Mee seva centers in tirupati

mee seva centers in tirupati, chittoor, madanapalli, certificates issue, death certificate, birth certificate issue,

mee seva centers in tirupati

‘మీ సేవ’ చేయలేం

Posted: 04/19/2013 03:23 PM IST
Mee seva centers in tirupati

జనన మరణ వివరాలతోపాటు, ఓటరు, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో మీసేవ తీవ్ర జాప్యం చేస్తోంది. కేంద్రాల్లో సాంకేతిక కారణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యం వెరశి సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్ల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 25 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. అదే విధంగా రూరల్ పరిధిలో మరో 130 వరకు ఉన్నాయి. మీ సేవ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 1000 వరకు పలు రకాల పత్రాలు జారీ చేస్తుంటే మరో 2 వేల మందికిపైగా తిరిగి వెళ్తున్నట్లు తెలుస్తోంది. చలానా చెల్లించిన వారంలో వారు కోరిన గుర్తింపు పత్రాలు అందజేయాలి. అయితే పలు కారణాల చేత 12 నుంచి 20 రోజులు పడుతోంది. ప్రధానంగా జనన,మరణ ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అర్జీదారులకు తిప్పలు తప్పటం లేదు. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్నా, ఉపకార వేతనాలు పొందాలన్నా జనన ధృవీకరణ పత్రం తప్పని సరి. వీటి కోసం దరఖాస్తుదారులు తిరుపతి కార్పొరేషన్, మీ సేవా కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, అవగాహనా లోపం దరఖాస్తు దారులకు శాపంలా మారింది. మనిషి పుట్టినప్పుడు, మరణించినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకు నిర్దిష్ట గడువు విధించింది. ఇంటివద్ద పురుడుపోసుకున్నా.. మరణించినా కార్పొరేషన్, మున్సిపాలిటీ లేదా పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే ఆస్పత్రిలో జరిగితే వైద్య సిబ్బంది అధికారులకు రిపోర్ట్ పంపుతారు. ఏడాదిలోపైతే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తరువాత నుంచి 15 ఏళ్ల వరకైతే రూ.5 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి. ఆపైన చేసుకోవటానికి వీల్లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles