Social reformer savitribai phule

Social Reformer Savitribai Phule, Savitribai Phule Life History, Jyotirao Phule,

Social Reformer Savitribai Phule, Savitribai Phule Life History, Jyotirao Phule,

ఆదర్శ మూర్తి సావిత్రి భాయి పూలె

Posted: 01/04/2014 06:17 PM IST
Social reformer savitribai phule

ఆమె పేరు వినబడితే కోటానుకోట్ల శాంతి కపోతాలు రెక్కలు విప్పార్చి ఆకాశంలోకి ఎగిరిపోతున్న అనుభూతి కలుగుతుంది. ఆమె స్మృతి మదిలో మెదిలితే సంకెళ్ళు తెగుతున్న స్వేచ్ఛా రాగం ఒక అమృతగానమై వినిపిస్తుంది. ఆమె చిత్తరువు ముందు నిలబడితే సగం ఆకాశం నేల మీదికి వంగి భూమి చుబుకాన్ని ముద్దాడినట్లు, భూమి బంధనాలను తెగతెంచుకుని ఆకాశంలోకి జెండాలా ఎగిరినట్లు, ఒక విముక్తి దృశ్యం కనులముందు కదులాడుతుంది. ఆమే సావిత్రిబాయి పూలే.

సావిత్రిబాయి పూలే జనవరి 3, 1831 లో మహారాష్ట్రలోని సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో, నైగావ్ గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. 1840 లో మహాత్మా జ్యోతిరావ్ పూలే తో జీవితాన్ని పంచుకున్నారు. ఆయన ప్రోద్భలంతో 1841 లో విద్యాభ్యాసం ఆరంభించారు. అందుకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురైనా ధైర్యంగా నిలబడటమే కాదు, జ్యోతిబాయి పూలే మొదలుపెట్టిన సాంఘిక, విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.

భర్త అడుగుజాడల్లో..

సావిత్రిబాయి అగ్రకులాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని భర్త నుండే అందుకున్నారు. అనివార్య, అననుకూల సామాజిక స్థితిలో ఉపాధ్యాయురాలి వృత్తిని చేపట్టారు. అందుకు ఆధపత్య వర్ణాల ఛీత్కారాలు విన్నారు. రాళ్ల దెబ్బలు తిన్నారు. కూడబెట్టుకున్న ధైర్యంతో భౌతిక దాడులను తిప్పికొట్టారు. ఆధిపత్య వర్ణాల వారికే కాదు, అణచివేతకు గురవుతున్న వర్గాల మహిళలకు, ఆడ పిల్లలకు చదువు అవసరాన్ని తెలియజెప్పారు. వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకుల కోసం రాత్రి పాఠశాలలను ప్రారంభించారు.

జ్యోతిరావు పూలే మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించటంలో అతని వెన్నంటి ఉన్నారు సావిత్రీబాయి పూలే. 1876 – 77 మధ్య కాలంలో మహారాష్ట్రలో దాదాపు 50 విద్యాసంస్థలను నెలకొల్పారు. జ్యోతిబాపూలే జీవిత సహచరిగా, సామాజిక కార్యకర్తగా నిత్య చైతన్యంతో పనిచేసారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.

యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తో కల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెను మార్చి 10, 1897 లో కబలించింది.

మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవిత సహచరిణిగా ఆయన నుండి ఎంతో స్ఫూర్తిని పొంది ఆయనకు ఎంతో ఉత్తేజాన్నిచ్చి ఒక యుగం ఆలోచనలకు నాయకత్వం వహించిన మహోన్నత వ్యక్తిత్వాలకు సావిత్రిబాయి రచనలు తన అనుభవాలను, అభిప్రాయాలను అనేక రూపాల్లో అక్షరీకరించారు సావిత్రీబాయి పూలే. ఆ తర్వాత కాలంలో ‘కావ్యపూలే ’, ‘బవన్ కాశి సుబోధ్ రత్నాకర్ ’ పేరుతో ఆమె రచనలు ముద్రించబడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles