ఒక్కో ఇందిరమ్మ ఇల్లు ఏరియాను బట్టి రూ.లక్ష నుంచి 2.20 లక్షలకు విక్రయిస్తున్నారు. అదే ఇందిరమ్మ స్థలం అయితే రూ. 40 నుంచి 70 వేలకు అమ్ముతున్నారు.పెడన పట్టణంలో ఇంటి అద్దెలు ఆకాశనంటుతుండటం, స్థలం కన్న ఇందిరమ్మ ఇల్లు తక్కువ రేటుకు రావటం తదితర కారణాలతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన గ్రామీణులు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. పెడన పట్టణం పలు వ్యాపారాలకు వేదికగా మారుతుండటంతో గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు మాజీ ప్రజా ప్రతినిధులను ఆశ్రయించటంతో వారు రాత్రికి రాత్రే ఇందిరమ్మ ఇల్లును చేతులు మార్చేస్తున్నారు. రాజీవ్ నగర్ కాలనీలో ఇదేవిధంగా ఓ మాజీ కౌన్సిలర్ బీనామీ పేరుతో ఉన్న పది ఇళ్లను విక్రయిచాడని,అదే తంతు పెడమ్మ తల్లి దేవాలయం పక్కనే ఉన్న కాలనీలో జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. పేదవాడికి గూడు కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు... అవి అన్యాక్రాంతమవుతుంటే మాత్రం చోద్యం చూస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు, స్థలాల క్రయ విక్రయాలు యథేచ్చగా జరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.పెడన పట్టణంలో ఈ ప్రక్రియ జోరుగా సాగుతోంది. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులే బీనామీ పేరుతో ఇందిరమ్మ పేరుతో స్థలాలు పొంది ఇల్లు నిర్మించి అమ్మివేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముందుగా కేటాయించిన 1614 ఇందిరమ్మ ఇళ్లల్లో 500కుపైగా ఇద్దరు ముగ్గురు చేతులు మారాయంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. నిత్యం ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి ఈ విషయాలు తీసుకువెళ్లినా...సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. అమ్మకాలు జరిపిన మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు ఏకమై తప్పుడు నివేదికలు ఇచ్చి ఉన్నతాధికారులను తప్పు దారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. అడ్డుకోవాల్సిన అధికారులే చూసీ చూడనట్లు వ్యవహారించటంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more