The health benefits with mint leaves which prevents diseases

health tips, health tips in telugu, tip of the day, mint leaves tips, mint leaves health tips, healthy food items, healthy foods, telugu news, menthol health, healthy mint leaves

the health benefits with mint leaves which prevents diseases

పుదీనాతో కలిగే అద్భత ఆరోగ్య ఫలితాలు

Posted: 11/19/2014 06:06 PM IST
The health benefits with mint leaves which prevents diseases

మానవ శరీరానికి కావలసిన పోషక విలువలు అధికంగా నిల్వవుండే వాటిలో పుదీనా కూడా ఒక్కటి. చక్కటి సువాసనను కలిగివుండే ఈ మొక్క.. మెదడును సానుకూలంగా వుంచడంలో ఎంతో ప్రభావితం చేస్తుంది.. జీవక్రియను సమర్థవంతంగా నడుపుతుంది.. చాలారకాల వ్యాధుల నుంచి దూరంగా వుంచుతుంది.. మొత్తానికి ఇది కూడా అన్నివిధాలుగా మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఈ ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికమోతాదులో వుంటాయి. అలాగే.. మాంగనీసు, పొటాషియం ర్భిణులకు అవసరం అయిన ఫోలికామ్లం, ఒమేగా 3లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇటువంటి పుదీనాను మరిన్ని పోషకనిల్వలు కలిగివుండే పదార్థాలతో మిక్స్ చేసి తీసుకుంటే.. ఎన్నో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి అవేమిటో ఒకసారి తెలుసుకుందాం...

1. ఆమ్లెట్ ఫ్లేవర్ ను మరింత బ్రైట్ గా మార్చడానికి కొత్తిమీరకు బదులుగా పుదీనా ఆకులను జోడిస్తే.. అది ఆరోగ్యానికి ఎంతో మేలు.

2. ఒక గుప్పెడు పుదీనా ఆకులను కప్పు టీలో జోడించి మరిగించి, స్టెయినర్ తో తొలగించి, సుగర్ కు బదులుగా తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు.

3. స్ వాటర్లో రెండు మూడు పుదీనా ఆకులను వేసి తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది.

పుదీనాతో కలిగే ప్రయోజనాలు :

1. పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్, రోస్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా వుంటాయి. ఈ అసిడ్స్ సీజనల్ గా వచ్చే అలర్జీలను నివారించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.

2. పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. ఇది గొంతులో గరగర వంటి ఇబ్బందులను దూరం చేయడంలో సహాయపడుతుంది. గొంతులో ఇబ్బందిగా వుంటే.. పుదీనా చాయ్ తాగితే మంచిది. నిముషాల్లో విముక్తి పొందవచ్చు.

3. ప్రతిరోజూ తీసుకునే ఆహారపదార్థాల్లో ఓ మోస్తరు పుదీనాను రెగ్యులర్ గా తీసుకుంటే..  జీర్ణక్రియను మెరుగుపడి వేగవంతం అవుతుంది. రెండు స్పూనుల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి.

4. ముఖ్యంగా గర్భిణీల్లో ఉదయం పూట అసౌకర్యాన్ని, వికారాన్ని నివారించి సుగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  mint leaves  healthy food items  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more