Allari Naresh Says That He Will Never Do Experimental Movies | James Bond Telugu | Tollywood

Allari naresh experimental movies james bond tollywood news

allari naresh, james bond telugu, allari naresh interview, allari naresh press meet, allari naresh jamesh bond, experimental movies, telugu movies, tollywood news, movie gossips, sakshi chowdhary news

Allari Naresh Experimental Movies James Bond Tollywood News : Telugu Comedy Hero Allari Naresh Says That He Will Never Do Experimental Movies.

‘బాబోయ్.. ఇకనుంచి అలాంటివి చేయను’

Posted: 08/07/2015 04:00 PM IST
Allari naresh experimental movies james bond tollywood news

తెలుగు ఇండస్ట్రీలో గొప్ప హాస్యనటుడిగా పేరుగాంచిన రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించుకున్న నటుడిగా అల్లరి నరేష్ పేరుగాంచాడు. ఎందుకంటే.. ‘అల్లరి’తో టాలవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో నటించిన అన్ని సినిమాలు దాదాపుగా హిట్ అయ్యాయి. దీంతో.. ఈ హీరోతో సినిమాలు తీస్తే మినిమ్ గ్యారెంటీ వుంటుందన్న నమ్మకాన్ని దర్శకనిర్మాతలు వెల్లడిస్తుంటారు. అలా తన నటనాప్రతిభతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులతోపాటు దర్శకనిర్మాతల్ని ఈ హీరో తన బుట్టలో పడేసుకున్నాడు.

కానీ.. ఆమధ్య ఈ హీరోకి వరుస పరాజయాలను చవిచూడలేక తప్పలేదు. గతకొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ప్రతిఒక్కరు ప్రయోగాత్మక సినిమాలనే తీస్తుండటంతో.. అల్లరి నరేష్ కూడా ఆ తరహా చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన కామెడీతోపాటు ప్రేక్షకుల్ని కొత్తదనం చూపించడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే.. ఆ ప్రయత్నాలు ఫలించక నరేష్ తన కెరీర్ కాస్త ఇరుకున పెట్టేసుకున్నాడు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోర్లపడ్డాయే తప్ప.. నరేష్ కి ఏమాత్రం ఫలితాన్ని అందించలేదు. దీంతో.. ఈ హీరో కొత్తదనం కోసం తాను చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనే విషయాన్ని కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు.

ప్రేక్షకులు తనని ఎప్పటిలాగే చూడటానికే ఇష్టపడుతున్నారని గ్రహించిన నరేష్.. ఆ పాత రూట్లోకే వెళ్లి ‘జేమ్స్ బాండ్’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా ఆశించిన విధంగానే మంచి విజయం సాధించడంతోపాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక చాలాకాలం నుంచి సక్సెస్ కోసం వేచిచూసిన తనకు ఈ చిత్రం ఆనందాన్ని ఇచ్చిందని నరేష్ హర్షం వ్యక్తం చేశాడు. అలాగే.. ఇకపై తాను ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. ప్రేక్షకులకు నచ్చే అల్లరి సినిమాలే చేస్తానని అంటున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allari naresh  james bond telugu  experimental movies  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more