Interview with singer usha

America, tollywood, indian, films, movies, entertainment, reviews, ratings, film star interviews, pictures,, travel, Money,Movies, box office, gossip, film industry news, indian songs, music, latest box office hits, telugu movie, albums,stills,Audio,songs, telugu, cine, actors, actresses, film star, indian culture, USA, AP, Andhra,DVD,VCD, CD,VHS, tapes, India, andhra

Usha, Singer Usha, America, tollywood, indian, films, movies, entertainment, reviews, ratings, film star interviews, pictures,, travel, Money,Movies, box office, gossip, film industry news, indian songs, music, latest box office hits, telugu movie, albums,stills,Audio,songs, telugu, cine, actors, actresses, film star, indian culture, USA, AP, Andhra,DVD,VCD, CD,VHS, tapes, India, andhra

Interview with Singer Usha.gif

Posted: 03/05/2012 04:55 PM IST
Interview with singer usha

Interview_with_Singer_UshaSinger_Usha‘ఊహల పందిరిలో ఊరేగించనా... ‘చిత్రం’ సినిమాలోని ఈ పాట ఒక అమ్మారుు జీవితాన్ని ఊహించని విధంగా మలుపు తిప్పింది. ఈ పాటను పాడిన ఉష తెలుగు వారి హృదయాలలో చెరగని చోటు సంపాదించారు.తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి ఉషాకు అదృష్టం కూడా తోడుగా నిలిచింది.మధురమైన పాటలకు స్వరాన్నందించి తెలుగు సంగీత ప్రియుల హృదయాలలో చెరగని చోటు సంపాదించారు. 10 సంవత్సరాల సినీ ెకరీర్‌లో ఆమె నేటివరకు దాదపు 450కు పైగా చిత్రగీతాలను, 600 పైగా ప్రైవేట్‌ గీతాలను ఆలపించారు.

ప్రొఫైల్‌

పూర్తిపేరు           : ఉషా
పుట్టిన తేది        : 1980 మే 29
జన్మస్థలం         : నాగార్జునా సాగర్‌
వృత్తి              : నేపథ్య గాయనీ
కెరీర్‌ ప్రారంభం     : 1999
తొలి చిత్రం        : ఇల్లాలు
పేరు తెచ్చిన పాట : ఊహల పందిరిలో ఊరేగించనా (చిత్రం)
అవార్డులు        : నంది అవార్డు వంటి          

ఎన్నో అవార్డులుఉషా అచ్చంగా కాకపోయినా హైదరాబాద్‌ అమ్మాయనే చెప్పాలి. పుట్టిం ది నాగార్జునా సాగర్‌లోనైనా , పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. చిన్ననాటి నుంచే సంగీతం అంటే ప్రత్యేకాభిమానం ఉన్న ఉషా తన చుట్టు పక్కల సంగీత కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడికి చేరుకునేవారు. తరువాత వివిధ స్థాయి పోటీలలో పాల్గొని మంచి గాయనిగా ఎదిగారు. ఆమె గురించి నేడు తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

సంగీత సాగరంలో...

ఉషా కుటుంబ సభ్యులది గోదావరి జిల్లాలోని తణుకు. హైద్రాబాద్‌లో చాలా కాలం కిందటే వీరి కుటుంబం సెటిల్‌ అయ్యింది. ఉషా తండ్రి ఇంజనీరు. అక్కలు, అన్నలు అంతా విదేశాలలో సెటిల్‌ అయ్యారు. అమ్మమ్మ శాస్ర్తీయ సంగీతంలో విద్వాంసురాలు. బహుశా ఆమె ప్రభావంతోనేమో కానీ ఉషాకు కూడా సంగీతంపై అభిమానం ఏర్పడింది. ఆమె వద్ద ఉషా తల్లి సంగీతాన్ని నేర్చుకుంది. తల్లి నుంచి వారసత్వంగా ఉషా సంగీతాన్ని అభ్యసించింది.

నవరాగం...

శాస్ర్తీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన ఉషాకు జెమిని ‘నవరాగం’ కార్యక్రమంలో పాడటం ఉషా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ‘పాడుతా తీయగా, ఎందరో మహానుభావులు’ పాడారు. అవి సినిమాల్లో ఆమె ఎంట్రీకి హాల్‌ టికెట్‌లా పనిచేసాయి. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ‘ఇల్లాలు’ అనే చిత్రంలో పాడించారు. కానీ దానికి అనుకున్నంత గుర్తింపురాలేదు.

విజయపథంలో...

తేజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిత్రం’ సినిమా ఉషా జీవితంలో మరో టర్నింగ్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు.ఈ చిత్రరాన్నే తన తొలి చిత్రంగా ఆనందంగాచెప్పుకుంటానని చిత్రా ఒక సందర్భంలో తెలిపారు. నేటి వరకు దాదపు 450 పైగా గీతాలకు స్వరాన్నందిరచిన చిత్ర ప్రతి పాటలో ప్రాణం పోయగలరు. ‘నువ్వునేను, మనసంతా నువ్వే, నువ్వులేక నేను లేను వంటి చిత్రాలు ఆమె లిస్ట్‌ లో టాప్‌లో ఉంటాయి.తెలుగుతనాన్ని తన గాత్రంతోనే వర్ణించే గాయని ఉష. ఒకనాడు టివి కార్యక్రమంలో పాడి మంచి గుర్తింపును సాధించిన ఉష...నేడు అనేక టివి కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే స్థాయికి ఎదగటం నిజంగా హర్షనీయం.

పాటల పల్లకిలో...

చిత్రం సినిమాలో ఊరేగించనా అంటూ కమ్మని స్వరంతో కుర్రకారు హృదయాలలో చోటు సంపాదింకుంది ఉష. ఆ తరువాత వేయికన్నులతో వేచి చూస్తున్నా..తెర చాటు దాటి చేరదా నీ స్నేహం..కోటి ఆశలతో కోరుకుంటాన్నా కరుణించి ఆధరించదా నీ స్నేహం...ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవ నేస్తమా’ అంటూ ‘నీ స్నేహం’ చిత్రంలో పాడినా.. , గుండెలా వాలవా అంటూ ఈశ్వర్‌లో, నీకు నేను నాకు నేను ఒకరికొకరం నువ్వూ నేను అని నువ్వు నేనులో, చెప్పవే ప్రేమా అని మనసంతా నువ్వేలో, నువ్వంటే నాకిష్టమిని అని సంతోషంలో పాడినా ఎలా పాడినా ఉషా పాడిన పాటను మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంటుంది.నేటికీ ఆమె పాటలు రొమాంటిక్‌ ట్రాక్స్‌లో టాప్‌లో ఉంటాయి.

అవార్డులు

•    3 సార్లు ఉత్తమ నేపథ్యగాయనిగా నంది అవార్డులుUsha_family
•    ఆటా ఎక్స్‌లెన్సీ అవార్డు-2008
•    ఉగాది పురస్కార్‌ అవార్డు -2005
•    పద్మ మోహన్‌ ఆర్ట్‌‌స నుంచి గోల్డ్‌ మెడల్‌ -2004
•    పి.సుశీల అవార్డు-2003
•    ఆలాపన అవార్డు-2003
•    సినిమా అవార్డు-2002
•    ఈనాడు టివి అవార్డు-2003
•    వంశి బర్‌క్లీ అవార్డు-2002

తెలుగు పాటలు

పాట                    చిత్రం
వేయి కన్నులతో           నీ స్నేహం
ఎలా ఎలా                  నువ్వులేక నేను లేను
గుండెలో వాలవా           ఈశ్వర్‌
లంగా ఓణి                  వర్షం
ప్రియతమా                 నువ్వు నేనుusha_with_balu
నువ్వు నేనే                నువ్వునేను
చెప్పవే ప్రేమ               మనసంతా నువ్వే
ఏమో అవునేమో           నీ స్నేహం
నువ్వంటే                   నాకిష్టమని

టి.వి.కార్యక్రమాలు

•    తెలుగు సారిమగమప ‘నువ్వానేనా (2010) కార్యక్రమానికి న్యాయనిర్ణేత
•    తెలుగు సారిమగమప ‘లిటిల్‌ ఛాంప్స్‌’కార్యక్రమానికి న్యాయనిర్ణేత
•    తెలుగులో ‘స్వరనీరాజనం’ అనే కార్యక్రమానికి హోస్ట్‌ గా వ్యవహరించారు.
•    మాటివిలో వచ్చిన పాడాలని ఉంది కార్యక్రమం సెమీఫైనల్‌కు న్యాయనిర్ణేత
•    అలాగే ఈటివి, జెమిని టివి, మాటివి, జీతెలుగు, టివి-9 వంటి ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు సంగీత సంబంధిత కార్యక్రమాలలో పాల్గొన్నారు.

హైలైట్స్‌

•    ఉషా 2005 జూన్‌లో ఆమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను వివాహం చేసుకున్నారు.
•    గాయనిగా తన ప్యాషన్‌ను కొనసాగించడానికి ఆమె అమెరికా - భారతదేశానికి ప్రయాణిస్తూ ఉంటారు.
•    ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్‌లో పిజి చేశారు.
•    ఉషా స్వరంలో వెలువడిన ‘తూనీగా తూనీగా, ఉషారుగా’ అనే ప్రైవేట్‌ ఆల్బమ్‌లు మంచి విజయాన్ని సాధించాయి.
•    10 సంవత్సరాల తన కెరీర్‌లో ఉషా ఇప్పటి వరకు దాదాపు 450కు పైగా తెలుగు పాటలను, 600కు పైగా ప్రైవేట్‌ పాటలను ఆలపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress nirosha
National geoscience awards winner mvsunanda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles