Interview with indian american astronaut sunita williams

I am so excited. I can't really wait to go,' Indian American astronaut Sunita Williams told Suman Guha Mozumder in a brief telephone interview from Star City last week before being quarantined for the flight preparation | Exclusive! Interview with Indian-American astronaut Sunita Williams

Interview with Indian-American astronaut Sunita Williams.

Interview with Indian-American astronaut Sunita Williams.gif

Posted: 07/18/2012 01:19 PM IST
Interview with indian american astronaut sunita williams

Interview_with_Indian-American_astronaut_Sunita_Williams

Sunithaఅంతరిక్షంలో ఎలా ఉంటుంది? ఎలా పనులు చేసుకోవాలి? మొక్క ఎలా పెరుగుతుంది? మన అన్నం, కూర అక్కడ తినొచ్చా?... ఈ ప్రశ్నలకు అందరికంటే బాగా సమాధానాలివ్వగలిగే వ్యోమగామి సునీతా విలియమ్స్. ఆకాశంలోకి ఎగరాలన్న మనుషుల సామూహిక కలను సాక్షాత్కరింపజేసుకున్న సునీత... 2006లో ‘ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్’కు వెళ్లి, ఆరు నెలలు గడిపి, అరుదైన అనుభవాల్ని సొంతం చేసుకున్నారు. భారతీయ మూలాలున్న ఈ అమెరికన్ ఆస్ట్రోనాట్ మరోసారి అంతరిక్షానికి వెళ్ళి ఘనత సాధించిన ఆమె అంతరంగం.

కుటుంబ నేపథ్యం

నాన్న గుజరాత్‌లోని ఒక పల్లెటూరులో పుట్టి, డాక్టర్‌గా ఎదిగారు (న్యూరో-అనాటమిస్ట్). అమెరికాలో స్థిరపడ్డారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోనూ, బోస్టన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లోనూ పాఠాలు బోధించేవారు. అలాగే ఆ ప్రాంతపు ఆసుపత్రుల్లో పనిచేసేవారు. మా ఇంట్లో మెదడుకు సంబంధించిన డ్రాయింగ్స్ వేలాడుతుండేవి. బహుశా నాన్న ప్రభావం వల్లా, జంతువులంటే ఉన్న ప్రేమ వల్లా చిన్నతనంలో ‘వెటెరినేరియన్’ కావాలనుకున్నాను.

అయితే, అందరు పిల్లల్లాగే నా లక్ష్యాలు కూడా మారుతూ వచ్చాయి. తర్వాత సైన్స్ టీచర్ అవుదామనుకున్నాను. పిల్లలకు పాఠాలు చెప్పడం బాగుంటుంది కదా! కానీ నేను స్వభావరీత్యా ఒక దగ్గర ఆగి పనిచేసే మనిషిని కాదు. ఏదో ఒక నిరంతర వ్యాపకం ఉండాలి. పైగా, క్లాసులో నేను ఎప్పుడూ ‘ఓకే’ విద్యార్థినే. ఫస్టు ఎప్పుడూ రాలేదు. కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ మీద మక్కువ. రన్నింగ్, ట్రయాథ్లాన్, విండ్ సర్ఫింగ్... ఈత అంటే చెప్పనక్కర్లేదు. స్కూలుకు వెళ్లడానికి ముందు, వెళ్లొచ్చింతర్వాత ఈతకొలనులోనే గంటల తరబడి గడిపిన గుర్తు.విమానాల ముచ్చటమహిళలకు విమానాల్ని నడిపే అవకాశం లేదన్నాను కదా! అయితే, ఒక్కోసారి విమానాలు రిపేర్‌కొచ్చి, అవి బాగయ్యాక వాటిని టెస్ట్ ఫ్లైట్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. చిన్న సర్టిఫికెట్ ఉంటే, ఈ ట్రయల్ ఎవరైనా చేయొచ్చు.విమానాల ముచ్చట కూడా తీరుతుంది కదా! అందుకని ‘టెస్ట్ పైలట్ స్కూల్’లో చేరిపోయాను.

క్లాసులో ఓసారి జాన్ యంగ్ చంద్రుడి మీద దింపాల్సిన వాటిని దింపే హెలికాప్టర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓహో, అయితే చంద్రుడి మీదకు వెళ్లడానికి హెలికాప్టర్ పైలట్స్‌ కు కూడా అవకాశం ఉంటుందన్నమాట! ఇక దానికోసమే ఫ్లోరిడాలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్-ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్) చేశాను.

‘నాసా’ ఇంటర్వ్యూడాక్టర్లు, ఇంజినీర్లు, జియాలజిస్టులు, శాస్త్రవేత్తల్నే కాకుండా ‘నాసా’(ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) వాళ్లు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ నుంచి కూడా కొందరిని తీసుకుంటారు. ప్రతి ఏటా వేలాదిగా వచ్చే అప్లికేషన్స్‌లోంచి వాళ్లొక వంద మందిని ఎంచుకుంటారు. మనం అప్లికేషన్ పంపాలి. వాటిని పరిశీలించి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఒక్కోసారి మనం ఆరుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా పిలవక పోవచ్చు.నాకు మొదటిసారి పిలుపు రాలేదు. రెండోసారి వచ్చింది(1998). ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మనం వ్యక్తిగా ఏమిటి, ఒక జట్టుగా పనిచేయగలమా... ఇలాంటివి అంచనా వేస్తారు. అంతరిక్ష పరిశోధన ఏదైనా టీమ్‌వర్క్‌ తో ముడిపడి ఉంటుంది. అందరినీ సమన్వయం చేసుకుంటేనే పని జరుగుతుంది. మొత్తానికి నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత, ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ట్రెయినింగ్ జరిగింది. యూరప్ దేశాలు, జపాన్, రష్యా, బ్రెజిల్... ఇలా భిన్న దేశాల నుంచి అభ్యర్థులుంటారు. అంతరిక్షం ఏమిటీ, ఎలా ఉంటుందీ, ‘ఐఎస్‌ఎస్’ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్; అంతరిక్ష పరిశోధనలకోసం వివిధ దేశాల భాగస్వామ్యంతో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున నిర్మించిన అంతరిక్ష ప్రయోగశాల) విధులేమిటీ, భారరహిత స్థితిలో ఎలా నడవాలీ, పనులెలా చేసుకోవాలీ, ఏ విపత్కర పరిస్థితి ఎదురైనా భయభ్రాంతులకు లోనుకాకుండా ఉండటం గురించీ, ఎన్నో రకాల తర్ఫీదు ఉంటుంది. ఎన్నో సాంకేతిక వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. గణితం, భౌతికశాస్త్రం చాలా అవసరం.

కలల తీరం

2006లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. అలాంటి ఒక ప్రాజెక్టులో భాగం కాగలిగినందుకు పొందిన ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది.ప్రాథమికంగా ఇక్కడ నేను చేసిన పనుల్లో ... స్పేస్ స్టేషన్‌కు సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు, హీటింగ్ ప్యానల్స్ సరిచేయడం లాంటివి. దీనికోసం స్పేస్‌వాక్ అవసరం. లోపల ఉన్న ఇద్దరు సహచరులు మనల్ని గైడ్ చేస్తారు.ఇక్కడ ప్రధానంగా సాగుతున్న పరిశోధన...

భారరాహిత్యంలో జనం ఎలా మనగలరు, ఎలా తమ పనులు చేసుకోగలరు అన్నది. దీన్ని దశలవారీగా చేయాలి. అంతరిక్షంలో ఎముకలు, కండరాలు తమ ద్రవ్యరాశిని కోల్పోతాయి. అందుకని, ట్రెడ్‌మిల్ మీద పరుగెత్తడం, సైకిల్ తొక్కడం, బరువులు ఎత్తడం... వీలైనంత ఎక్కువ వ్యాయామం చేయడం ద్వారా ఆ నష్టాన్ని పూడ్చగలమా?అలాగే, పోషణకు సంబంధించిన ప్రయోగాలు... ఏం తినాలి? ఏది తినడం వల్ల ఏం జరుగుతోంది? ఏది ఎలా జీర్ణం అవుతోంది... మన శరీరమే ప్రయోగశాల.అలాగే ఇక్కడ చెట్టు ఎలా పెరుగుతుందో పరిశీలించడానికి, సోయా చిక్కుడు పెంచాం. సంప్రదాయంగా చెట్టు అంటే వేళ్లు మట్టిలో కిందికి ఉంటాయి, కాండం పైకి పెరుగుతుంది. కానీ ఇది కాంతి ఎటు ఉంటే ఆ దిశలో పెరిగింది... పైకీ కిందికీ పక్కలకూ. వేర్లు ఆక్టోపస్‌లాగా బయటికి వచ్చాయి.

అంతరిక్ష జీవితంమనం ఎంత శిక్షణ తీసుకున్నా కూడా, మన మెదడు భూమ్మీద ఆలోచించినట్టే ఆలోచిస్తుంది. ఉదాహరణకు నా మొదటి స్పేస్ వాక్ చేసినప్పుడు, ఐఎస్‌ఎస్ పెకైక్కాను... నిజానికి పైన, కింద అన్నది భూమ్మీద. శూన్యంలో పైనున్నా, కిందున్నా తేడా లేదు. ఎటూ తేలుతూనేవుంటాం. కిందికి పడటం అనేది జరగదు. అది తెలిసి కూడా చాలాసేపటివరకూ ‘పడిపోతానేమో’ అన్న భయం వీడలేదు.అలాగే, పడుకోవడం కష్టం. భూమ్మీద దిండు, పరుపు... అదొక సెటప్. కానీ శూన్యంలో పడుకుంటే, తల కిందకు వాలిపోతుందేమో అనిపిస్తుంటుంది. అంత త్వరగా నిద్ర పట్టదు.ఆహారం కూడా ‘ఫ్రీజ్-డ్రై ఫుడ్’. నీటి శాతం పూర్తిగా తొలగిస్తారు. ఒక్కో పౌండు బరువును మనం పైకి మోసుకెళ్లడానికి ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి ఆ జాగ్రత్తలు అవసరం. పూర్తి చప్పిడి తిండి తిన్నామని కాదు. లెజ్యాంజా, ఎగ్స్, కేక్స్ కూడా తిన్నాం. నెలకు ఒకసారి భారతీయ ఆహారం తినడానికి అవకాశం దొరికింది. మన ఆహారంతో సమస్య ఏమిటంటే, పళ్లెంలో పెట్టుకుని ఒక్కొక్కటీ కలుపుకుని తినడం సాధ్యం కాదు. పదార్థాలన్నీ ఎగురుతూ ఉంటాయి.

మారిన దృక్పథం

ఇక్కడ కిటికీ పక్కన కూర్చుని భూమిని చూడటానికి ఎన్ని రోజులైనా సరిపోవు. అంతరిక్షం నుంచి భూమి మరింత అందంగా, మరింత ప్రశాంతంగా కనబడుతుంది. ఎక్కడా దేనికీ హద్దులు లేవు. ఈ దేశం ఆ దేశం, ఆ మతం ఈ మతం, ఆడ మగ అన్న విభజనే లేదు. ఆ గీతలన్నీ మన మనసుల్లో ఉన్నవే. ఇక్కడికొచ్చాక, నేనొక విశ్వమానవ జాతీయురాలినన్న భావనకు లోనయ్యాను. అయితే, ఈ హద్దులు లేని ప్రపంచాన్ని నేను అంతరిక్షంలోకి వెళ్లాకే అర్థం చేసుకోగలిగాను. మహాత్మాగాంధీలాంటి గొప్పవాళ్లు భూమ్మీదినుంచే ఈ ఏకత్వపు సత్యాన్ని అర్థం చేసుకోగలిగారు. భూమికీ శూన్యానికీ తేడాఅక్కడ కేవలం ముగ్గురితో గడిపి ఇక్కడికి వచ్చాక వేలమందిని చూస్తే వెంటనే భయమేస్తుంది. అలాగే అక్కడ తల వాలిపోతూ కా..స్త పొడవవుతాం. ఇక్కడికొచ్చాక తల ముడుచుకోవడంతో వెన్నునొప్పి వస్తుంది. అలాగే గదిలోకి వెళ్తే, గోడలు కూడా సీలింగ్, ఫ్లోర్‌లాగే కనబడతాయి. భూమ్మీద అరికాలి మీద ఒత్తిడి ఎక్కువ. అక్కడ కాలి మడమల మీద.

ఇంత ఖర్చు అవసరమా?

నిజమే, 400 కిలోమీటర్ల ఎత్తున ఈ ప్రయోగశాల నిర్మించడమెందుకు? ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ప్రయోగాలు చేయడం ఎందుకు?
భూమ్మీద జనాభా పెరుగుతోంది. వాళ్లకోసం అదనపు నివాస స్థలాలను వెతకాల్సిందే. మనకు సరిపడే వాతావరణం ఉన్న గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? మన అనుభవాలు పంచుకోగలిగేవాళ్లు ఈ విశాల విశ్వంలో ఇంకెవరైనా ఉన్నారా? వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఈ ఐఎస్‌ఎస్ ఒక మెట్టులాంటిది. దీని తర్వాత చంద్రుడు. ఆ తర్వాత కుజుడు, ఇంకా వేరే వేరే గ్రహాలు.

ప్రొఫైల్Sunita_Williams

పేరు : సునీతా విలియమ్స్
పుట్టినరోజు : 19 సెప్టెంబర్ 1965
దేశం : అమెరికా
జాతి : ఇండియన్-స్లొవేనియన్ అమెరికన్
వృత్తి : ఆస్ట్రోనాట్, నేవీ ఆఫీసర్
తండ్రి : డా॥దీపక్ పాండ్యా
(న్యూరో అనాటమిస్ట్;
గుజరాతీ)
తల్లి : బోనీ (స్లొవేనియా)
భర్త : మైకేల్ జె.విలియమ్స్ (అమెరికన్ పోలీస్ ఆఫీసర్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Freedom fighter laxmi sehgal
Interview with veteran actress geetanjali  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles