా సినిమా రంగానికి చెందినవారే. అక్క తమిళనటి.. అక్క కూతురు కుచలకుమారి ప్రసిద్ధ సినీ నర్తకి.. సోదరుడు టి.ఆర్.రామన్నతోపాటు మరో సోదరుడు టి.ఆర్.చక్రపాణి కూడా నిర్మాతే.. రామన్న భార్యలు బి.ఎస్.సరోజ, ఇ.వి.సరోజ ఇద్దరూ నటీమణులే.. శృంగార తారలు జ్యోతిలక్ష్మి, జయమాలిని రాజకుమారి చెల్లెలి కూతుళ్లే.

శిల్పసుందరిలా ఎంతో అందంగా వుండే రాజకుమారికి సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. అయితే.. ఆమెకు తన చివరి రోజుల్లో కుష్ఠు వ్యాధి వచ్చింది. దీంతో ఎవరినీ కలవలేని పరిస్థితి. మరీ ఆత్మీయులెవరైనా వస్తే తెరచాటు నుంచి మాట్లాడేది. ఈ వ్యాధి కారణంగా ఆమె 1999 సెప్టెంబరు 20వ తేదీన మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tr rajakumari  south film actresses  

Other Articles