Araku valley flowers gardens

araku valley flowers gardens, araku hill place, visakha district araku, araku borra caves, hill station araku, flowers crop, flower variety araku scenery

in visakha district araku valley now very beautiful looking with beautiful flowers and gardens

11.gif

Posted: 10/23/2012 05:49 PM IST
Araku valley flowers gardens

ara

ఇప్పుడు అరకులోయ కొత్త శోభ సంతరించుకుంది. వలిసె పూల సోయగాలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి. పసుపు పచ్చని తివాచీ పరచినట్టు ఉన్న ఈ తోటల్లో పర్యాటకులు విహరిస్తూ మైమరచి పోతున్నారు. ఈ తోటల మధ్య ఫొటోలు తీసుకుంటూ వలిసె పూల అందాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. అరకులోయ మండలంలోని 14 పంచాయతీల గిరిజనులు 735 హెక్టార్లు, అనంతగిరి మండలంతో 450 హెక్టార్లలో ఈ పంటను సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు ఈ పంటకు బాగా అనుకూలించాయి. వాస్తవానికి నవంబర్ నెల నుంచి వలిసె పూలు విరబూసి పర్యాటకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ఈ ఏడాది ముందుగానే సాగు చేయడంతో అక్టోబర్ నెలలోనే వలిసె పూలు అందాలు విరజిమ్ముతున్నాయి. అరకు వస్తున్న సందర్శకులకు దారి పొడవున తమ వాహనాలను నిలిపి ఈ తోటల్లో కొద్ది సేపు గడిపి వెళ్తున్నారు. అరకులోయకు పర్యాటకుల తాకిడి
అరకులోయలో పర్యాటకుల సందడి నెలకొంది. అక్టోబర్ మొదటి వారం నుంచే పర్యాటక సీజన్ ప్రారంభమైనప్పటికీ టూరిజం, ఐటీడీఏ కార్మికుల సమ్మెతో పర్యాటకుల సంఖ్య బాగా తగ్గి అరకులోయ బోసిపోయింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.  కార్మికులు సమ్మె విరమించడంతో పాటు, దసరా సెలవులు ఇవ్వడంతో భారీ సంఖ్యలో పర్యాటకులు కుటుంబాలతో సహా సోమవారం ఇక్కడికి వచ్చారు. గిరిజన మ్యూజి యం, పద్మాపురం ఉద్యానవన కేంద్రాలు పర్యటకులతో కళకళలాడాయి. వివిధ ప్రాంతా ల పర్యాటకులు తరలి వస్తుండడంతో స్థానిక హోటళ్లు, ఇతర దుకాణాల్లో జోరుగా వ్యాపారం సాగుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vizag to singapore flight service
Araku ustav starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more