Articles about satabdi roy

Bangla Actress Shatabdi Roy, Bengal cinema industry, Bengali actress and Politician, Beauty of Veteran

Shatabdi Roy is another famous Bengali actress and Politician who rocks the Bengal cinema industry over several decades.

శతాబ్దిరాయ్ గురించి

Posted: 06/13/2013 04:51 PM IST
Articles about satabdi roy

నటిగా, దర్శకురాలిగా, రాజకీయ నాయకురాలిగా, రచయితగా ఆమె విభిన్న రంగాల్లో రాణించారు శతాబ్ది రాయ్‌. దాదాపు 50కు పైగా చిత్రాల్లో వివిధ పాత్రలను పోషించి భేష్‌ అనిపించు కున్నారు. పలు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనేవారు. అధికారం కూడా తోడుంటే ఎక్కువ సేవ చేయవచ్చు అని భావించి రాజకీయాల్లోకి వచ్చారు. తొలి ప్రయత్నంలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా విజయం సాధించారు.

అక్టోబర్‌ 5, 1969లో కలకత్తాలో జన్మించిన శతాబ్ది రాయ్‌ 2009లో బీర్‌భమ్‌ నియోజవర్గం నుంచి సాధారణ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. రాజకీయ రంగ ప్రవేశం కంటే ముందుగా శాతబ్దిరాయ్‌ సినీ రంగంలో ఎన్నో చిత్రాల్లో నటించారు. సినీనటిగానూ, డైరెక్టర్‌గానూ, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బెంగాలీ భాషలో సినిమా ట్రైనింగ్‌లో చేరేవారికి టీచర్‌గా శిక్షణను కూడా అందించేవారు. అంతేకాదూ వీటితో పాటు బెంగాలీ రచయితగా, పద్యాలు రాసేవారు. ఇప్పటికి కూడా చాలా బిజీగా గడుపుతుంటారు. ఎందుకంటే పార్లమెంట్‌ సభ్యురాలిగా సమావేశాలతో చాలా బిజీగా ఉంటున్నారు. రాజకీయ రంగంలో ఆమె ఎజెండాగా ఉన్న వాటిలో ముఖ్యంగా రహదారులు బాగుచేయడం, విద్యుత్‌, హాస్పిటల్స్‌, పాఠశాలలను అభివృద్ధి చేయడం ఆమె ముఖ్య ఉద్ధేశ్యం.

అవార్డులు

శతాబ్ది రాయ్‌ బెంగాలి ఫిల్మ్‌లో జర్నలిస్ట్‌ అవార్డును అందుకున్నారు. బెస్ట్‌ సినీ నటిగా 2005లో దెబిపక్ష అనే సినిమాకు అవార్డును అందుకున్నారు. అక్టోబర్‌ 5, 1969 అగర్‌పారలో షైలిన్‌, నీలిమా రాయ్‌లకు జన్మించారు. 1985లోనే పాఠశాల విద్య అంత సరోజిని హైస్కూల్‌లో అభ్యసించారు. కలకత్తాలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన జోగమయదేవి కళశాలలో డిగ్రీని పూర్తి చేశారు. 1986లో రాయ్‌ ఒక సినిమాను తీశారు. దీనికి డైరెక్టర్‌ తాపాన్‌ సిన్హా . సినిమా పేరు అతంకా. అంతకంటే ముందు దినన్‌ గుప్తా అనే డైరెక్టర్‌తో తిన అనే సినిమాను తీశారు కానీ అది అనివార్య కారణాల వల్ల ఇప్పటికి విడుదల కాలేదు. ఇటివల చాలా చిత్రాలలో నటించడమే కాకుండా, డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్‌ అనే చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహించారు. 2009లో సాధారణ ఎన్నికల్లో శతాబ్ది రాయ్‌ ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా సరదా గ్రూప్‌ అనే స్కీమ్‌కు బ్రాండ్‌ అంబాషిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఎప్పుడైతే షూటింగ్‌లకు మానివేశారో అప్పటినుంచి సినిమా భోదనలు చేస్తున్నారు. శతాబ్ది సంస్థను స్థాపించి సినిమాలో నటించే వారికి మెళకువలు నేర్పుతున్నారు. వారి సంస్థలో శాతబ్ది రాయ్‌తో పాటు వారి కుమారుడు సామ్యారాజ్‌ (టోజ్‌), రాయ్‌ భర్త మ్రిగాంక్‌ బెనర్జీ (మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు) కూడా కొన్ని సమయాలలో సంస్థకు సేవలందిస్తున్నారు. దాదాపు 150 సినిమాల దాక రాయ్‌ నటిచడం జరిగింది. గ్లామర్‌ ప్రపంచాన్ని ఎందుకు విడిచిపెట్టారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే ’దెశసేవ, ప్రజాసేవ నా లక్ష్యం అంటుంది. వ్యక్తి గతంగా కొంతమందికే ఉపయోగపడతాం. కానీ అందరికీ ఉపయోగపడాలంటే రాజకీయ రంగమే ఉత్తమం అంటుందామె. భర్త పిల్లాడి చదువు సంధ్యలు చూశాకే, నా పనులు చేసుకుంటాను.

బీర్‌భమ్‌లో తగిన స్కూల్స్‌, ఆస్పత్రులు, కనీస అవసరాలు లేవు. ముందు ఆ సౌకర్యాలకై ప్రయత్నిస్తాను. ఈమె కథలు, కవితలు రాస్తుంది. డజనుకు పైగా పుస్తకాలు బెంగాలీలో పబ్లిష్‌ అయ్యాయి. గ్లాస్‌ పెయింటింగ్‌ వేస్తుంది. ఎక్జిబిషన్స్‌లో పాల్గొంటుంది. మూడు సినిమాలను డైరెక్టు చేసింది. ఇందిరాగాంధీ అంటే ఇష్టం. మమతాబెనర్జీ తనకు ఆదర్శం. మరి ఇన్ని రకాల కళలు దాగున్న ఈమె పేరుకూడా కొత్తగా ఆకర్షణీయంగా ఉందికదూ ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles