బెల్ పెప్పర్స్ లేదా క్యాప్సికమ్స్.. ఇవి మార్కెట్లలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో లభ్యమవుతాయి. వీటిలో మానవ శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు, విటమిన్లు ఎక్కువ మోతాదులో వుంటాయి. సాధారణంగా వచ్చే వ్యాధులనుండి కాపాడటంలో ఈ క్యాప్సికమ్ ప్రముఖపాత్రను పోషిస్తాయి. వీటిల్లో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తూ.. శరీరానికి కావలసిన శక్తిని అందించడంతోపాటు వ్యాధులను నివారించడంలో సహాయపడుతాయి. ఒకవిధంగా చెప్పుకోవాలంటే.. క్యాప్సికమ్స్ ను ఒక ఔషధగుణంగా పేర్కొనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. మరి.. వీటితో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
1. క్యాలరీలను తగ్గించుట : శరీరంలోని అనవసరమైన క్యాలరీలను తగ్గించేసి, శరీరబరువును అదుపులో వుంచుతుంది. అలాగే గుండె సంబంధింత వ్యాధులను కలిగించే మలినాలను, ఇతర కొవ్వు పదార్దాలను కరిగించేస్తుంది.
2. కళ్ళు - చర్మ సంరక్షణ : క్యాప్సికమ్ లో వుండే ‘విటమిన్-ఏ’ కళ్లను నిత్యం సంరక్షిస్తుంటుంది. అలాగే చర్మం ఎంతో తాజాగా వుంచి, మొటిమలను పూర్తిగా నిర్మూలించి, అందంగా కనిపించేలా చేస్తుంది.
3. మధుమేహం : శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. క్యాప్సికమ్స్ లో క్యాలరీలు, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను పెంచకుండా చూసుకుంటుంది.
4. జుట్టు : క్యాప్సికమ్స్ లో వుండే పోషకాలు జుట్టు ఉత్పత్తికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అలాగే జుట్టు ఊడిపోవడం సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుంది.
5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : జస్టేషనల్ సమస్యల(ఫ్లాటులెన్స్, స్టొమక్ అప్ సెట్)ను పూర్తిగా నివారించి.. జీర్ణక్రియను రెగ్యులేట్ చేస్తుంది. ఇంకా డయేరియా అబ్డామినల్ క్రాంప్ ను నివారిస్తుంది. స్టొమక్ అల్సర్ ను నివారిస్తుంది.
6. ఆర్థరైటిస్: క్యాప్సికమ్ లో ఉండే ‘కేయాన్’ మూలకం పెయిన్ రిలీఫ్ గా పనిచేస్తుంది. అలాగే ఆర్థరైటిస్, రుమటాయిడ్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం దీంతో తయారుచేసే ఆయిట్ మెంట్ ను పెయిన్ రిలీఫ్ గా ఉపయోగిస్తున్నారు.
7. క్యాన్సర్ నివారణ : క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న కాంపౌండ్స్ “Capsaicins ”మన రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more