రాష్ట్ర పర్యాటక శాఖ ఈడీ శ్రీనివాస్ కార్మికులతో చర్చించారు. టూరిజం కార్పొరేషన్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న దృష్ట్యా సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని కోరారు. కార్మికులు అంగీకరించకపోవడంతో ఆయన వెనుతిరిగారు. పర్యాటక శాఖకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుండంతో తక్షణమే విధుల్లోకి చేరకపోతే కార్మికులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక శాఖ మేనేజింగ్ డెరైక్టర్ చందనా ఖాన్ కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులకు కాంట్రాక్టు కార్మికులు తలవంచక తప్పలేదు. ఉత్తర్వులను పర్యాటక శాఖ విశాఖ జీఎం ఉమ్మారావు తీసుకొచ్చి కార్మికులకు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ఉత్తర్వులను తీసుకోవడానికి కార్మికులు నిరాకరించారు. దీంతో గేటు వద్ద ఆ ఉత్తర్వులు అంటించగా కార్మికులు చించి వేశారు. కార్మికుల 12 రోజుల సమ్మె వల్ల ఐదు యూనిట్లలో రూ.70 లక్షల మేర నష్టం వాల్లిందని టూరిజం జీఎం ఉమ్మారావు తెలిపారు. అరకులోయలోని పున్నమి, హరిత రిసార్ట్స్, అనంతగిరి, బొర్రా, జంగిల్‌బెల్ యూనిట్లలో కాంట్రాక్టు కార్మికులు 99 మంది, మేన్‌పవర్ కార్మికులు 68 మంది, గార్డెన్ వర్కర్స్ 27 మంది,సెక్యూరిటీ 32 మంది, డ్వాక్రా కార్మికులు 23 మంది, డైలీవేజ్ ముగ్గురు, స్వీమింగ్‌పూల్ కార్మికులు ఇద్దరు పని చేస్తున్నారని చెప్పారు. వీరిలో కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం సాయంత్రం నుంచి విధుల్లో చేరారు. పర్యాటక శాఖ కార్మికులు ఎప్పుడు సమ్మె చే సినా వీరిలో ఎక్కువగా నష్ట పోయేది మేన్‌పవర్ కార్మికులే. గత ఏడాది సమ్మె చేపట్టినప్పుడు మేన్‌పవర్ కార్మికుల సమస్యలు ఒక్కటీ పరిష్కారం కాలేదు. కాంట్రాక్టు కార్మికులకు మాత్రం సమాన పనికి సమాన వేతనం అమలు చేశారు. వీరితో సమానంగా పని చేస్తున్న మేన్‌పవర్ కార్మికులకు ఇది వర్తింప జేయలేదు. ఈ దఫా సమ్మెలో కూడా పర్యాటక శాఖ తమకు మొండి చెయ్యి చూపిస్తుండడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పర్యాటక శాఖ కాంట్రాక్టు కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడంతో శనివారం నుంచి పర్యాటక కేంద్రాలన్నీ కళకళలాడనున్నాయి. 12 రోజుల పాటు కార్మికుల సమ్మెతో ఈ కేంద్రాలన్నీ బోసిపోయాయి. సమ్మె విరమణతో స్థానిక వ్యాపారులు, వాహనాల యజమానులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more