సినిమాల్లో ఏదైనా ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం లభిస్తే చాలనే ఉద్దేశంతో ఎందరో యువకులు ఇండస్ట్రీవైపు పరుగులు పెడతుంటారు. ఒక్క ఆఫర్ కోసం నానాతంటాలు పడుతుంటారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ.. అనుకున్నది సాధించి తీరాలనే ఆశతో చాలా ఇబ్బందులను ఎదర్కొంటారు. తమకూ ఓ అవకాశం ఇవ్వాలని దర్శకనిర్మాతల వెండ పడతారు. అయితే.. వారసత్వంగా వచ్చే కథానాయకులకు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరమే లేదు. దర్శకనిర్మాతలే వారిని రంగప్రవేశం చేయిస్తారు.
కానీ.. తాను ఓ ప్రముఖ నటుడి కొడుకే అయినా, హీరో కావాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని సూర్య ఒక సందర్భంలో చెప్పాడు. తనకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సునాయాసమైన దారి వున్నప్పటికీ.. తాను అటువైపుగా అడుగులు వేయాలని ఎన్నడూ ఆలోచించలేదని పేర్కొన్నాడు. అంతేకాదు.. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. హీరో సూర్య తండ్రి శివకుమార్ తమిళ్లో మంచి నటుడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అయినా సూర్య ఏ రోజున కూడా ఆయనతో షూటింగుకి వెళ్లలేదట. నటనా పరంగా తాను పెద్దగా ఆకట్టుకోలేననే భావన ఆయనలో ఉండేదట. అందుకే.. అనవసరంగా ఆ వైపు వెళ్లి ఇబ్బందులు పడటం ఎందుకనే ఉద్దేశంతో, తనపని తాను చేసుకుంటూ ఉండేవాడు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండవలసి వచ్చినప్పుడు కూడా ఆయన నటనని ఎంచుకోలేదు. ఈ క్రమంలోనే ఆయన ఓ సంస్థలో ఉద్యోగంలో చేరాడు.
కొన్నాళ్లు అంతా సవ్యంగానే కొనసాగింది కానీ.. ఉద్యోగం చేస్తున్నప్పుడు మాత్రం, నటవారసుడిగా తండ్రికి సంతోషాన్ని కలిగించలేకపోయానే అనే ఆలోచన సూర్యకు వచ్చేదట. ఇక అప్పటినుంచి ఆయనలో ఆ ఆవేదన వెంటాడుతూ వచ్చింది. తండ్రికోసం ఏదైనా చేయాలని ఆశ ఆయనలో కలిగింది. అలాంటి పరిస్థితుల్లోనే ఒక రోజున ఆయనకి దర్శకుడు వసంత్ తారసపడ్డాడు. ‘తన దర్శకత్వంలో మణిరత్నం నిర్మిస్తోన్న ఒక సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర వుంది.. అది చేస్తావా?’ అంటూ అడిగాడు. అంతే.. ఒక్క క్షణం ఆలస్యం చేయడకుండా వెంటనే మణిరత్నాన్ని కలుసుకున్నాడట. అలా ఆ సినిమాకి ఎంపికైన తాను ఆ తరువాత హీరోగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదని అన్నాడు. పైగా.. తాను అగ్రకథానాయకుడిగా కొనసాగుతాననిగాని కలలో కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more