Anuradha sriram biography classical movie singer

anuradha sriram news, anuradha sriram latest news, anuradha sriram biography, anuradha sriram wikipedia, anuradha sriram wiki, anuradha sriram story, anuradha sriram life history, anuradha sriram life story, anuradha sriram history, anuradha sriram photos, anuradha sriram songs, anuradha sriram movies, anuradha sriram kahceris

anuradha sriram biography classical movie singer

శాస్త్రీయ సంగీతంతో ఆకట్టుకుంటున్న అనురాధ!

Posted: 11/11/2014 01:42 PM IST
Anuradha sriram biography classical movie singer

‘‘ప్రేమకథ’’ చిత్రంలో ‘‘దేవుడు కరుణిస్తాడనీ.. వరములు కురుపిస్తాడనీ’’ అనే పాట అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పటికీ ఆ పాటను ప్రతిఒక్కరు తీపిగా ఆస్వాదిస్తూనే వుంటారు. ఎందుకంటే.. ఆ పాటలో వినిపించే గళం ఎంతో మధురంగా వుంటుంది కాబట్టి. అంతటి మధురమైన గళంతో ఆ పాటను పాడిన నేపథ్య గాయనియే అనురాధ శ్రీరామ్! కర్నాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన అనురాధ... తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అనేక భాషాచిత్రాల్లో కొన్ని పాటలకు తన స్వరాన్న అందించి.. ఎందరో ప్రేక్షకాభిమానులను అలరించింది.

వ్యక్తిగత జీవితం :

1970 జూలై 9వ తేదీన చెన్నైలో నివాసముండే రేణుకాదేవి, మీనాక్షి సుందరంమోహన్ దంపతులకు అనురాధ జన్మించింది. ఆమె తల్లి రేణుణదేవి కూడా నేపథ్యగాయని కావడం వల్ల అనురాధకు ఆ రంగంలో రావడానికి కాస్త సులువైందని చెప్పుకోవచ్చు. అనురాధ చెన్నైలోనే తన పాఠశాల విద్యనభ్యసించిన తర్వాత క్వీన్స్ మేరి కళాశాలనుంచి సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీని సంపాదించుకుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డిగ్రీ, పీజీ లేవల్ లో ఆమె చదువుతున్న నేపథ్యంలో గోల్డ్ మెడల్ ను కూడా సాధించింది. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లడానికి ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ లభించింది. శాస్త్రీయ సంగీతంలో ఉద్దండులైన ఎస్‌.కళ్యాణరామన్‌ నుంచి ఆమె కర్నాటక శాస్త్రీయ సంగీతంలో, మాణిక్‌ బువా టాకుర్‌ దాస్‌ వద్ద హిందుస్తానీ సంగీతంలో ప్రావీణ్యం పొందారు.

మరికొన్ని విషయాలు :

శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన అనంతరం వెయ్యికిపైగా కచేరీల్లో తన గాత్రాన్ని వినిపించి శాస్త్రీయ సంగీతాభిమానులను ఆకట్టుకుంది. కర్నాటక సంగీతంలో వివిధ రాగపై ఈమెకు మంచి పట్టు వుండటంతో సినిమాల్లో పాడే అవకాశాలు చాలానే వచ్చాయి. ఆ సమయంలోనే ఆమె ప్రతిభను గుర్తించిన ఏ.ఆర్.రెహ్మాన్ తన చిత్రం ‘ఇందిర’లో ‘ఇని ఇచ్చంలో ఇళ్లే’ పాట పాడేందుకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత తమిళ చిత్రం ‘గోపుర ద్వీపం’ (1997)లో ఆమె పాడిన పాట ‘ఉల్లామే ఉనకుతన్’ అనే పాట నేపథ్యగాయనిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె భర్త విద్వాన్ శ్రీరామ్ పరశురామ్ కూడా హిందుస్తానీ సంగీతంలో గొప్ప విద్వాంసుడు.

ఆమెకు లభించిన అవార్డులు :

1. బెస్ట్‌ సెన్సేషనల్‌ సింగర్‌ అవార్డు - మలై కొట్టా (2007)
2. సౌత్‌ స్క్రీన్‌ విడియోకాన్‌ అవార్డు- చెన్నై గాళ్‌
3. ది ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా గోల్డ్‌ మెడల్‌ అవార్డు
4. ఉత్తమ నేపథ్యగాయనీ అవార్డు- ఆశై (1995)
5. డాజె.జయలలితా సినీ అవార్డు
6. 3 సార్లు ఉత్తమ నేపథ్యగాయనీ అవార్డు
7. కళైమామని అవార్డు
8. అజంతా అవార్డు (1996)
9. నాళం నాళం ( జాతీయ ఉత్తమ గాయనిగా నామినేషన్‌)
10. ‘జెమిని’ చిత్రంలో పాటకు గాను ఐఐఎఫ్‌ఏ ఉత్తమ నేపథ్య గాయనీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anuradha sriram  indian classical singers  telugu movie singers  telugu news  

Other Articles