Kcr daughter kavita interview

telugu news,telugu movies,telugu movies online,movies online,online gossip,telugu gossips,breaking news in ap,andhra news,south indian movies,telugu film news,hot galleries,telugu videos,telugu movie updates,andhra site,telugu site,telugu online,southscope,ap gossips,telangana news,telangana movies,namaste telangana,andhra politics,kosta news,seemandra,konaseema,visakhapatnam news,vijayawada news,kakinada news,tirupathi news,hyderabad news,telugu hot news,telugu blogs,telugu font,telugu fun,telugu comedian,tamil gossips,tamil news,malayalam news,malayalam gossips,kannada news,kannada gossips,kannada free movies,telugu hot movies and updates,free sms to andhra,krify,software development in andhra,software companies in andhra,iphone development,telugu iphone app,telugu ipad app,telugu android apps,shreya goshal,play back singer,tollywood,bollywood,Gossips

telugu news,telugu movies,telugu movies online,movies online,online gossip,telugu gossips,breaking news in ap,andhra news,south indian movies,telugu film news,hot galleries,telugu videos,telugu movie updates,andhra site,telugu site,telugu online,southscope,ap gossips,telangana news,telangana movies,namaste telangana,andhra politics,kosta news,seemandra,konaseema,visakhapatnam news,vijayawada news,kakinada news,tirupathi news,hyderabad news,telugu hot news,telugu blogs,telugu font,telugu fun,telugu comedian,tamil gossips,tamil news,malayalam news,malayalam gossips,kannada news,kannada gossips,kannada free movies,telugu hot movies and updates,free sms to andhra,krify,software development in andhra,software companies in andhra,iphone development,telugu iphone app,telugu ipad app,telugu android apps,shreya goshal,play back singer,tollywood,bollywood,Gossips

KCR daughter Kavita Interview.GIF

Posted: 01/02/2012 01:33 PM IST
Kcr daughter kavita interview

Kavithaమొండివాడు, అనుకున్నది చేసేవాడు, ఎవరేదిచెప్పినా విననివాడు, ప్రత్యేక ఉద్యమానికి రూపునీ ఊపునీ తెచ్చినవాడు, ఢిల్లీని తెలంగాణ గల్లీకి దింపినవాడు, లక్షలాదిమందిని ఒక్కతాటిపై నడిపిస్తున్న మహానాయకుడు... కె.సి.ఆర్. అలాంటి కేసీఆర్‌తో ‘మీరు చేస్తున్న ఫలానా పని నచ్చలే’దని మొహంమీద చెప్పగలిగినా, ఆయన చేత కన్నీళ్లు పెట్టించగలిగినా అది ఆయన కూతురు కవితకే చెల్లింది. తండ్రి నుంచి నిర్భయత్వాన్ని, వాక్పటిమను, పోరాటస్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న తెలంగాణ జాగృతి స్థాపకురాలు కల్వకుంట్ల కవి.

బాల్యం...
పెరిగింది జాయింట్ ఫ్యామిలీలో... నానమ్మ తాతయ్యలతో ఉండేవాళ్లం. నాకుChild-kavitha తొమ్మిదిమంది అత్తలు, ఒక పెదనాన్న! నాన్న ఎప్పుడూ బిజీ! మాకస్సలు టైమిచ్చేవారు కాదు. అన్నీ అమ్మే చూసుకునేది. మేము ఇద్దరం పిల్లలం. అన్న చిన్నప్పుడు హాస్టల్‌లో ఉండి చదువుకునేవాడు. నేను సెకెండ్ క్లాస్ వరకు సిద్దిపేటలో చదువుకున్నా. 1983లో ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇంజినీరింగ్ వరకు అక్కడే చదువుకున్నాను. పెద్ద ఫ్యామిలీ అవడం వల్ల, బంధువుల్లో ఎవరికి ఏ పని ఉన్నా మా ఇంటికే వచ్చేవారు. ఇల్లు ఎంత కిటకిటలాడేదంటే రూమ్స్ ఖాళీ ఉండే ప్రశ్నే లేదు. నాకు గుర్తుండి నేను చాలా ఏళ్లపాటు బాల్కనీలోనే చదువుకున్నా.

చదువులు...
మొదటినుంచీ యావరేజ్ స్టూడెంట్‌నే కానీ, హోమ్‌వర్కులవీ చాలా బాధ్యతగా చేసేదాన్ని! ఇంటర్ అవ్వగానే ఇంజినీరింగ్ చదవాలని పట్టుదలగా ఎంసెట్‌కు ప్రిపేరయ్యి, విజ్ఞాన్‌జ్యోతి కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. బీటెక్ తర్వాత అమెరికాలో ఎమ్మెస్ చేస్తాననగానే మా అమ్మ అభ్యంతరపెట్టింది... మా కమ్యూనిటీలో ఆడపిల్లలు ఎక్కువగా చదువుకోరని, పెళ్లి చేశాక అమెరికా పంపడం కరెక్టని! కానీ, ఆ టైంలో నాన్న మాత్రం నన్ను బాగా సపోర్ట్ చేశారు - ‘ఒక్కళ్లే వెళ్లడానికి చాలా మంది ధైర్యం చెయ్యరు... తనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పంపిద్దాం. తను కూడా ప్రపంచాన్ని చూడాలి కదా’ అని! అలా నేను యుఎస్‌లో మిసిసిపీలోని ఒక యూనివ ర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత అక్కడే జాబ్ చేశాను.

నాన్నలో నాకు నచ్చే విషయాలు....
నాన్న చిన్నప్పటినుంచి ఒక మాట రిపీటెడ్‌గా చెప్తుండేవారు... ‘మంచి చేస్తే రిజల్ట్ మంచిగా ఉంటుంది. చెడు చేస్తే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా చెడు రిజల్టే ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు’ - అని! అది బాగా నచ్చుతుంది నాకు. ‘ప్రిన్సిపుల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్’ అనేదాన్ని ఆయన గట్టిగా నమ్ముతారు. అంతేకాదు, ఎవ్వరు ఎన్నన్నా తిట్టనీయండి, ఎవరు ఎంతైనా వ్యతిరేకించనీయండి... ఆయన ఒకటి రైట్ అనుకుంటే, అదే రైట్ అని మొండిగా నమ్ముతారు. ఉదాహరణకు ఆయన రాజకీయాల్లో ఎప్పుడూ, ఎక్కడా ఒక్క చుక్క లిక్కర్ కూడా పంచలేదు. నాతో ఒక్కటే అన్నారు - ‘ఓడిపోయినా సరే, నేనొక పాలసీ పెట్టుకున్నా... అదే ఫాలో అవుతా’ అని! ఆ మొండితనం నాకు బాగా నచ్చుతుంది. ఆ విషయంలో నేను కూడా నాన్నలాగా ఉండాలనుకుంటాను.

ktr-and-kavithaఅన్నతో అనుబంధం...
8వ తరగతి వచ్చేవరకు అన్న హాస్టల్‌లో ఉండడంతో ఇద్దరికీ మిస్సింగ్ ఫీలింగ్ బాగా ఉండేది. అసలు ఇద్దరం ఎప్పుడూ కొట్టుకునేవాళ్లం కాదు. ఎంతంటే, మా ఫ్యామిలీ అంతటిలో ఐడియల్ అన్నాచెల్లెళ్లు ఎవరంటే రాము - కవిత అని ఇప్పటికి కూడా అందరూ చెప్తూంటారు. అన్న రాముడంటే రాముడు. తనకు మొదటినుంచీ చాలా పేషన్స్ చాలా ఎక్కువ... అమ్మకన్నా! నాన్న ఎక్కువగా ఉండేవాడు కాదు కాబట్టి అన్నీ అన్నే చూసుకునేవాడు. తను బయటకు సీరియస్‌గా కనిపిస్తాడు కానీ, ఇంట్లో చాలా జోవియల్‌గా, అందర్నీ ఆటపట్టిస్తుంటాడు. ఇద్దరం కలిస్తే ఎక్కువ పిల్లల గురించే మాట్లాడుకుంటాం... పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోం.

పెళ్లికి ముందు...
సెప్టెంబర్ 2, 2001లో నాకు అమెరికాలో పెద్ద యాక్సిడెంట్ అయింది. కాళ్లు చేతులు, ఎముకలు విరిగిపోయాయి... బతకడమే కష్టం అనుకున్నారు. సరిగ్గా అదే టైమ్‌లో ఇక్కడ నాన్న బైఎలక్షన్స్ (టీడీపీ నుంచి బయటికొచ్చాక) ఉండడంతో ఆయనకు మేం ఆ విషయం చెప్పలేదు. పది రోజుల తర్వాత కొంత కోలుకున్నాక, నేనే ఇండియా వచ్చేశాను. పూర్తిగా రికవర్ అవ్వడానికి రెండు మూడు నెలలు పట్టింది. ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్తానన్నాను. మొదటిసారి చదువుకోవడానికి అమెరికా వెళ్లినప్పుడు ప్రోత్సహించి పంపిన నాన్న ఆసారి మాత్రం ‘నథింగ్ డూయింగ్, పెళ్లి చేసుకున్నాకే వెళ్లేది’ అని తేల్చి చెప్పారు. అప్పటికే నేను చదువు పూర్తయి అక్కడ జాబ్ చేస్తుండడంతో ‘ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను... కొన్నాళ్లు వర్క్ చేయాలి’ అని పట్టుబట్టాను. దాంతో నాన్నకు, నాకు పంతాలు పెరిగి, ఒకే ఇంట్లో ఉంటూ కూడా రెండు మూడు నెలలు మాట్లాడుకోలేదు. బాగా గుర్తు... ఆ టైమ్‌లో అమెరికాలో వున్న అన్నతో రికమెండేషన్ చేయడానికి ప్రయత్నించా! ‘అన్నా, నువ్వొచ్చి నన్ను తీసుకెళ్లిపో’ అని అన్నకు పంపిన పెద్దపెద్ద ఈమెయిల్స్ ఇప్పటికీ దాచుకున్నాను. ఆ టైంలో అన్న, నాకు - నాన్నవాళ్లకి మధ్య నైస్ మీడియమ్‌గా నిలిచాడు గానీ, చివరికి నాన్నమాటే చెల్లింది.kcr-and-family

మెట్టినింట్లోకి...
ఇక పెళ్లి చేసుకుని వెళ్లక తప్పదని తెలిసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను... వచ్చే వ్యక్తి అందంగా ఉన్నా లేకపోయినా, కొంచెం డీసెంట్‌గా, పద్ధతిగా ఉంటే చాలు అని! ఎందుకంటే, తల్లిదండ్రులు చూస్తున్నారు కాబట్టి, మంచి కుటుంబమే అయ్యుంటుందని నమ్మకం. (నవ్వుతూ) పెళ్లిచూపుల్లో మా ఆయన్ని బాగా జడిపించాను- ‘హెయిర్‌కు కలర్(డై) వేసుకుంటాను; నాకు యాక్సిడెంట్ అయింది... ఒళ్లంతా గాయాలు... మరకలున్నాయి; పెళ్లయిన మొదటి సంవత్సరం పని చేయను - లాంటి ఎన్నో కండిషన్స్ పెట్టాను. పాపం అంతా విని మా ఆయన ఒకటే అన్నారు - ‘పెళ్లయ్యాక యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాను’ అని! ఆ ఒక్క మాటకే ఢమాలని పడిపోయి వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాను.నా అదృష్టమేంటంటే మా అత్తమ్మవాళ్లు నాతో చాలా క్లోజ్‌గా ఉంటారు! ఆడబడుచయితే మరీ... సొంత సిస్టర్‌లానే! ఎంత క్లోజంటే... ముగ్గురం కలిసి మా ఆయన మీదకి యుద్ధానికి వెళ్తుంటాం. బాగా గుర్తు... పెళ్లయిన ఒకటి రెండు సంవత్సరాల తర్వాత మా ఆయన నాతో ‘వీల్లేంది, నాకు చెప్పకుండా అన్నీ నీకు ఫోన్‌చేసి చెప్తున్నారు’ అని కంప్లయింట్ చేశారు.
నేను, మా ఆయన ఇద్దరం అమెరికాలో కొన్నేళ్లు పనిచేశాక ఇద్దరికీ ఇండియా మీద గాలిమళ్లింది. యుఎస్‌లో జీవితం మెకానికల్ అయిపోయింది... పొద్దున లేస్తే ప్రోగ్రామింగ్‌లు, డీబగ్గింగ్‌లు చేసిచేసి, పిచ్చిలేచి.. ఇక మనవల్ల కాదనిపించి తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. అదే టైమ్‌లో సడెన్‌గా మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రెండే రెండు రోజుల్లో అన్నీ సర్దుకుని ఇండియా తిరిగి వచ్చేశాం. మళ్లీ ఆ బోరింగ్ కంప్యూటర్ జాబ్ చేయడం ఇష్టంలేక రాగానే నేను సెలూన్స్ చెయిన్ (లాక్మే) బిజినెస్‌లో, మా ఆయన గ్రానైట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో దిగిపోయాం.Kavitha-family

తల్లిగా...
నాకు ఇద్దరు పిల్లలు... పెద్దోడికి ఎనిమిదేళ్లు, చిన్నోడికి నాలుగు! టైమివ్వరని ఒకప్పుడు నేను మా నాన్నను ఎలా తిట్టుకునేదాన్నో... ఇప్పుడు నా పిల్లలు, మా ఆయన నన్ను అలానే తిట్టుకుంటున్నారు. నాన్నను నిత్యం జనాలతో చూసినప్పుడల్లా చిన్నప్పుడు అనుకునేదాన్ని - ‘ఆయన జీవితంలో మేం ముఖ్యం కాదు. ఆయనకు వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. వాళ్లతోనే ఊరేగచ్చు కదా’ అని! కానీ ఇప్పుడు అర్థమవుతోంది... నేనూ నా పిల్లల విషయంలో అలానే చేస్తున్నానని!అయితే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మా అత్తమ్మ, ఆడపడుచు చాలా సపోర్టివ్! అత్తమ్మవాళ్లు నిజామాబాద్‌లో ఉంటారు కాబట్టి, ఎక్కువ శాతం పిల్లల్ని మా ఆడపడుచు ఇంట్లోనే వదిలేస్తుంటాను. పిల్లలు తన దగ్గర చాలా హోమ్లీగా ఫీలవుతారు. నేను కూడా చేతనైనంత వరకు వర్కునీ, ఫ్యామిలీని కంపార్ట్‌మెంటలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా! పబ్లిక్ లైఫ్‌లో వున్న మహిళలకు ఇది తప్పదేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Biography of durgabai deshmukh
Jyoti amge named world record  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles