Vijayawada municipal staff and doctors strike

vijayawada municipal staff strike, vijayawada doctors strike, junior doctors on strike, ntr complex bandh, samaikyandra bandh, breaking news, ap politics, political news, andhra news

Vijayawada Municipal Staff and Doctors Strike

ఎన్టీఆర్ కాంప్లేక్స్ బంద్- రోడ్డెక్కిన డాక్టర్లు ..

Posted: 08/05/2013 07:58 PM IST
Vijayawada municipal staff and doctors strike

విజయవాడ గవర్నర్ పేట లోని ఎన్టీఆర్ షాషింగ్ కాంప్లెక్స్ లో వ్యాపారులు సమైక్యాంద్రకు మద్దతుగా పూర్తి బంద్ పాటించారు. కాంప్లెక్స్ లో ఉన్న 120 దుకాణాలను మూసివేసి తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చచేశారు. అనంతరం వ్యాపారస్థులు విజయవాడ నగరంలో భారీ ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు.

 

బహిష్కరించిన డాక్టర్లు

రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లా కేంద్రమైన మచిలీపట్టణంలో వివిధ సంఘాల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా ఆసుపత్రి వద్ద ప్రభుత్వ వైద్యులు అత్యవసర సేవలు మినహా విధులును బహిష్కరించారు. ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద వర్షంలో తడుస్తూ రెండు గంటలపాటు తమ నిరసను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజన నిర్ణయం పట్ల కేంద్రం పునరాలోచించుకోకపోతే సమైక్యాంద్ర ఉద్యమంలో తాము భాగస్వాములావుతామని హెచ్చరించారు. అయితే మాదవ్ అనే వ్యక్తి సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు.

 

72 గంటల సమ్మె

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చూస్తూ మున్సిపల్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జేఏసీ కన్వినర్ ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర న్యాయకత్వ పిలుపు మేరకు 72 గంటల పాటు విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. సాయంత్రం వరకు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన ఉద్యోగులు కేసిఆర్ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సాయిప్రసాద్ గుండు చేయించుకొని నిరసన తెలియజేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more