టాలీవుడ్ లవర్ బాయ్ నాగచైతన్యకు కమర్షియల్ గా ఒక్క హిట్ కూడా దక్కడం లేదు. ‘దోచేయ్’ ఒకటే యావరేజ్ గా నిలిచింది తప్ప.. మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అందుకే.. తన ఇమేజ్ కి తగ్గట్టే ప్రేమకథా చిత్రాలను తీయాలని చైతూ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హీరో తనకు గతంలో ‘ఏమాయ చేశావే’ చిత్రం ద్వారా మంచి హిట్ అందించిన దర్శకుడు గౌతమ్ మీనన్ తోనే మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.
ప్రస్తుతం చైతూ-గౌతమ్ కాంబినేషన్ లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గౌతమ్ ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో చైతూ నటిస్తుండగా.. తమిళ వెర్షన్ లో శింబూ కథానాయకుడిగానటిస్తున్నారు. ఈ రెండు భాషల్లోనూ కథానాయికగా మంజిమా మోహన్ నటిస్తోంది. పూర్తిగా లవ్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ప్రేక్షకులను అలరించడంతోపాటు చైతూకి మంచి హిట్ అందిస్తుందని చిత్రం యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇదిలావుండగా.. గౌతమ్ మీనన్ సినిమా అనగానే లవ్ సెంటిమెంట్ .. యాక్షన్ సమపాళ్లలో కనిపిస్తాయి. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంతోనే రూపొందుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను .. ఆసక్తిని పెంచాయి. మరి.. గతంలో గౌతమ్ దర్శకత్వంలో చైతన్య చేసిన 'ఏ మాయ చేశావే' సినిమా ఆయనకి మంచి హిట్ ఇచ్చింది. ప్రస్తుతం చేస్తోన్న ఈ సినిమా ఆ స్థాయి హిట్ ని అందిస్తుందేమో లేదా చూడాలంటే వెయిట్ చేయాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more