The bad habbits which cause health problems

the bad habbits, human bad habbits, computer operating, women bathing, morning excercise, eating popcorn, health tips, the health tips, eating lemon

the bad habbits which cause health problems and dangerous disease

ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లు!

Posted: 10/21/2014 06:09 PM IST
The bad habbits which cause health problems

సమస్త మానవులందరికీ తమతమ జీవితంలో ఏవో కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఖచ్చితంగా వుంటాయి. తమకు తెలియకుండానే వాళ్లు ఆ అలవాట్లకు బానిసలైపోతారు. ప్రతిరోజూ వాటినే అనుసరిస్తూ వుంటారు. అందులో ఉదాహరణగా కంప్యూటర్ వాడకాన్ని తీసుకోవచ్చు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో కంప్యూటర్ అత్యవసర వాడకం అయిపోయింది కాబట్టి రాత్రింబవళ్లు తేడాలేకుండా దానిముందే కూర్చొని తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటుంటారు. అయితే ప్రతిరోజూ అలాగే చేయడం వల్ల కళ్ల ఆరోగ్యంతోపాటు మానవశరీరానికి ఎంతో హానికరమని నిపుణులు తేల్చారు. ఈ తరహాలోనే మరికొన్ని చెడు అలవాట్లేమిటో తెలుసుకుందాం...

1. ప్రతిరోజూ స్నానం చేయడం : ప్రతిరోజూ స్నానం చేయడం శరీరారోగ్యానికి మంచిదే కానీ.. రోజూ స్ర్కబ్బింగ్ ఉపకరణ ఉపయోగించడం చర్మానికి హానికరం. ఇది చర్మ లిపిడ్లను దూరంగా వుంచి, చర్మానికి కావల్సిన తేమ లేకుండా చేస్తుంది.

2. జాగింగ్ పెంచుకోవడం : ఉదయాన్నే లేవగానే పరిమితంగా జాగింగ్ చేయడానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా అని మరీఎక్కువ సమయం జాగింగ్ లోనే గడిపేయకూడదు. ఒకవేళ జాగింగ్ సమయాన్ని పెంచుకుంటూపోతే.. అది మోకాలులో అర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి.. తక్కువగా చేయడం శ్రేయస్కరం.

3. నిమ్మకాయలు తినడం : మానవ శరీరానికి కావలసిన పోషకాలు ఇందులో పుష్కలంగా వుంటాయి. దీని జ్యూస్ రోజూ తాగడం మంచిదే. కానీ నేరుగా నిమ్మకాయను తినడం మాత్రం తప్పు. ఇందులో వుండే ఆమ్లత్వం కారణంగా దంతాలలో వుండే ఎనామెల్ దెబ్బతింటుంది. ఫలితంగా దంతాలు బలహీనపడుతాయి.

4. పాప్ కార్న్ తినడం : ఈమధ్య పాప్ కార్న్ వాడకం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అయితే పాప్ కార్న్ తినడాన్ని అలవాటు మార్చుకుంటే ప్రమాదమే! ఎందుకంటే.. దీన్ని తిన్నప్పుడు ఇది దంతాలమధ్య కూరుకుపోయి ఇన్ ఫెక్షన్ కి కారణం కావచ్చు. అలాగే కెర్నల్ క్రిందికి కొరికతే దంతాలకు పగుళ్లు కూడా రావచ్చు.

5. ఆఫీస్ లో ఎక్కువసేపు కూర్చోవడం : ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఆఫీసు వర్క్ చాలా ఎక్కువగానే వుండటం సహజం. కొంతమంది పనిపూర్తిచేయాలనే నెపంతో 10 గంటలకంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు అలాగే కూర్చుండిపోతారు. ఇలా చేస్తే 64 శాతం వరకు గుండెజబ్బు పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

6. సాక్స్ ధరించడం : కొంతమంది ఫ్యాషన్ పేరుతో చేతులకు, కాళ్లకు నిత్యం సాక్సులు ధరించుకుని వుంటారు. ఉదయం నుంచి సాయంత్రం తిరిగి ఇంటికెళ్లేంతవరకు అలాగే ధరించి వుంటారు. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇది శరీరకణాల వాయుమార్పిడిని నిరోధిస్తుంది. అంతేకాదు.. మెదడు కణాలకు కూడా నష్టం కలిగిస్తుంది.

7. జుట్టును ఆరబెట్టుకోవడం : మహిళలు తమ అందాన్ని పెంపొందించుకునే విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే వుంటారు. అలాగే జుట్టు సంరక్షణలో కూడా! తమ జుట్టు అందంగా కనిపించాలని ఏవేవో చేస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆరబెట్టుకోవడం, ఇంకా రకరకాల పనులు చేస్తారు. అయితే జుట్టును ఆరబెట్టుకోవడం మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. జుట్టును వేడి చేస్తే.. జుట్టులో వుండే హైడ్రోజన్ బంధాలు విచ్ఛిన్నం అయి, జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంది.

8. పెన్సిల్ లేదా పెన్ కొరకడం : ఇది సహజంగా చాలామంది వుండే నిత్య అలవాటు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడుగానీ, దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు పెన్సిల్ లేదా పెన్ నోట్లో పెట్టుకుని కొరుకుతుంటారు. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. దంతాలకు హాని కలుగుతుంది. ముఖ్యంగా వాటి స్థానాల్లో మార్పు వస్తుంది.

9. కంప్యూటర్ వాడకం : నేటి యుగంలో కంప్యూటర్ అత్యవసరం వాడకం అయిపోయింది కాబట్టి.. దానిముందే కూర్చోవాల్సి వస్తోంది. అయితే కనీసం కొద్దిసేపటివరకైనా కంప్యూటర్ ముందు నుంచి తప్పుకోవడం మంచిది. అలాకానిపక్షంలో.. కంప్యూటర్ స్ర్కీన్ కాంతి కళ్లు అలసట, తలనొప్పిని కలిగిస్తుంది. నరాలకు నష్టం కలిగించే టాక్సిన్ ను కలిగి వుంటాయి.

10. నేటి యువతరం ఫ్యాషన్ పేరుతో సగం బట్టలు వేసుకుని తిరగడం అలవాటు చేసుకున్నారు. ఎద అందాలు, తొడ భాగాలు పూర్తిగా కనిపించేంతవరకు చిన్నచిన్న డ్రెస్సులు ధరిస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో పెద్ద ప్రమాదం. ఎందుకంటే.. సూర్యరశ్మిలో వుండే యూవీ కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల చర్మం సౌందర్యం దెబ్బతినడంతోపాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలావరకు వున్నాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు పూర్తి బట్టలు ధరించుకోవడమే ఎంతో మంచిది... లేదా సన్ స్ర్కీన్ ను వేసుకుంటే ఫర్వాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  bad habbits  health diseases  heart attack problems  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more