Telugu mahasabhalu in tirupati

Telugu Mahasabhalu in Tirupati

Telugu Mahasabhalu in Tirupati.

Telugu Mahasabhalu in Tirupati.png

Posted: 11/30/2012 03:31 PM IST
Telugu mahasabhalu in tirupati

Mahasabhalu_in_thirupatiతిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని కోరు తూ గురువారం పాకాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాల వద్ద ఈ ర్యాలీని ఎంపీడీవో డాక్టర్ వెంకటనారాయణ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు భాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ఘనమైన చరిత్ర తెలుగుభాషకు ఉం దని, ఇప్పుడు ఆంగ్లభాషా వ్యామోహం లో పడి తెలుగును విస్మరిస్తే భావితరాలకు ఎంతో అన్యాయం చేసినవారమవుతామని హెచ్చరించారు. ఈ పరిస్థితి లేకుండా మాతృభాషకు ప్రతిఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ సీ రామచంద్రారెడ్డి మాట్లాడారు. ర్యాలీ లో విద్యార్థులు భీముడు, నన్నయ్య, భారతమాత వేషధారణలో అలరించా రు. జానపదగేయాలు, కోలాటాలతో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ లింగ య్య నాయుడు, జిల్లా రైతు సమాఖ్య కార్యదర్శి ఎన్.జగదీశ్వర చౌదరి, పంచాయతీ కార్యదర్శి మదనమోహన్ రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, రావెళ్ల మోహన్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prapancha telugu mahasabhalu postponed
Tirumala guest house narayanagiri4 launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles