Anasuya kulkarni biography famous musician

anasuya kulkarni news, anasuya kulkarni biography, anasuya kulkarni performances, anasuya kulkarni latest news, anasuya kulkarni life story, anasuya kulkarni life history, anasuya kulkarni family members, anasuya kulkarni

anasuya kulkarni biography famous musician : the biography anasuya kulkarni who is named as famous musician. She gave some musical performances around the world

సంగీత విధ్వాంసురాలిగా ఘనత సాధించిన నటి

Posted: 12/02/2014 03:04 PM IST
Anasuya kulkarni biography famous musician

నేటి జనరేషన్’లో పురుషులతోబాటు సమానంగా మహిళలు కూడా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే! కానీ దశాబ్దాల క్రితం అలా వుండేదికాదు. ఏ రంగంలోనైనా రాణించాలన్నా సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అటువంటి సమయంలో కూడా కొందరు మహిళామణులు ఆత్మస్థైర్యంతో ముందడుగువేసి నలుగురికి ఆదర్శంగా నిలిచినవారున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాము అందరికంటే తక్కువకాదంటూ అన్నిరంగాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోగలిగారు. అటువంటివారిలో అనసూయ కులకర్ణి కూడా ఒకరు.

అనసూయ ప్రముఖ సంగీత విధ్వాంసురాలు, తెలుగు సినిమా నేపధ్య గాయని. లలితకళల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగిన ఈమె.. అందులో అభ్యాసం పొంది అవలోకన చేసుకున్నారు. అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు.. విదేశాల్లో సైతం విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.

జీవిత విశేషాలు :

బాల్యంనుంచే సంగీతంపై ఎక్కువ ఆసక్తిని కనబరిచిన ఈమెను ఆమె తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు. అందులో భాగంగానే ఆమెకు సంగీతరంగంలోనే ప్రత్యేక శిక్షణను కల్పించారు. అలా వారి ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలోగాన కళారత్న ఆర్‌.ఆర్‌.కేశవమూర్తి శిష్యరికంలో ఆమె ఓనమాలు దిద్దింది. అనంతరం 1952లో బెంగుళూరు ఆల్‌ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నై మ్యూజిక్‌ అకాడమీ నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకొని, విశేషంగా నిలిచింది. ఆనాడు ఆమె గానమాధుర్యానికి ఆకర్షితులైన ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు.. 1961లో అతను తెరకెక్కించిన ‘భక్తప్రహ్లాద’ చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.

వివాహం చేసుకున్న తర్వాత దేశవిదేశాలు తిరిగిన ఈమెకు.. అక్కడి సంగీత వాతావరణాన్ని తెలుసుకోవడంతో ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. ఉద్యోగరీత్యా భర్త మారిన ప్రదేశాల్ల ప్రముఖ సంగీత కళాకారుల దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం ఆమెకు లభించింది. ఆ విధంగా శిక్షణ తీసుకున్న ఆమె ఆయా ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ... వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anasuya kulkarni  telugu musicians  telugu actresses  telugu news  

Other Articles