Mim chief asaduddin owaisi in visakhapatnam

mim chief asaduddin owaisi, visakhapatnam, mim chief asaduddin owaisi in visakhapatnam, mim party, congress party, breaking news, ap politics, political news, andhra news

mim chief asaduddin owaisi in visakhapatnam

ఎంఐఎం అధినేత అససుద్దీన్‌ ఓవైసి రహస్య సమావేశం?

Posted: 06/13/2013 07:35 PM IST
Mim chief asaduddin owaisi in visakhapatnam

ఎంఐఎం అధినేత అససుద్దీన్‌ ఓవైసి నగరంలో ముస్లిం పెద్దలు , మేధావులతో రహస్యచర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విశాఖ నగరానికి చేరుకున్న ఆయన రాత్రి పలువురు మేధావులను పార్టీలకతీతంగా పిలిచి సమావేశం అయ్యారు. విఐపిరోడ్డు ఎదురుగాగల ఓ మసీదులో ఈ సమావేశ జరిగింది. రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నేపధ్యంలో, కాంగ్రెస్‌తో ఎంఐఎం తెగతెంపులుచేసుకున్న నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ముస్లింలు అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించి ముస్లిం నేతలను, ఎంఐఎం సానుకూలపరులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్‌కు సాధారణ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారని గతంలోనే ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే ఆయన రాష్ట్రంలోని మైనార్టీ ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మైనార్టీ ఓట్లు విజయవకాశాలకు కీలకం కావడంతో ఆయన మైనార్టీలను ఒకతాటిపైకితెచ్చేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు, మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఓట్‌బ్యాంకుగానే ఉపయోగించుకోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమ స్వంత ప్రయోజనాలకు ముస్లింలను ఆయా పార్టీలు వినియోగించుకుంటున్నాయనే ఆరోపణలు వున్నాయి. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలన్న అంశంపై కూడా చర్చించినట్లు ముస్లిం సోదరులు వెల్లడిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Workers strike at visakhapatnam port

  ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

  Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

 • Minister balaraju fire on t bill

  టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

  Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

 • Student jac egg attacks on purandeswari

  కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

  Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

 • Lehar cyclone effect to coastal ap

  విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

  Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

 • Kishore chandra deo wants vizag to be seemandhra capital

  ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

  Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more