Balarajugalla fall out over sand mafia

A workshop by the department of mines and geology, on 'Manufactured Sand Utilization' on Thursday, saw differences between two ministers

A workshop by the department of mines and geology, on 'Manufactured Sand Utilization' on Thursday, saw differences between two ministers

15.1.png

Posted: 09/07/2012 12:00 AM IST
Balarajugalla fall out over sand mafia

Balaraju_Galla_fall_out_over_sand_mafia

Galla_Aruna

వారిద్దరూ బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. మరో మంత్రి కూడా వేదికపై ఉండగానే, అధికారులు, శాసనసభ్యులు, ఆహ్వానితుల సమక్షంలోనే మాటామాటా అనుకున్నారు. మహిళా అమాత్యురాలనైనా చూడకుండా జిల్లా మంత్రివర్యులు ఆగ్రహంతో సభాస్థలి నుంచి నిష్ర్కమించటం అందరినీ ఆశ్చర్యపరచింది. రాతి నుంచి తయారు చేసే ఇసుక వాడకంపై గనుల శాఖ నగరంలోని వైశాఖి జల ఉద్యానవనంలో గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో చోటు చేసుకున్న సంఘటన ఇది. గనుల శాఖా మంత్రి గ ల్లా అరుణ కుమారి ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా జిల్లాకు చెందిన మంత్రులు పి.బాలరాజు, గంటా శ్రీనివాసరావు, పలు శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి బాలరాజు ప్రసంగిస్తూ సహజ వనరులకు పుట్టిళ్లయిన గిరిజన, గ్రామీణ ప్రాంతీయుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచకుని విధానాలు రూపొందించాలన్నారు. ఇసుక నిషేధం పేరుతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు నాటుబళ్లపై ఇసుకను తరలిస్తున్న ఏజెన్సీవాసులపై గనుల శాఖాధికారులు తమ ప్రతాపం చూపటం ఎంతవరకూ సబబూ అని ప్రశ్నించారు. అసలు ఇసుక మాఫియా ఎవరు? ఇసుక మీద నిషేధంతో ఆందోళన చెందుతున్న వర్గాలేవి? అన్నది గుర్తించకుండా ఇలాంటి వేదికలపై రూపొందించే విధానాలు పేదలకు ఏ రకంగా ఉపయోగపడతాయో ఆలోచించాలని ఆయన ఆవేశంగా అన్నారు. తన కళ్ల ముందే మాఫియాకు చెందిన వ్యక్తులు ఇసుకను లారీల కొద్దీ తరలించుకుపోతున్నారని వారిని వదిలిపెట్టి గిరిజనులను వేధిస్తున్నారని, మైనింగ్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదని వాపోయారు. ‘మా ప్రాంతంలోని సహజవనరులను మేం ఉపయోగించుకోవటంలో తప్పేమిటి?’ అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

ముఖ్యఅతిథి, మంత్రి అరుణ కుమారి మాట్లాడుతూ ‘మంత్రి బాలరాజు పదేళ్లుగా విశాఖలో కాపురం పెట్టారు. విమానాల్లో తిరుగుతున్నారు. గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యలు గ్రామాల్లో లేని వారికేం తెలుస్తాయి? ఇప్పటికీ మా స్వగ్రామంలో వారానికి రెండుసార్లు అక్కడి ప్రజలతో గడుపుతాను. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటాను. అలా అయితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి’ అని తీవ్ర స్వరంతో అన్నారు. ఇసుక గిరిజన ప్రాంతాల్లో మాఫియా తీసుకెళ్లినపుడు మంత్రి బాలరాజు ఎందుకు అడ్డుకోలేదని ఎదురు ప్రశ్నించారు. పక్కనే ఉన్న బాలరాజు ఈ మాటలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మీ మీద గౌరవం ఉంది. అది నా డ్యూటీ కాదు. ఇప్పటికీ చూపిస్తా. మాఫియా ఇసుకను ఎలా తరలించుకుపోతున్నారో. మీరేం చేస్తున్నారు? మీ ఆఫీసర్లేం చేస్తున్నారు?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రకంగా కొద్దిసేపు ఇరువురి మధ్య వాదనలు జరిగాయి. సహనం కోల్పోయిన బాలరాజు విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. మైనింగ్‌శాఖ అధికారి సుశీల్‌కుమార్ మంత్రిని బ్రతిమిలాడినా వెనుతిరగలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Zilla praja parishad officevisakhapatnam
Scr plans double decker ac trains from hyd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more