Bride jump on marriage in madanapalle

Bride jump on marriage in madanapalle, Bride jump,

Bride jump on marriage in madanapalle

గంటల్లో పెళ్లి ..?

Posted: 06/18/2013 11:46 AM IST
Bride jump on marriage in madanapalle

మదనపల్లెలో ఉదయం పెళ్లి కుమార్తె అదృశ్యం కావడంతో వివాహం ఆగిపోయింది. బంధువుల కథనం మేరకు.. మదనపల్లె మండలం చీకలబైలుకు చెందిన ఓ వ్యాపారి కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా వేపల్లెపల్లెకు చెందిన తన అక్క కుమార్తెను తన ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాడు. ఆ యువతిని ఆ వ్యాపారికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇద్దరి అభిప్రాయాలు కనుకున్నారు. సరేననడంతో ముహూర్తాలు పెట్టించారు. ఉదయం 9 నుంచి 10 గంటల లోపు పెళ్లి జరిగేలా కల్యాణమండపంలో ఏర్పాట్లు చేశారు. రాత్రి వధూవరులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. రాత్రంతా నలుగులు పెట్టారు. రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు ఉంగరాలు, దండలు మార్చుకున్నారు. బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి పెళ్లి కుమార్తె కనిపించలేదు. పలుచోట్ల గాలించినా లాభం లేకపోయింది. ఉదయం 9.30గంటలకు వధువు ఏడ్చుకుంటూ కల్యాణ మండపానికి వచ్చింది. ఎక్కడికెళ్లావని ప్రశ్నిస్తే తనకు ఎవరో మత్తు మందు చల్లారని, వారి వెంట వెళ్లిపోయానని చెప్పింది. తేరుకునే లోపు తాను ఎక్కడున్నానో తెలియలేదని, చుట్టుపక్కల వారిని అడిగి కల్యాణ మండపానికి వచ్చానని చెప్పింది. దీన్ని అవమానంగా భావించిన వరుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అన్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles