నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బాడిత శంకర్ వైసీపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లోకి రావడానికి దాదాపుగా రంగం సిద్ధం అయింది. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి నగర పర్యటన షెడ్యూల్ కోసం వేచిచూస్తున్నట్టు సమాచారం. గాంధీహిల్ అభివృద్ధి కోసం కేంద్ర టూరిజం శాఖ రూ.8 కోట్లు వెచ్చించింది. ఈ సందర్భంగా నగరంలో చిరంజీవితో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీలోకి వెళ్ళిన కొందరు నాయకులను వెనక్కు తెచ్చుకునేదుకు ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని పార్టీ నాయకుల్లో ఒకరు చెప్పారు. ఆ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మే అయిదవ తేదీలోగా కేంద్రమంత్రి చిరంజీవిని నగరానికి తీసుకురావడానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి రవి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఆ సమయంలోనే బాడిత శంకర్‌తోపాటు మరికొందరు నాయకుల రీఎంట్రీ ఉండవచ్చని అంటున్నారు.కృష్ణలంకలో ఓ బార్ వద్ద జరిగిన గొడవ నుంచి శంకర్‌ను ఆదుకోవడంతోపాటు దుర్గగుడి మీద ఒక కాంట్రాక్టు ఇప్పించడానికి లోపాయికారీగా అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవ తీసుకుని శంకర్‌తో మాట్లాడుతున్నట్టు సమాచారం. జిల్లాలో వైసీపీ ప్రాభవం అంత కనిపించడం లేదు. జగన్ సోదరి షర్మిల పాదయాత్రతో వైసీపీ నేతలు అయోమయంలో పడ్డారు. రెండేళ్ల క్రితం జగన్ మీద ప్రజలలో కనిపించినంత సానుభూతి ఇప్పుడు లేదని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. వైసీపీని ఆవహించిన నీరసాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇదే సరైన అదను అని కాంగ్రెస్ భావిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచితే వైసీపీలోకి వెళ్లిన వారిలో చాలామంది పీఛేముఢ్ అనడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more