An exclusive interview with uttar pradesh chief minister mayawati

An exclusive interview with Uttar Pradesh Chief Minister Mayawati. Mayawati, Uttar, Pradesh, Chief, Minister, UP, Bahujan, Samaj, Party, Dalit, BJP, bsp, Samajwadi, Upper, Caste, coalition, government

An exclusive interview with Uttar Pradesh Chief Minister Mayawati. Mayawati, Uttar, Pradesh, Chief, Minister, UP, Bahujan, Samaj, Party, Dalit, BJP, bsp, Samajwadi, Upper, Caste, coalition, government

An exclusive interview with CM Mayawati.GIF

Posted: 02/18/2012 12:36 PM IST
An exclusive interview with uttar pradesh chief minister mayawati

CM_Mayawatiఉత్తర ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి మాయావతి. దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. పార్టీ వర్గాల, వ్యక్తి గత సంపద పెరగడానికి ఆమె అడ్డదారులు తొక్కారనే అపవాదులు కూడా ఉన్నాయి.తన పార్టీ నాయకుల విగ్రహాలను నిర్మించడానికి ఒక మైదానాన్ని వాడుకోవడం వంటి అనేక వివాదాలు ఎప్పుడూ మాయావతిని వార్తల్లో వ్యక్తిగా నిలుపుతాయి. మాయావతి జీవితంలో ఎన్నో ఆటుపోటులు, విమర్శలు, ఎన్నో వివాదాలు ఎదురయినా వాటికి చిరునవ్వుతోనే సమదానం ఇస్తూ తన పనిని తనదైన శైలిలో చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఆమె గురించి కొన్ని విషయాలు.

ఫ్రొఫైల్‌CM_Mayawati_1

పూర్తిపేరు             : మాయావతి
పుట్టిన తేది           : 1956 జనవరి 15
జన్మస్థలం             : కొత్త ఢిల్లీ
విద్యాభ్యాసం            : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్, ఎల్‌ఎల్‌బి, బి.ఎడ్.
వృత్తి                   : రాజకీయ నాయకురాలు
కెరీర్‌ ప్రారంభం          : 1984
పార్టీ                    : బహుజన్‌ సమాజ్‌ పార్టీ
ప్రస్తుత హోదా        : ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి
పదవి చేపట్టిన సం     : 2007

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న మాయావతి బహుజన్‌ సమాజ్‌ పార్టీకి అధ్యక్షురాలు. భారత దేశంలోని నిమ్న వర్గాల వారి తరపున లేదా బహుజనుల సంక్షేమం కోసం ఏర్ప డిన రాజకీయ పార్టీ అది. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా నాలుగు సార్లు ఎంపికయ్యారు. ఆమె అభి మానులు ఆమెను ఆప్యాయతతో బెహన్‌జీ అని కూడా సంబోధిస్తారు. దేశంలోని దళితులకు మంచి రోజులు తీసుకురావాలనేది మాయవతి ధ్యేయంగా ఆమె అనేక సార్లు పేర్కొన్నారు. ‘మధ్యతరగతిలో పుట్టిన మాయావతి ఎదుగుతున్న తీరును ప్రజాస్వామ్యం చేసిన అద్భు తంగానే చెప్పుకోవచ్చు. అని మాజీ భారత ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు అభివర్ణించాడు.

వ్యక్తిగత జీవితం...

మాయావతి తండ్రి ప్రభుదాస్‌ గౌతం బుద్ధా నగర్‌ పోస్ట్‌  ఆఫీస్‌లో ఉద్యోగం చేసేవారు. ఆమె 1956 జనవరి 15న కొత్త ఢిల్లీలో జన్మించారు. మాయావతి తండ్రి తన చాలీ చాలని జీతంతో కొడుకును ఒక ప్రైవేట్‌ పాఠశాలకు పంపించేవాడు. కానీ మాయవతిని మాత్రం ప్రభుత్వం పాఠశాలకు పంపించేవాడు. మాయావతి చదువులో ప్రతీసారీ టాప్‌ ర్యాంకర్‌. చదువంటే ఆమెకు అత్యంత ఆసక్తి ఉండటంతో ఆమె ఏకంగా మూడు డిగ్రీలను పూర్తి చేశారు. అవి అర్ట్స్‌ , బి.ఈ.డి, ఎల్‌.ఎల్‌.బిలు. విద్యాభ్యాసం  పూర్తయ్యాక ఆమె డిల్లిలో ఉపాద్యాయినిగా పనిచేశారు. 1977 ఆ ప్రాంతంలో మాయా వతి ఐఏస్‌కు సిద్ధం అవుతున్నప్పుడు దళిత నాయకుడు కాంషి రామ్‌ వారింటికి విచ్చేశారు.
మాయావతి ప్రతిభను గుర్తించిన కాంషి రామ్‌ ‘ఏదో ఒక రోజు నేనున నిన్ను పెద్ద నాయకురాలిని చేస్తాను. అప్పుడు ఒకరు కాదు అనేక మంది ఐఏఎస్‌ అధికారులు నీ ముందు నిలబడతారు’ అని తెలిపాడు. 1984 లో కాంషి రామ్‌ బహుజన్‌ సామాజ్‌వాదీ పార్టీని స్థాపించినప్పుడు మాయావతి అతని టీమ్‌లో ఉన్నారు. 1989లో బిజ్‌నోర్‌ నియోజకవర్గం నుంచి ఆమె పార్లమెంటుకు ఎన్ని కయ్యారు. 2006లో కాంషిరామ్‌ మరణించినప్పుడు వారు బుద్ధిస్ట్‌ సంప్రదాయలను పాటించినట్టు తెలిపారు. కాంషి రామ్‌ అంత్య క్రియలను నిర్వహించిన మాయావతిని అనేక మంది విమర్శించారు. ఒకానొక సందర్భంలో ఆమె బుద్ధిజాన్ని స్వీకరించే యోచరించే యోచనలో ఉన్న ట్టు తెలిపారు.

విగ్రహాలు...

CM_Mayawati2మాయవతి అనగానే అనేక మందికి గుర్తుకు వచ్చే అంశాలలో విగ్రహాలు కూడా ఒకటి. మాయావతికి  చిన్ననాటి నుంచే కళలంటే, ముఖ్యంగా శిల్పాలంటే మరింత ఇష్టం. అందుకే అధికారంలో ఉన్న సమయంలో ఆమె తమ పార్టీ నాయకుల విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ప్రతిష్టించడానికి పురమాయించారు. అంతే కాకుండా గౌతం బుద్ధ, రవిదాస్‌, నారాయణ్‌ గురు, జ్యోతిరావ్‌ పూలే, షాహుజి మహారాజ్‌, పెరియార్‌ రామ స్వామి, భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌,  కాంషిరామ్‌ వంటి ప్రముఖల విగ్రహాలతో పాటు తన విగ్రహాలను కూడా ప్రతిష్టించుకున్నారు. వీటికోసం దాదాపు రూ.2,500 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘ఈ ఖర్చు నిజంగా అవసరమైంది. ఎందుకంటే భవిష్యత్తరాలకు వీరి గొప్పతనం గురించి తెలుసుకునే అవసరం ఉంది’ అని తెలిపారు. 2011 లో రూ.685 కోట్లతో ‘రాష్ట్రీయ దళిత్‌  ప్రేరణ అండ్‌ గ్రీన్‌ గార్డెన్‌’ ను నిర్మించారు. ఈ పార్కులో ఆమె విగ్రహం కూడా ప్రతిష్టించారు. దీంతో కాంగ్రెస్‌ ఆమెను ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు అని విమర్షించారు. ఇలా మాయావతి జీవితంలో ఎన్నో ఆటుపోటులు, విమర్శలు, ఎన్నో వివాదాలు. అయినా వాటిని చిరునవ్వుతోనే సమదానం ఇస్తూ తన పనిని తన దైన శైలిలో చేస్తూ ముందుకు సాగిపోతున్నారు.

పుట్టిన రోజులు...

మాయావతి పుట్టిన రోజు వేడుకలు ప్రతీ ఏడాది వివాదాలను బహుమతిగా తీసుకొస్తాయి. ఒసారి డైమండ్‌ హారంతో వేడుకలకు హాజరైనCM_Mayawati3 మాయావతిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆమె అనుయాయులు ఆమె పుట్టిన రోజును ‘జన్‌ కళ్యాణ్‌కారి దివస్‌’ (లోక కళ్యాణ దినం) గా ప్రటించారు. 2009 పుట్టిన రోజు వేడుకలలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు, పేదవారికోసం అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు మాయావతి. 2010లో మాయావతి పుట్టినరోజు వేడుక సందర్భంగా రూ.7,312 కోట్ల విలువ గల సంక్షేమ పథకాలను ప్రకటించారు.

యంగ్‌ ఛీఫ్‌ మినిస్టర్‌...

సమాజ్‌వాదీ పార్టీతో కలిసి 1993లో ఆమె బహుజన్‌ సమాజ్‌ పార్టీని స్థాపించారు. 39 సంవత్సరాలు తిరగ ముందే ఆమె ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పిన్న వయసులోనే ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి దళిత మహిళ కూడా మాయావతి కావడం విశేషం. 1997,2002లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ సహకారంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రెండవసారి ఎంపికైనప్పుడు పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాలు పదవిలో ఉన్నారు. 2007 మే 13న ముఖ్యమంత్రిగా బాధ్యతలను తిరిగి చేపట్టారు.అయితే మాయావతి పదవి కాలం విషయంలో అనేక వివాదాలు చెలరేగాయి. ప్రస్తుతం మాయావతి దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. ఆమె పార్టీ వర్గాల, వ్యక్తి గత సంపద పెరగడానికి ఆమె అడ్డదారులు తొక్కారనే అపవాదులు కూడా ఉన్నాయి.తన పార్టీ నాయకుల విగ్రహాలను నిర్మించడానికి ఒక మైదానాన్ని వాడుకోవడం వంటి అనేక వివాదాలు ఎప్పుడూ మాయావతిని వార్తల్లో వ్యక్తిగా నిలుపుతాయి.

తాజ్‌ కారిడార్‌...

2003లో తాజ్‌ కారిడారిడార్‌ కేసుకు సంబంధించి విషయాలను తెలుసుకోవడానికి సిబిఐ అధికారులు మాయావతి ఇంటిపై దాడులు నిర్వహించారు. రెండు రోజుల తరువాత ఆమె పై  ఒక కేసును బుక్‌ చేశారు. 2007లో టి.వి.రాజేశ్వర్‌ ‘తాజ్‌ కారిడార్‌ కేసులో మాయావతి పాత్ర ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలులేవు’ అని తెలిపారు. మొత్తానికి ఎలాంటి అధారాలు లభించకపోవడంతో మాయావతి అభిమానులు తెగ సంబరపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil telugu actress laila
An interview with chetan bhagat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles