The Biography Of Justice Amareswari Konamaneni Who Was The First Women Judge Of AP High Court

Justice amareswari konamaneni biography first women judge of ap high court

Justice Amareswari biography, Justice Amareswari life story, Justice Amareswari konamaneni life story, Justice Amareswari special story, Justice Amareswari photos, Indian First Woman Judge, Ap High Court First Woman Judge

Justice Amareswari Konamaneni Biography First Women Judge Of AP High Court : Justice K. Amareswari was the first woman judge of the Andhra Pradesh High Court. She became the first lady judge.

దేశంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ

Posted: 07/14/2015 02:21 PM IST
Justice amareswari konamaneni biography first women judge of ap high court

సమాజంలో స్త్రీలకు ఇంకా సరైన గౌరవం, మర్యాద లభించిన రోజుల్లో కొందరు మహిళలు వివిధ రంగాల్లో తమ సత్తా చాటుకుని సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. పురుషులకు తాము ఏమాత్రం తీసిపోమని ఆరోజుల్లో చేసి నిరూపించారు. తాము తలుచుకుంటే ఏ రికార్డులనైనా బద్దలు కొడతామంటూ మహిళలు ముందుకు దూసుకెళ్లారు. అలాంటి వారిలో జస్టిస్ అమరేశ్వరి ఒకరు. ఒక సాధారణ వ్యవసాయం కుటుంబంలో జన్మించిన ఆమె.. దేశంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలిమహిళగా రికార్డు సృష్టించారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో పేదరికం ఏమాత్రం అడ్డురాదని నిరూపించిన ఆమె.. సాటి మహిళల్లో ఏమైనా సాధించగలమన్న చైతన్యాన్ని నింపారు.

జీవిత విశేషాలు :

1928 జులై 10వ తేదీన గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబములో అమరేశ్వరి జన్మించారు. బాల్యం నుంచే విద్యాభ్యాసంలో ఎంతో చురుకుగా వుండేది. పై చదువులు చదవాలని ఈమెకు కోరికలున్నప్పటికీ.. కుటుంబసభ్యులు ఆమె 14వ ఏటలోనే పెళ్లి చేశారు. వివాహం అయిన తర్వాత విద్యాభ్యాసం మీద ఆమెకున్న ఆసక్తిని గమనించిన ఆమె భర్త ఆమెకు ప్రోత్సహించారు. భర్త ప్రోత్సాహంతో ఆమె చదువు సాగించి.. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నుండి రాజకీయ శాస్త్రము, చరిత్రలో 1948 సంవత్సరములో M.A పట్టభద్రురాలయ్యారు. అనంతరం న్యాయశాస్త్రంలో కూడా ఆమె పట్టా పొంది.. మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేశారు.

1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలు. ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు)లో 1978 ఏప్రిల్ 29వ తేదీన న్యాయమూర్తిగా నియమింపబడి దేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు. ఈమె పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి.. 1990 సంలో సీనియర్ గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు. ఈమె 1975-1976 మధ్యకాలంలో భారత మహిళా న్యాయవాదుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా.. ఆంధ్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె అనారోగ్య కారణాల వల్ల 2009 జులై 25వ తేదీన న్యూఢిల్లీలో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles