Dimple yadav elected lok sabha seat

uttar, pradesh, chief, minister, akhilesh, yadav, wife, dimple, files, dimple yadav

uttar, pradesh, chief, minister, akhilesh, yadav, wife, dimple, files, dimple yadav

Dimple Yadav elected Lok Sabha seat.gif

Posted: 06/13/2012 07:47 PM IST
Dimple yadav elected lok sabha seat

Dimple_Yadav_elected_Lok_Sabha_seat

1సాదాసీదా గౄహిణిగా కనిపించే ఆమె ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే ఒక్కసారిగా లోక్‌సభలో పాగా వేసింది.. దేశ రాజకీయాలేక గుండెకాయలాంటి ఉతర్తప్రదేశ్‌లో ఓ మాజీ ముఖ్యమంత్రి కోడలిగా, తాజా ముఖ్యమంత్రి భార్యగా ఆ రాష్ట్ర ప్రజలకు తెలిసిన ఆమె పోటీ లేకుండా ఎం.పి గా ఎంపికైంది.. ఆమే- డింపుల్‌ యాదవ్‌. ఓ ఆర్మీ అధికారి కుమార్తె అయిన ఈమె యుపి మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ ఇంట కోడలిగా అడుగుపెట్టిన వేళ తాను రాజకీయాల్లోకి వస్తానని ఊహించి ఉండకపోవచ్చు.

ప్రొఫైల్

పూర్తి పేరు     : డింపుల్‌ యాదవ్‌
భర్త         : అఖిలేష్‌ యాదవ్‌
సంతానం            : ముగ్గురు
వృత్తి         : రాజకీయవేత్త
పూర్తి పేరు     : డింపుల్‌ యాదవ్‌
హోదా           : లోక్‌సభ సభ్యురాలు
నియోజక వర్గం       : కనౌజ్‌ఒక

రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యగానే కాకుండా డింపుల్‌యాదవ్‌కు అధికారికంగా మరో హోదా Dimple_Yadav1లభించింది. రాజకీయ కుటుంబంలో కొడలిగా ప్రవేశించాక 13 సంవత్సరాల తరువాత డింపుల్‌ కూడా రాజకీయంలోకి ప్రవేశించింది. భర్త అఖిలేష్‌ యాదవ్‌ ఇంతకు ముందే మూడు సార్లు నౌజ్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా ఎంపిక్యయ్యాడు. మార్చిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంపిగా రాజీనామా చేశాడు. ఖాళీ సీటుకు ఎన్నికలు జరపాలని ఎలక్షన్‌ కమీషన్‌ నిర్ణయించింది. తన తరువాత తన భార్యను ఎన్నికల్లో పోటీగా నిలబెట్టాడు అఖిలేష్‌. ఈ విషయం తెలుసు కున్న మిగితా పార్టీలు నామినేషన్‌ వేలేదు. చివరికి ఏకగ్రీవంగా ఎంపిగా ఎన్నికైన తొలి పార్లమెంట్‌ సభ్యురాలిగా చరిత్ర సృష్టించింది దింపుల్‌ యాదవ్‌.

కళలంటే ఆసక్తి

తండ్రి ఉద్యోగరీత్యా భటిండా, పూణె, లక్నో, అండమాన్‌- నికోబార్‌ దీవుల్లో ఈమె చదువు సాగింది. డిగ్రీ పూర్తిచేసిన ఈమెకు చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉంది. విపరీతంగా పుస్తకాలు చదివే డింపుల్‌కు రాజకీయాలంటే ఆసక్తి తక్కువే. అనుకోని పరిస్థితుల్లో ఈమె 2009లో భర్త అఖిలేష్‌ రాజీ నామా చేసినపుడు తెరపైకి వచ్చారు. 2009లో ఫిరోజాబాద్‌ ఎంపి స్థానానికి పోటీ చేసిన డింపుల్‌ ప్రముఖ సినీనటుడు రాజ్‌బబ్బర్‌ (కాంగ్రెస్‌) చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో తమ కుటుంబానికి చెందిన మహిళలెవరూ రాజకీయాల్లో రాణించలేరని అప్పట్లో ములాయం వ్యాఖ్యానించారు. తొలి సారే ఓటమి చెందడంతో డింపుల్‌ రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని ఆనాడు అంతా అనుకున్నారు. అయితే, నేడు ఆమె ఎంపీ కావడం ఎవరూ ఊహించని పరిణామం.

Dimple_Yadavఅఖిలేష్‌తో వివాహం

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న అఖిల్‌ ను డింపుల్‌ సింపుల్‌గా ఎ.డి. అని పిలుస్తుంది. అంటే అఖిల్‌ దాదా అన్నమాట. ఆస్ట్రేలియాలో మెరైన్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి స్వదేశానికి వచ్చిన అఖిలేష్‌కు 1999 నవంబర్‌ 24న డింపుల్‌తో వివాహం జరిగింది. పదేళ్ల అదితి, ఆరేళ్ల కవల పిల్లలు అర్జున్‌, టీనా ఈ దంపతుల సంతానం. డింపుల్‌తో వివాహం జరిగాక తనకు అదృష్టం కలిసి వస్తోం దని అఖిలేష్‌ తరచూ చెబుతుంటారు. ఈ ఏడాది జరిగిన యుపి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీని కొత్త పంథాలో నడి పించి, అఖండ మెజారిటీతో ముఖ్యమం త్రి పీఠాన్ని చేజిక్కించుకున్న అఖిలేష్‌ తన విజయం వెనుక భార్య ప్రోత్సాహం ఎంతగానో ఉందంటారు. కాగా, తాను కొందరికి కుమార్తెనని, మరికొందరికి కోడలినని, తనను ఎంపీగా గెలిపిస్తే కనోజ్‌ నియోజక వర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని డింపుల్‌ ఓటర్లకు వాగ్దానం చేశారు.

సంగీతం అంటే ప్రత్యేకాభిమానం

కుటుంబ జీవితానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే డింపుల్‌కు సంగీతమంటే ప్రత్యేకాభిమానం. మెటాలిక్‌ బృందమంటే మరీ ఇష్టం. చిత్రకళలోనూ ప్రవేశమున్న డింపుల్‌.. గుర్రపు స్వారీ కూడా చేయగ లదు. డింపుల్‌ చాలా మృదుస్వభావి. మంచి పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా హుందాగా, మర్యాదగా వ్యవహరిస్తుందని ప్రముఖ సింగర్‌ ఉషా ఉతుప్‌ అభిప్రాయం. విద్యాభ్యాసం తరువాత పెద్ద కార్పోరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసి ఉన్నత స్థాయికి చేరాలనుకున్న డింపుల్‌ కెరీర్‌.. ఎన్నో మలుపులు తిరిగి పార్లమెంట్‌లో ప్రముఖుల కంపెనీలో ప్రజా సమస్యలను పరిష్కరించే ఉన్నత పదవికి చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Old city pilot salma
Mogalirekulu bindu naidu interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles