Telugu actress bhanupriya special articles

bhanupriya, telugu actress bhanupriya, bhanupriya stills, bhanupriya pictures, bhanupriya photos, bhanupriya tamil cinema photos,, bhanupriya latest movie, bhanupriya latest movie news,

telugu actress bhanupriya special articles

ఈ అందాల తార , ఆదర్శ మహిళ!

Posted: 05/21/2013 06:23 PM IST
Telugu actress bhanupriya special articles

నటి గా బిజీ గా గడిపినప్పుడు యెంత ఆనందాన్ని పొందానో , పెళ్లి చేసుకుని , తల్లినయ్యి వైవాహిహ జీవితాన్ని ఆనందమయంగా గడుపుతున్నప్పుడు , ఈ విరామం తరువాత తిరిగి సినిమాల్లో తల్లి పాత్రలు పోషిస్తున్నప్పుడు కూడా అంతే ఆనందం పొందుతున్నాను . జీవితం లో అన్ని విజయాలు , అనుబంధాల మాధుర్యాలు చవి చూసినప్పుడు , చూస్తున్న ఇప్పుడు , నాకు ఎంతో సంతోషంగా ఉంది ' అంటారు భానుప్రియ .

తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమా కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టిన 80 లలో , భాను ప్రియ వంటి హీరోయిన్లు తమదైన శైలి లో విజయాలు నమోదు చేసుకుని , స్టార్ హీరోల , పేరున్న దర్శకుల చిత్రాల్లో , ఎంతో ప్రాముఖ్యత కలిగిన హీరోయిన్ పాత్రలు పోషించి , హీరోయిన్ స్థానాన్ని , బ్ల్యాక్ అండ్ వైట్ సినిమాల యుగం తరువాత నిలబెట్టారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు .

ముఖ్యంగా భాను ప్రియ ... అటు ,అందం ఇటు అభినయం , కమర్షియల్ సినిమాలతో పాటు , 'సితార' , 'స్వర్ణకమలం' వంటి కధాబలం ఉన్న , కమర్షియల్ గా విజయం సాధించిన సినిమాలు , ఒక సినిమాలో డబ్బున్న పెద్దింటి పొగరుబోతు అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంటే , ఇంకో చిత్రం లో చలాకీ దొంగ గా హాస్యాన్ని పండించి , మరో చిత్రం లో పేదింటి కష్టాలు తెలిసిన పిల్ల గా నటించి , వెండితెర మీద సినీ తార గా ఇంకో సినిమాలో వెలిగిపోయి , ఇలా నేటికీ ప్రేక్షకులు , తన నటనని , అందాన్ని , నాట్య అభినయాన్ని గుర్తు చేసుకునే విధంగా తెలుగు తెరపై స్థానం సంపాదించుకున్నారు , భాను ప్రియ .

అద్రుస్తవశాత్తు , ఇతర ఎంతోమంది కధానాయికల్లా కాకుండా , భాను ప్రియ తెర వెనుక జీవితం , వైవాహిక జీవితం కూడా ఆనందమయమే . ఈమె భర్త , విదేశాల్లో టెక్నాలజీ ఎడిటర్ గా పని చేస్తున్నారు . భర్తా , పిల్లలతో ఆనందంగా జీవితం గడిపే భాను ప్రియ , నటన తనకున్న మక్కువను చంపుకోలేక , క్యారెక్టర్ ఆర్టిస్టు గా 'ఛత్రపతి' నుండి 'దమ్ము' చిత్రాల వరకు నటిస్తూనే ఉన్నారు , ఇక పై నటిస్తారు కూడా .

ఒక కళాకారుడే ఇంకో కళాకారుడిని అర్ధం చేసుకుంటారు అన్నట్టు , ఈమె భర్త అద్భుతమైన సితార్ వాయిద్యకారుడు . అందుకేనేమో భాను ప్రియ గారి నాట్య నైపుణ్యాన్ని , నతనాకౌసల్యాన్ని అర్ధం చేసుకుని ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు .

తన సినిమాలు చూసే తమ పిల్లలు 'అమ్మ ... నువ్వు చాల బాగున్నావ్ ' అని తనను పొగుడుతూ ఉంటే , ఇంతకు మించిన ఆనందం తనకు ఉండదని భాను ప్రియ చెప్పుకొచ్చారు .

రంగుల ప్రపంచ కాంతిలో కనుమరుగవ్వకుండా , ఇల్లాలిగా తన ఇంటిని చక్కబెట్టుకుంటూ , అమ్మగా పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ , భార్య గా భర్తకు తగిన ప్రోత్సాహం అందిస్తూ , నటిగా తన కరియర్ ను కొనసాగిస్తున్న భాను ప్రియ మరెంతోమంది నేటి మహిళలకు ఆదర్శం .. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles