Healthy tips for eye care

eye care tips, eye care, healthy tips for eyes, healthy tips for eye care, tips for eye care, eye tips, healthy tips for eyes, eyes healthy tips, eye vitamins, vitamins for eyes

healthy tips for eye care which can prevent the eye problems

కళ్ల సంరక్షణకు ఆరోగ్యకరమైన చిట్కాలు

Posted: 10/18/2014 07:23 PM IST
Healthy tips for eye care

ఉదయం నిద్రలేచిన సమయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు మానవ శరీరంలో వుండే అవయవాలకు అప్పుడప్పుడు విశ్రాంతి లభిస్తుందేమోగానీ.. కళ్లకు మాత్రం కాదు. ఇంట్లో పనులు చూసుకోవడం, బయటకు వెళ్లినప్పుడు దుమ్ము- ధూళి కళ్లలో పడటం, ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చోవడం, తిరిగి ఇంటికిరాగానే మళ్లీ కొద్దిసేపటివరకు టీవీ చూడటం, మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసుకోవడం... ఇలా అన్ని కార్యక్రమాల్లోనూ కళ్లకు అస్సలు విశ్రాంతియే లభించదు. రాత్రి నిద్రపోయే చివరిక్షణందాకా కళ్లు పనిచేస్తూనే వుంటాయి. పైగా ప్రస్తుత బిజీ ప్రపంచంలో అందరూ కేవలం 5 నుంచి 6 గంటలవరకు మాత్రమే నిద్రపోతున్నారు. దీంతో కళ్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు చాలా వున్నాయి. ఏదో ఒక సందర్భంలో కంటికి సంబంధించిన సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అటువంటి సమయాల్లో కళ్ల సంరక్షణ కోసం కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు అందుబాటులో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాం..

1. విటమిన్లతో కూడిన ఆహారం : విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా వుండే పండ్లు, కూరగాయాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. ముఖ్యంగా ఏ, కే విటమిన్లు ఎక్కువగా వుండేవాటిని తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఇవి కంటి సంరక్షణకు ఎంతో సహాయపడుతాయి.

2. కంటి వ్యాయామం : కళ్ళకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయడం చాలామంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు కనురెప్పలను బ్లింక్ చేస్తుండాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు చేతులను బాగా రబ్ చేసి తర్వాత... ఈ వెచ్చని చేతులను కళ్ళమీద ఉంచాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. కళ్ళు తేమగా, హెల్తీగా వుంటాయి.

3.  కీరదోసకాయ: ఆఫీసులో లేదా ఇంట్లో ఎప్పుడైనా కాస్త విరామం సమయం లభించినప్పుడు కళ్ళ మీద కీరదోసకాయలను వుంచుకుంటే.. కళ్లకు తగినంత తేమను అందిస్తుంది. కళ్ళను చల్లగా ఉంచి, ఫ్రెష్ గా కనబడేలా చేయడంతోపాటు డార్క్ సర్కిల్స్ ను కూడా తొలగిస్తుంది.

4. సన్ గ్లాసెస్ వాడటం ముఖ్యం : ఏవైనా కొన్ని అవసరాల నిమిత్తం బయటకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అటువంటి సమయాల్లో సన్ గ్లాసెస్ ధరిస్తే కళ్ళకు మాయిశ్చరైజర్ ను అందించడంతోపాటు డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. ఒకవేళ గ్లాసెస్ లేకుండా వెళితే.. దుమ్ము - ధూలి కళ్లలోకి చేరిపోయి, మంటగా అగుపిస్తుంది. అలాగే కళ్లనింద నల్లని ఛాయలు ఏర్పడుతాయి.

5. నీళ్లు చిలకరించుకుంటే మంచిది : అప్పుడప్పుడు కళ్లలో ఏవైనా పడుతుంటాయి. ఆ సమయంలో కళ్లు నొప్పిగా అనిపించడంతోపాటు చాలా ఇరిటేషన్ గా వుంటుంది. అలాంటప్పుడు కళ్లను నలపకుండా కొన్ని నీళ్లను చిలకరించుకుంటే మంచిది. రుద్దడం వల్ల ఏదైనా హాని కలగవచ్చు.

6. నిద్ర : ప్రస్తుత బిజీ ప్రపంచంలో అందరూ కేవలం 5 నుంచి 6 గంటలవరకు మాత్రమే నిద్రపోతున్నారు. అలా చేస్తే చాలా ప్రమాదం. ఖచ్చితంగా 8 గంటల నిద్ర తప్పని సరి. ప్రతి రోజూ 8గంటలు తప్పనిసరిగా నిద్రపోతే కళ్ళక్రింద నల్లని వలయలు, బ్బు ఉండదు. నిద్రలేమి మీ కళ్ళను ఎర్రగా మారడం మాత్రమే కాదు మీ ముఖం కళను తప్పిస్తుంది. కాబట్టి, తగినంత నిద్ర వల్ల మీ కళ్లు ముఖం ఫ్రెష్ గా కనబడుతుంది.

7. పనిచేసే వేళల్లో బ్రేక్ : పుస్తకాలు చదివే సమయంలో, కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు... ఇలా ఏ సందర్భంలోనైనా సరే మధ్యమధ్యలో చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిది. ఆ బ్రేక్ సమయంలో 5 నిముషాలు కళ్లు మూసుకొని, రిలాక్స్ గా ఫీల్ అయితే.. కళ్ల కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. తర్వాత కళ్లమీద నీళ్లు చిలకరించుకుంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eye care tips  healthy eye tips  health tips  eye vitamins  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more