Eggs harmful effects heart attack cholesterol problems

eggs, harmful effects, eggs unhealthy problems, eggs problems, eggs heart problems, cholesterol problems, healthy tips, telugu healthy tips, eggs healthy tips, healthy problems

eggs harmful effects heart attack cholesterol problems

గుడ్లతో జాగ్రత్త.. ఎక్కువగా తింటే అంతే సంగతులు!

Posted: 11/26/2014 04:29 PM IST
Eggs harmful effects heart attack cholesterol problems

నిజానికి గుడ్లలో మానవ శరీరానికి కావలసిన పోషకపదార్థాలు ఎన్నో వుంటాయి. ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శక్తి ఎక్కువగా లభిస్తుందని టీవీల్లో కూడా ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇది ఏవిధంగా అయితే శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుతుందో.. అదేవిధంగా కొన్ని నష్టాలను కూడా కలిగిస్తుంది. ఆ విషయాలు చాలావరకు బయటికి రాలేదు కానీ.. గుడ్లతో కూడా జాగ్రత్తగా వుండాల్సిందేనని శాస్త్రజ్ఞులు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో పోషకాలు ఏ స్థాయిలో అయితే వుంటాయి.. కొలేస్టిరాల్ కూడా అంతే వుంటుందని అంటున్నారు. అలా అని తినడం పూర్తిగా మానేయాలని కాదు.. వాటిని ఏ మోతాదులో తీసుకోవాలో తెలుసుకుని తీసుకుంటే మంచిది.

గుడ్లలో వున్న పోషక విలువలు :

గుడ్లలో యాంటీఆక్సిడెంట్లు, అయోడిన్, విటమిన్ ఎ, విటమిన్ B2, విటమిన్ డి సమృద్దిగా ఉంటాయి. అంతేకాక దీనిలో జంతు ప్రోటీన్ చౌకగా లభిస్తుంది. ముఖ్యంగా గుడ్లులో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయం మెదడు కోసం ఒక ముఖ్యమైన పోషకం.

కొలెస్టిరాల్ శాతం :

నిజానికి గుడ్డును తేలికపాటి ఆహారంగా భావించేవారు కానీ పచ్చసొనలో కొలెస్టిరాల్ అధికశాతంగా వుంటుంది. కొన్ని పరిశోధనల తేలిన లెక్కప్రకారం.. ఒక గుడ్డులో వుండే కొలెస్టిరాల్ రోజువారీ తీసుకునే ఆహారంలో కంటే ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత (హార్ట్ ఎటాక్) వ్యాధులు ఖచ్చితంగా వస్తాయి.

జాగ్రత్తలు :

గతంలో జరిపిన అధ్యయనాల ప్రకారం.. ఒక వారంలో ఆరు గుడ్లు కన్నా ఎక్కువగా తీసుకోకూడదని తేల్చారు. అయితే ఇటీవలే జరిపిన పరిశోధనలప్రకారం.. కొలెస్టిరాల్ స్థాయి తక్కువగా వున్నవారు అనేక గుడ్లు తీసుకోవచ్చిన తేలింది. కానీ మధుమేహం వున్నవారు, కొలెస్టిరాల్ సమస్యతో బాధపడుతున్నవారు ఎక్కువగా తీసుకుంటే.. వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eggs  health tips  unhealthy problems  cholesterol problems  heart attack disease  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more