Kavitaa pan brokers in oderu

Kavitaa Pan Brokers in oderu, madhanlal, rajastan madhanlal, tirupathi people, breaking news, ap politics, political news, andhra news

Kavitaa Pan Brokers in oderu

ఆశ చూపి ..కోట్ల రూపాయితో బిచాణా ఎత్తిన కవితా..?

Posted: 06/13/2013 06:55 PM IST
Kavitaa pan brokers in oderu

మోసపోయే వారు ఉంటే.. మోసం చేసే వారు చేస్తూనే ఉంటారు అని మాటలు నిజమవుతున్నాయి. పేద ప్రజల సొమ్ముతో ఒక కంపేనీ బిచాణా ఎత్తివేసింది. తిరుపతిలోని ఓడేరు కవితా పాన్ బ్రోకర్స్ కంపెనీ ప్రజల వద్ద నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసింది. తక్కువ వడ్డీ ఆశ చూపి బంగారం, ఇతర విలువైన వస్తువులను తాకట్టు పెట్టుకొని చివరకు బిచాణా ఎత్తివేసింది. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. సంస్ధ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రాజస్ధాన్ కు చెందిన మదన్ లాల్ కుటుంబసభ్యులు తిరుపతి లోని ఓడేరు లో కవితా పాన్ బ్రోకర్స్ కంపెనీ పేరుతో గత నాలుగేళ్లుగా తక్కువవడ్డీకి వస్తువులను కుదవ పెట్టుకుంటూ ప్రజలను నమ్మించారు. మరోవైపు ఓడేరు తో పాటు పద్మావతీపురం లో బ్రాంచీలు తెరిచారు. అధిక వడ్డీ ఆశచూపి కూలి పనులు చేసుకునే వారి నుంచి సుమారు 5 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు. ఖాతాదారులకు వడ్డీలు చెల్లించే సమయానికి బిచాణా ఎత్తివేశారు. తాము మోసపోయామని తెలుసుకున్న ఖాతాదారులు ఓడేరు లోని సంస్ధ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సంస్ధ నిర్వాహకుడు మదన్ లాల్ పై పోలీసులకు ఫిర్యాదుచేశారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles