The Biography Of Anandibai Gopalrao Joshi Who Was The First Indian Female Physician

Anandibai gopalrao joshi biography first indian female physician

anandibai history, anandibai joshi life story, anandibai wikipedia, anandibai biography, anandibai joshi biography, first female physician, anandibai life story, anandibai journey, anandibai personal life, western medicine, united states

Anandibai Gopalrao Joshi Biography first Indian female physician : The Biography Of Anandibai Gopalrao Joshi Who was one of the first South Asian female physicians and first Indian female physician, to be trained in western medicine. She was the first female of Indian origin to study and graduate with a degree in medicine in the United States.

పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొదటి భారతీయ మహిళ

Posted: 08/11/2015 05:28 PM IST
Anandibai gopalrao joshi biography first indian female physician

19వ శతాబ్దం.. బ్రిటీష్ పరిపాలకులు దేశాన్ని శాసిస్తున్న కాలం. అదే సమయంలో మహిళలు సమాజంలో ఏమాత్రం ప్రాధాన్యత, గౌరవం లేదు. ‘లక్ష్మీదేవత’గా గుర్తించే మహిళలకు ఆనాడు బానిస బతుకులే దిక్కు. అటువంటి సమాజంలో ‘మహిళ’ అనే పదానికి కొందరు సరైన నిర్వచనం ప్రపంచానికి తెలియజేశారు. స్త్రీలు కేవలం ఇంటికే పరిమితమై బానిస బతుకు జీవించడమే కాదు.. తామూ తలచుకుంటే ఏమైనా సాధించగలమన్న విషయాన్ని తెలియజేశారు. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అలాంటివారిలో ఆనందీబాయి జోషీ ఒకరు. పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొదటి బారతీయ మహిళా వైద్యురాలిగా ఈమె చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూమహిళ కూడా ఈమెనని భావన.

జీవిత విశేషాలు :

1865 మార్చి 31వ తేదీన పూణే (మహారాష్ట్ర) లోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో ఆనందీబాయి జన్మించారు. ఈమెకు తన 9 ఏటలోనే 20 సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషితో వివాహం జరిగింది. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. అతను మహిళల విద్యకు మద్దతు పలికారు. ఇక తన భార్య అయిన ఆనందీబాయికి విద్యపై వున్న ఆసక్తి గమనించి.. ఆమెకు ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. వీరి జీవితం సుఖసంతోషాలతో సజావుగా సాగుతూ వచ్చింది. అయితే.. ఆనందిబాయి 14వ ఏటలో వున్నప్పడు ఆమె జీవితంలో ఓ మరుపురాని సంఘటన జరిగింది. అదేమిటంటే.. ఆమె ఒక బాలుడికి జన్మనిచ్చింది. ఆనాడు అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో ఆ బాలుడు పది రోజుల్లో చనిపోయాడు. ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక మలుపును తీసుకొచ్చింది. తనను తాను వైద్యురాలిగా మలుచుకునేందుకు అది ప్రేరణనిచ్చింది.

వైద్యంలో పట్టబధ్రత :

ఆనందీబాయి అమెరికాలో వైద్య విద్యాభ్యాసానికి ఒంటరిగానే వెళ్లారు. ఆనాడు విపరీతమైన వ్యతిరేకతలు వచ్చినప్పటికీ ఆమె 1883 జూన్ మాసంలో అమెరికాలో అడుగుపెట్టారు. పెన్సిల్వేనియా మహిళా వైద్యకాలేజీలో వైద్యవిద్యకై ఈమె దరఖాస్తు చేసుకున్నారు. చాలాదూరం నుంచి విద్యాభ్యాసం ఈమె రావడం చూసి ప్రభావితమైన ఆ కాలేజీ సెక్రెటరీ, సూపరింటెండెంట్.. ఆమెకు అక్కడ 3 సంవత్సరాలపాటు 600 అమెరికన్ డాలర్లను ఉపకారవేతనం ఏర్పాటు చేసింది. అలా ఆ విధంగా ఆమె 19వ యేట తన వైద్య విద్యను ప్రారంభించింది. అయితే.. అక్కడి శీతోష్ణస్థితి కారణంగా ఈమె తీవ్ర ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండు సంవత్సరాల అమెరికా వాసం తర్వాత ఆమెకు అపస్మారకం, తీవ్ర జ్వరం అధికమైంది. అప్పటినుంచి ఆమెకు దగ్గు మొదలైంది.

అంతటి తీవ్ర ఆరోగ్య సమస్య బారిన పడినప్పటికీ ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మూడు సంవత్సరాల ఉన్నతవిద్యాభ్యాసం పూర్తిచేసి.. ఫైనల్ పరీక్ష వ్రాసింది. 1886 మార్చి11వ  తేదీన ఆమె వైద్యవిద్యలో డాక్టరేట్ సాధించింది. ‘ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ-శిశు సంబంధిత వైద్యం’ అంశంపై ఆమె పరిశోదనాంశం వుండేది.  స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని పంపింది. ఆమె పట్టభద్రోత్సవంలో ఆమె భర్త కూడా పాల్గొన్నారు. ఆ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం ఆమెకు మరపురాని అనుభూతిని కలుగజేదిందని ఆమె తన కథనాలలో పేర్కొన్నది. కాలక్రమంలో ఆమె ఆరోగ్యం మరింత దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయ వ్యాధిగా నిర్ధారించబడింది. అయినా వ్యాధి ఇంకా ఊపిరితిత్తులని చేరలేదు. వైద్యులు ఆమెను భారతదేశానికి తిరిగివెళ్ళమని సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరించింది.

అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారింది. కలకత్తా చేరిన తరువాత ఆమె బలహీనత, నిరంతర తలనొప్పి, తరచూ జ్వరం, ఆయాసాలతో బాధపడింది. ఆనాడు థియోడిసియా ఆమెకు అమెరికా నుండి ఔషధాలను పంపింది. తరువాత ఆమె ఆయుర్వేద చికిత్స కోసం కజిన్ ఇంట్లో బసచేసింది. ఆయుర్వేద వైద్యనిపుణుడు ఆమె నౌకాయానం చేసి విదేశాలకు వెళ్ళి సంప్రదాయ సరిహద్దులు దాటినందుకు ఆమెకు చికిత్స చేయడానికి నిరాకరించాడు. దీంతో సరైన చికిత్సం అందకపోవడంతో ఆమె ఇండియాకు తిరిగివచ్చిన ఒక్క సంవత్సరంలోగా అంటే.. 1887 ఫిబ్రవరి 26వ తేదీన 22 సంవత్సరాల చిరుతప్రాయంలో అకాలమరణం చెందారు. ఆనందీబాయి మరణానికి దేశం అంతటా విషాదం ఆవరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anandibai gopalrao joshi  telugu famous women  

Other Articles