ప్రస్తుత సాంకేతిక రంగంలో ప్రతిఒక్కరిని బాధిస్తున్న వ్యాధి ‘‘తలనొప్పి’’! ఉదయాన్నే నిద్రలేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు తీరికలేకుండా ఇంటి పనులను నిర్వహించుకోవడంతోబాటు ఆఫీసు కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవాల్సి వుంటుంది కాబట్టి... ఈ సమస్య అనేది వస్తుంది. ముఖ్యంగా ఆఫీసు కార్యకలాపాల వల్ల ఈమధ్య మెదడుకు సంబంధించి చాలా వ్యాధులు కూడా వస్తున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలుతున్నాయి కూడా! పరిమితికి మించి ఎక్కువ పని చేయడం వల్లే ఈ తలనొప్పి సమస్య బాధిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
ఈ తలనొప్పి వల్ల రకరకాల అనారోగ్యాలు గురవుతాయి. మానసిక ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, మైగ్రేన్, నిద్రలేమి, డీహైడ్రేషన్.. ఇంకా కాలక్రమంలో అనేక సమస్యలకు గురుకావాల్సి వస్తుంది. కాబట్టి దీనిని ఎంత త్వరగా నివారించుకుంటే అంతే మంచిది. సాధారణంగా తలనొప్పిని నివారించుకోవడానికి మార్కెట్లో మందులు లభ్యమవుతాయి గానీ.. ఆ రసాయనిక మందులను నిత్యం వాడటం వల్ల ఇతర ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి.. మందులను కాకుండా ఇంట్లోనే అందుబాటులో వుండే కొన్ని హోంరెమెడీస్ ద్వారా తక్షణమే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...
1. నీళ్ళు : తలనొప్పి సమయంలో సరిపడా నీళ్ళు త్రాగి ఆ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిని తగ్గించడంలో నీళ్ళు ఎఫెక్టివ్ హోం రెమెడీ. తలనొప్పిగా అనిపించినప్పుడు వెంటనే ఒక గ్లాసు నీళ్ళు త్రాగితే మంచిది. అలాగే రోజంతా మద్యమద్యలో గ్యాప్ ఇస్తూ కొద్దికొద్దిగా త్రాగుతుండాలి.
2. ఐస్ ప్యాక్ : తలనొప్పిగా వున్నప్పుడు ఐస్ క్యూబ్ తీసుకొని నుదిటి మీద పెట్టి మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ చల్లగా ఉండే ఐస్ ముక్కలు అందుబాటులో లేకపోతే వెంటనే చల్లటి నీటిలో తడిగుడ్డను డిప్ చేసి, నుదిటి మీద వేసుకొని, పది నిముషాలు వేసుకోవాలి.
3. వేడి నీళ్ళు : హాట్ వాటర్ బ్యాగ్స్ (మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి)లలో వేడినీళ్ళు పోసి.. మెడ మీద సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మెడ నరాల మీద వేడి తగలగానే ఒత్తిడికి కారణం అయ్యే కండరాలు విశ్రాంతి చెందుతాయి. దాంతో తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
4. నిమ్మరసం : నిమ్మరసం కలినిపి గోరువెచ్చని నీటిని తాగితే.. తలనొప్పి తీవ్రత కొద్దిమేరకు తగ్గుతుంది. అలాగే.. సిట్రస్ పండ్ల పేస్ట్’ను తల నుదిటి మీద అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.
5. తమలపాకులు : తమలపాకలు బాధనివారణి. అదే విధంగా కూలింగ్ ఎఫెక్ట్’ను ఇచ్చే లక్షణాలు ఇందులో వుంటాయి. రెండు లేదా మూడు తాజాగా ఉండే తమలపాకులను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను తల నుదుటిభాగంలో బాగా అప్లై చేయాలి. అరగంటపాటు అలాగే ఉండటం వల్ల తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
6. అల్లం : ఇందులో తలనొప్పిని నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు పుష్కలంగా వుంటాయి. అలాగే తలలోని రక్త సిరలు విశ్రాంతి చెంది, తలలో వాపును తగ్గించి చురుకుగా పనిచేసి, టెన్షన్ తో వచ్చే తలనొప్పిని నివారిస్తుంది. అల్లం టీని రోజులో మూడు నాలుగు సార్లు త్రాగడం వల్ల శరీరంలో నుండి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.
7. ఆపిల్స్ : ఒక ఆపిల్ ముక్కకు కొద్దిగా ఉప్పు రాసి తినాలి, తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఆపిల్’తోపాటు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తలనొప్పి నివారణకు సహాపడుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఒక మగ్గు నీళ్ళు తీసుకొని వేడిచేసి, అందులో ఆపిల్ సైడ్ వెనిగర్ వేసి ఆవిరి పట్టాలి.
8. పుదీన : హెర్బల్ టీలో కొద్దిగా ఎండిన పుదీనా ఆకు వేసి వేడిగా టీ తయారుచేసి, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి త్రాగాలి. ఇలా చేస్తే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం ఉంటుంది. అలాగే కొద్దిగా పుదీనా ఆయిల్ ను మీనుదిటి బాగంలో మసాజ్ చేయాలి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more