‘బ్రూస్ లీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. తన తదుపరి చిత్రాలపై అప్పుడే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఫుల్ ఖుషీలో వున్న చెర్రీ.. అదే జోష్ తో జోరుమీదున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చెర్రీ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం.. పర్ఫెక్ట్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండే పోలీస్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుంది. అయితే.. వరుసగా కేవలం యాక్షన్ సినిమాలే చేసుకుంటూ పోతున్న చెర్రీ.. ఇప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.
వరుస యాక్షన్ చిత్రాలతో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న రామ్ చరణ్.. ఛేంజోవర్ కోసం దర్శకుడు కృష్ణవంశీతో కలిసి ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం చేశాడు. ఆ మూవీ డీసెంట్ హిట్ సాధించడంతోపాటు చెర్రీలో దాగివున్న మరో కోణాన్ని తెలియజేసింది. ఇప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం.. సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరైన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో ఇటీవల కలిసి.. ఓ ప్రేమకథ సిద్ధం చేయమని చెప్పినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. యాక్షన్ సినిమాలైనా, లవ్ స్టోరీస్ అయినా గౌతమ్ మీనన్ చాలా డిఫరెంట్ గా చేస్తాడనే పేరుంది. అందుకే.. ఆయన డైరెక్షన్ తో ఓ లవ్ స్టోరీ సినిమా తీస్తే.. తనకూ లవర్ బాయ్ ఇమేజ్ వస్తుందనే ఆశతో గౌతమ్ తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడని అనుకుంటున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
ఒకవేళ రామ్ చరణ్ – గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఆ లవ్ స్టోరీ తెరకెక్కితే.. అది సూపర్బ్ క్రేజీ లవ్ స్టొరీ అవుతుందని చెప్పుకుంటున్నారు. ‘మాస్ + లవ్’ రెండు ఎలిమెంట్లు అందులో చూసేందుకు అవకాశం వుంటుంది. ఆ స్టోరీ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి.. ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్ళే టైంకి చరణ్ ఒపీనియన్ మార్చుకుంటాడా లేక లవ్ స్టొరీకే ఫిక్స్ అవుతాడా అన్నది చూడాలి.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more