Tirumala guest house narayanagiri4 launch

tirumala, devotees guest house, narayana giri4, narayanagiri guest house, tirumala, cm kiran kumar reddy open, tirumala venkateswara swami, lord balaji, tirumala temple, guest house narayanagiri4 launch

tirumala guest house narayanagiri4 launch

13.gif

Posted: 11/26/2012 06:05 PM IST
Tirumala guest house narayanagiri4 launch

       తిరుమలలో భక్తులు సౌకర్యార్థం నారాయణగిరి అతిథిభవనాల ప్రాంతంలో టిటిడి నిర్మించిన నారాయణగిరి అతిథిగృహం-4ను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. 4.18కోట్ల వ్యయంతో నిర్మించిన అతిథిగృహం 27.147 అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం ఐదు అంతస్థుల్లో నిర్మించిన ఈ అతిథిగృహంలో 30గదులు ఉన్నాయి. ఇందులో ప్రతిరోజు 150 భక్తులు బసచేసేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇందులో భక్తుల సౌకర్యార్థం ఒక లిఫ్ట్‌ ను కూడా ఏర్పాటు చేశారు.

1
       కాగా ఈ అతిథిగృహం ఎస్వీ రెస్ట్ హౌస్, వైకుంఠం క్యూకాంప్లెక్స్ సమీపంలో ఉండడం భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని భక్తుల దాహార్తిని తీర్చేందుకు టిటిడి 15కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన తెలుగుగంగ పథకం పైప్‌లైప్‌కు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. 15కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తలపెట్టిన ఈ పైప్‌లైన్ ద్వారా తిరుమలకు 5 ఎంఎల్‌డి, తిరుపతికి ఐదు ఎంఎల్‌డి నీరు సరఫరా అవుతుంది.
       కాగా తిరుపతిలోని టిటిడి ఇన్‌స్టిట్యూషన్స్, స్థానిక ఆలయాలు, స్విమ్స్, పరిపాలనా భవనం, టిటిడి విద్యాసంస్థలు, టిటిడి ఉద్యోగుల క్వార్టర్స్‌ కు నీటిని వినియోగించనున్నారు. ఈ నీటిని తరలించేందుకు 150హెచ్‌పి సామర్థ్యం కలిగిన మూడు మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పంప్‌రూమ్స్, జనరేటర్, యార్డ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
        అలాగే ధర్మగిరి వేదపాఠశాలలో వేదపండితుల కోసం 3.4కోట్లతో నిర్మించతలపెట్టిన నాలుగు క్వార్టర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. 13.672 చదరపు అడుగుల స్థలంలో ఒక్క ఫ్లోర్‌లో 16కుటుంబాలు నివాసం ఉండేందుకు వీలుగా నాలుగు బ్లాక్‌లలో 16 క్వార్టర్స్ నిర్మించనున్నారు. ఇందులో ఒక్కో క్వార్టర్‌లో ఒక బెడ్‌రూమ్, డైనింగ్‌రూమ్, లివింగ్‌రూమ్, పూజాగది, కిచెన్ అండ్ టాయిలెట్ ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రపై తెలుగులో, శ్రీవారి ఆలయంలోని శాసనాల్లో పేర్కొని ఉన్న ఆలయ చరిత్రతో ఇంగ్లీష్‌లో రూపొందించిన కరపత్రాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu mahasabhalu in tirupati
Telugu language greatness  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles