Interview with vimalakka

T- New party, T-issue, Telangana people, Gaddar agenda, Congress, TDP, Vimalakka, Manifesto, TPFP, T-politics, T-JAC, OU JAC, TRS, KCR, TRS lead

T- New party, T-issue, Telangana people, Gaddar agenda, Congress, TDP, Vimalakka, Manifesto, TPFP, T-politics, T-JAC, OU JAC, TRS, KCR, TRS lead

Interview with Vimalakka.gif

Posted: 07/03/2012 01:39 PM IST
Interview with vimalakka

Interview_with_Vimalakka

Vimalakkaఒక రాగం పలికించుటలో దాగిన పరివేదనలెన్నో. పెగిలే గానం వెనుక పగిలిన కలలెన్నో. పోరాటాలే పల్లవైన పాట... జనమంత పాట... జగమంత పాట... జీవితమంతా పోరు పాటే. అడుగడుగునా ముళ్లబాటే. నలభై ఎనిమిదేళ్ల జీవితంలో ముఫ్పై ఆరేళ్లు ఉద్యమాల్లో గడిపిన విప్లవాల కోయిల అరుణోదయ విమల అలియాస్ విమలక్క జీవితానుభవాలు.

వ్యవసాయాధారిత కుటుంబం మాది. ఇంటికానుకునే వ్యవసాయం. నాన్న(బండ్రు నర్సింహులు) ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కాలం నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా వుండేవారు. దాంతో మేం పెరిగిన వాతావరణం భిన్నంగా వుండేది. పొద్దున లేచిన దగ్గరనుంచీ ఏదో ఒక పనిమీద నాన్నను కలవడానికి ఎవరో ఒకరు వస్తుండేవారు. అలా వచ్చీ పోయే వాళ్లతో ఇల్లంతా ఎప్పుడూ సందడిగా వుడేది. నాకు కూడా అందరిలో వుండటం అలవాటు అయింది. ఇప్పుడు కూడా ఒంటరిగా వుండలేను. అలా అలవాటపోయింది. మేం ఐదుగురం పిల్లలం. ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు.

నిద్రలేని రాత్రులు - కల్లోల సమయాలు

మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆర్థికంగా పెద్ద కష్టాలు లేనప్పటికీ మరో రకంగా సమస్యలు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా అమ్మ. వాళ్ల పెళ్లవగానే మా నాన్న రెండుమూడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పుడంతా నాన్నకు సద్దులు మోయడంతోనే అమ్మకు సరిపోయింది. నాన్న ఇవాళ ఇంత పేరు తెచ్చుకున్నాడంటే అందులో అమ్మ పాత్ర ఎంతో వుంది. సి.పి.రెడ్డి, పైలా లాంటి పెద్ద నాయకులు మా ఇంట్లో షెల్టర్ తీసుకున్నారు. ఒక రకంగా అమ్మే వాళ్లందరినీ సాకింది. అమ్మ లేనిది మా ఇల్లు నడవకపోయేది. అమ్మ ఒక మాట ఎప్పుడూ చెబుతుండేది. ‘నా నెత్తిన ఇత్తులు పడ్డంక మీ నాన్నతో ఎప్పుడూ సుఖపడలేదు బిడ్డా... మిమ్మల్నైనా మంచిగ చూస్త’ అని.

నాన్న జైలుకు వెళ్లినప్పుడల్లా అమ్మ పొద్దున్నే లేచి అన్నం వండుకుని మమ్మల్ని తీసుకుని లారీలో హైదరాబాద్ వెళ్లి ములాఖత్ కోసం గంటలు గంటలు పడిగాపులుగాసేది. నాన్నను కలవడానికి ఒకసారి నేను ముషీరాబాద్ జైలుకు వెళ్లాను. అప్పటికే నేను పాటలు బాగా పాడతానని నాన్న స్నేహితులందరికీ తెలుసు. నేను వెళ్లగానే నువ్వు బాగా పాడతావట కదా, ఈ మైసూర్‌పాక్ తింటే నీ గొంతు ఇంకా తియ్యగా అవుతుంది అని నవ్వేశారు.

మా ప్రేమ అమరం

నన్ను చూడకముందే అమర్ నా పాటను ప్రేమిస్తే, అమర్‌ను చూడకముందే నేనతని వ్యక్తిత్వాన్ని ప్రేమించాను. అదెలాగంటే అన్నయ్య వాళ్లు ఒకసారి పీడీఎస్‌యూ క్లాసులకు అటెండయ్యి వచ్చారు. అక్కడ పరిచయమైన అమర్ గురించి గొప్పగా చెబుతున్నారు. అమర్ నాయకత్వ లక్షణాల గురించి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి గొప్పగా చెప్పాడని వాళ్ల మాటల్లో అర్థ్ధమైంది. దాంతో అతణ్ని చూడాలన్న ఆసక్తి మొదలైంది.

ఒకసారి నేను రంగవల్లి అక్కతో పీడీఎస్‌యూ సమ్మర్ క్యాంపెయిన్ కోసం నల్లగొండ వెళ్లాను. అక్క కూడా అమర్ పాటలు బాగా రాస్తాడనీ, మంచి వక్తనీ చెప్పింది. కొన్ని రోజులకు స్టేట్ కౌన్సిల్ సమావేశాలకు విశాఖపట్టణం వెళ్లాము. అక్కడ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. పొద్దుటి నుంచీ భోజనం లేకపోవడంతో తూలుకుంటూ వేదికకు చేరుకున్నాం. అప్పటికే కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. డ్యూయట్ పాడటానికి ఎవరూ లేకపోవడంతో నన్ను పిలిచారు. నీరసంగా స్టేజ్ మీదకు వెళ్లాను. మేల్ సింగర్ ఉత్సాహంగా పాడుతున్నాడు. అతనే కె.డి.(అమర్) అని తరువాత తెలిసింది. రెండు రోజుల ప్రోగ్రామ్‌లో మేం డెరైక్ట్‌ గా ఒకరికొకరం పరిచయం కాలేదు. తరువాత ప్రకాశం జిల్లా సమావేశంలో అతడే నా దగ్గరకు వచ్చి ‘మీరు విమల కదా, నేను కె.డి.’ అని పరిచయం చేసుకున్నాడు.

తర్వాత మీటింగ్స్‌లో కలిసినప్పుడల్లా గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లం. పాడుతున్నప్పుడు జనంలో తన కోసం నా కళ్లు వెదికేది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనని అమర్ మొహమాట పడేవాడు. అయితే, నాలుగేళ్ల తర్వాత తన నుంచే ప్రపోజల్ వచ్చింది. నాకూ అతనంటే ప్రేమ వుండటంతో పార్టీ అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాన్న హ్యాపీగా ఫీలయ్యాడు. అమ్మ మాత్రం ‘నా కంటే ఎక్కువ కష్టాన్ని తెచ్చుకుంటున్నవ్... వద్దు బిడ్డా’ అంది. అయినా సర్దిచెప్పాను. నల్లగొండ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలోని తోటలో పార్టీ ముఖ్యుల మధ్య, కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య మా పెళ్లి జరిగింది.

Amar_Vimalaఇక మా దాంపత్యం విషయానికొస్తే, పెళ్లయ్యాక మేం ఒకదగ్గర పనిచేసింది చాలా తక్కువ. పార్టీ పనుల్లో భాగంగా వేరు వేరు ప్రాంతాల్లో పనిచేసేవాళ్లం. అమర్‌ది రహస్య జీవితం, నాది లీగల్ జీవితం. తన ఆచూకీ కోసం పోలీసులు నన్ను చాలాసార్లు రహస్యంగా వెంబడించారు. ఒకసారి ఇద్దరం ఒక రహస్య ప్రాంతంలో కలుద్దామని సిగ్నల్స్ పంపించుకున్నాం. మ్యాటర్ లీక్ అవడంతో పోలీసులు కాపుకాశారు. అది మాకు తెలిసి, అలర్ట్ అయి ఎవరి దారుల్లో వాళ్లం వెళ్లిపోయాం. అలా కలుద్దామనుకున్నా కలవలేని పరిస్థితులు ఎన్నో. నేను కిడ్నీ పెయిన్‌తో బాధపడేటప్పుడు హాస్పిటల్లో తను నా పక్కన వుంటే బాగుండేదనిపించేది. ఎక్కడైనా ఏదైనా ఎన్‌కౌంటర్ జరిగితే తను ఎలా ఉన్నాడో, ఏంటో అని కలవరపడేదాన్ని. ఆరోగ్యం బాలేదని తెలిసినపుడు ఎలా వుందో అని ఆరాటపడేదాన్ని.

తెలంగాణ సాధనకై..

కరీంనగర్ రైతాంగ పోరాటంలోను, సారా వ్యతిరేక ఉద్యమంలోను, దళిత ఉద్యమాల్లోను, మహిళల హక్కుల పరిరక్షణలోను ‘అరుణోదయ’ క్రియాశీల పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమాన్ని జనంలోకి తీసుకువెళ్లడానికి అరుణోదయ సంస్థ తరఫున ఎవరూ తిరగనన్ని గ్రామాలు తిరిగాం. ఒక మూడు నెలలు అసలు నేల మీద నిద్ర పోలేదు. ప్రయాణంలోనే నిద్ర. ఊరూరా సభలతో ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై పాటలు పాడాం. అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో టఫ్ (తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్)ను ఏర్పాటు చేశాం. రాజకీయాలకతీతంగా తెలంగాణ వాదం వినిపించాలనేది మా ఉద్దేశం. తెలంగాణ కోసం బలవన్మరణాలను ఆపడానికి అమర్ రాసిన ఎందుకు కాలిపోతవ్, ఎందుకు రాలిపోతవ్ పాటను ఎన్నో వేదికల మీద విన్పించాను. అన్ని రకాల దోపిడీల నుంచి ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, కులరహిత, వర్గ రహిత, అంతిమంగా దోపిడీలేని సమసమాజం వచ్చేవరకూ పోరాడటమే మా లక్ష్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with veteran actress geetanjali
Choreographer pony verma interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles