Power cut in vishaka airport due to seemandhra power employees strike

Power Cut in Vishaka Airport Due to Seemandhra Power Employees Strike, Seemandhra Power Employees

Power Cut in Vishaka Airport Due to Seemandhra Power Employees Strike

సమ్మె ప్రభావం విమానాశ్రయం పై పడింది

Posted: 10/07/2013 08:27 PM IST
Power cut in vishaka airport due to seemandhra power employees strike

రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రభావం విశాఖ విమానాశ్రయం పై కూడా పడింది. విమానాశ్రయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం టెర్మినల్ ను జనరేట్లతో నడిపిస్తున్నారు.

 

జల విద్యుత్

 

విశాఖ జిల్లా సీలేరు, డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలకు సమైక్యాంధ్ర ఉద్యమసెగ తగిలింది. దీంతో గంటపాటు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్ర విభజనకు నోట్‌తో సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇందులో భాగంగా సీలేరు కాంప్లెక్స్‌లోని జల విద్యుత్ కేంద్రాలను ముట్టడించారు. వెంటనే విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. జెన్‌కో ఉద్యోగులు విధులు బహిష్కరించాలంటూ రెండు గంటలసేపు ఉద్యమకారులు బైఠాయించారు. ఆందోళనకారుల డిమాండ్‌ను మోతుగూడెం సీఈ కృష్ణయ్య దృష్టికి ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకెళ్లారు.

 

ఆయన ఆదేశాల మేరకు గంటపాటు విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. దీంతో సీలేరు నాలుగు యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇదే సమయంలో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా సుమారు వెయ్యి మంది ముట్టడించడంతో అక్కడ కూడా 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈమేరకు గాజువాక, బొంగూరు సబ్‌స్టేషన్‌లకు 220 కేవీ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్లీడర్‌ర్లు మొరాయించి సీలేరులో లోవోల్టేజి సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీలేరు పోలీసులు విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకుని ఉద్యమకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని, సీమాంధ్ర అల్లకల్లోలం అవుతుంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి పంపడం సరికాదని, తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more