విశాఖపట్నం, మేజర్‌న్యూస్: ఒకప్పుడు మానవాళిని భయపెట్టిన మహమ్మారి టీబీ. వ్యాధి నివారణకు మంచి మందులు అందుబాటులోకి రావడంతో పూర్తిగా అదుపులోకి వచ్చిందని అందరూ భావించారు. అయితే, ఇప్పటికీ టీబీ బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య చేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందా అన్న ఆందోళన తప్పదు. రాష్ట్రంలో గడిచిన ఐదు దశాబ్దాలుగా టీబీ నివారణకు ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చు చేసింది. అయినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేర్కొనే విశాఖ నగరంలో క్షయ వ్యాధితో మరణిస్తున్న వారి సంఖ్య చూస్తే, ఆందోళన కలగక తప్పదు. విశాఖ జిల్లాలో క్షయ బారిన పడి 119 మంది మృత్యువాత పడ్డారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. క్షయ పూర్తిగా కనుమరుగు అయిందనుకున్న తరుణంలో మళ్లీ జడలు విప్పుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టీబీ నివారణకు ప్రత్యేక అధికారి, మండలాల్లో సిబ్బంది, అలాగే, ఎన్జిఓలు పనిచేస్తున్నా, వ్యాధిని పూర్తిగా అరికట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.2008 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలోనే 119 మంది క్షయతో మృరణించారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ జిల్లా క్షయ నివారణ అధికారే పేర్కొనడం గమనార్హం. నివారణకు తమ వంతు కృషి చేస్తున్నా, ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి తలెత్తుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 20 వరకూ పరీక్షల ద్వారా 970 మందికి క్షయ ఉన్నట్టు గుర్తించామని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు.2009లో 5705 మంది పైగా క్షయ రోగులను గుర్తించి, చికిత్స అందించగా, 3200 మందికి స్వస్థత చేకూరిందని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా కంపోజిట్ క్షయ వ్యాధి గ్రస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. క్షయ నివారణ కోసం 2003లోనే అప్పటి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గాను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని వైస్ చైర్మన్‌గా, జిల్లా క్షయ నివారణాధికారిని మెంబర్ సెక్రటరీగా నియమించి ఈ క్షయ వ్యాధి కోసం ప్రత్యేక పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే డాక్టర్లు, ఇతర ఇన్జీవోల మధ్య క్షేత్ర స్థాయిలో సమన్వయ లోపం, జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడం ఇతరాత్ర కారణాల వల్ల వ్యాధి మళ్లీ ప్రభలుతోంది. జిల్లాలో 41 లక్షల 50 వేల మంది జనాభా వున్నారు. 11 టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటిలో అరకు, పాడేరు, చింతపల్లి,ప్రాంతాల్లో 3 యూనిట్లను మిగిలిన ప్రాంతాల్లో 8 యూనిట్లను ఏర్పాటు చేశారు.
ఒక్కొక్క యూనిట్ కింద మైదాన ప్రాంతాల్లో 5 లక్షల జనాభా కోసం గిరిజన ప్రాంతాల్లో 2.5 లక్షల జనాభా కోసం ఈ యూనిట్లను ఏర్పాటు చేశారు.క్షయపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు, ఎన్జీవోలు పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా 5049 ప్రత్యేక క్షయ రోగ పర్యావేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీబీ నిర్ధారణ అయితే, ఆ రోగులు తొమ్మిది నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. అయితే, మందులు సక్రమంగా వాడకపోవడం వల్లే రోగం అదుపులోకి రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అలాగే, నిధుల కొరత కూడా కొంత వరకూ అవరోధంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 24న జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని సిరిపురం నుంచి పెదవాల్తేరులో ఉన్న టీబీ హస్పటల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ బి.శశిధర్ కుమార్ చెప్పారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్షయపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరింత విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. అయితే, ఏప్పుడో ఏడాదికోమారు ర్యాలీలు నిర్వహించిన మాత్రాన ప్రజల్లో అవగాహన రాదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలి. అదే సమయంలో నగరంలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడితే, కొంత వరకూ ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, క్షయ నివారణకు తగిన చర్యలు చేపట్టకపోతే, భవిష్యత్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారయ్యే ప్రమాదం ఉంది.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more