Hindu mythology ahalya

ahalya, ramayana, gautama maharishi, valmiki ramayana, ahalya any role to play in ramayana

Hindu mythology, Ahalya

'నేటి మహిళ స్థితి' ... పురాణాలలో కూడా ఇలాగేనా ???

Posted: 05/23/2013 07:16 PM IST
Hindu mythology ahalya

వారెంచుకున్న రంగాలలో తమకంటూ ప్రత్యెక స్థానాన్ని సంపాదించుకోడానికి కృషి చేసిన , కృషి చేస్తున్న , ఎందరో మహిళలన గురించి యశోధర ప్రస్తావిస్తూనే ఉంది . అయితే , మన పురాణాల్లో , అనిర్వచనీయమైన అందానికి , మంచితనం కూడా తోడయిన ఒక మహిళ గురించి ఈ రోజు మరింత లోతుగా తెలుసుకుందాం . ఈ మహా సాధ్వే , అహల్య

అహల్య అందాల రాశి. గౌతమ మహర్షికి సేవలు చేస్తూ, ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన వ్యక్తి అహల్య. ఆమె ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా, నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయడంతో అహల్యే, గౌతమమునికి తగిన భార్య అనుకున్నాడు బ్రహ్మదేవుడు.

బ్రహ్మదేవుడు గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై, "గౌతమా! నేను నీకేన్నో పరీక్షలు పెట్టాను. అన్నిటిలో గెలిచావు. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నావు. అందుగ్గానూ నీకు గొప్ప అనుకూలవతి అయిన అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను స్వీకరించి, ధన్యుడివి అవ్వు " అంటూ ఆశీర్వదించాడు. అంతేకాదు, స్వయంగా బ్రహ్మదేవుడే దగ్గరుండి, అహల్యా, గౌతముల వివాహం జరిపించాడు.

అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంది.

దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. తన పదవిని కాపాడుకోవడం కోసం అహల్య దగ్గరికి మారువేషంతో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

ఇంద్రుడి అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం, తన పదవిని కాపాడుకోవడం కాదు. దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారకముందే, ఆ కోడి కూసింది.

గౌతమముని కోడి కోత కు లేచి , ఆ సమయం బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరగా కారు చీకటిగా ఉంది. ఎక్కడా వెల్తురు జాడే లేదు.

కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్ధం చేసుకున్నాడు గౌతముడు. నాలుగడుగులు వేసినవాడే తిరిగి వెనక్కి వచ్చాడు. తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. "ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా... తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా? గౌతముడు కోపంతో దహించుకుపోయాడు. దాంతో దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు.

అహల్య తప్పు ఏమీ లేకున్నా, ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగలేదు. క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. "నువ్వు రాయిగా మారిపో" అంటూ శపించాడు. కానీ, వెంటనే దివ్యదృష్టితో అసలేం జరిగిందో చూసి పశ్చాత్తాప్పడ్డాడు. రాముడి పాదం తాకినప్పుడు "రాతివి, నాతివి (రాయి స్త్రీగా మారడం) అవుతావు" అని శాపవిమోచనం ప్రసాదించాడు.

ఆ తరువాత అహల్య ఎలా శాపవిమోచనం పొందిందో మనందరికీ తెలిసినదే .

ఈ పురాణ గాధ ద్వారా, సహానానికి మారు పేరు స్త్రీ అన్న విషయమే కాక , తన తప్పు లేకపోయినా , ఎన్నో సందర్భాలలో అనాధి నుండి ఈ రోజు వరకు కూడా , మహిళ ఏదో ఒక రూపం లో శిక్ష అనుభవిస్తూనే ఉంది అన్న సత్యాన్ని మరొక్కసారి గమనించి , ఏదో మొక్కుబడిగా అన్న చందంగా చట్టాలు చెయ్యకుండా , అవి అమలయ్యే విధంగా , మహిళలకు వేణు వెంటనే న్యాయం జరిగే విధంగా , ఒక దేవతగా కాకపోయినా , సాటి మనిషిగా సమాజం మహిళను గుర్తించి , గౌరవించి , ఆమె ఇష్టాన్ని , పరువుని కూడా గౌరవించే విధంగా మార్పు రావాలి . ఇదే మార్పుని కోరుకుంటోంది , యశోధర .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles