Actor Sudheer Babu Latest Movie Title Fixed As Bhale Manchi Roju | Director Sri Ram Aditya | Tollywood

Sudheer babu bhale manchi roju movie sriram aditya director tollywood

sudheer babu, sudheer babu news, bhale manchi roju movie, sudheer bhale manchi roju, sudheer babu latest movies, telugu movies, tollywood news, director sri ram aditya, bhale manchi roju movie updates

Sudheer Babu Bhale Manchi Roju Movie Sriram Aditya Director Tollywood : Tollywood young hero Sudheer Babu Latest Movie Title Fixed As Bhale Manchi Roju which is directed by Sriram Aditya.

సుధీర్ బాబుకు కలిసొచ్చిన ‘భలే మంచి రోజు’

Posted: 07/30/2015 01:45 PM IST
Sudheer babu bhale manchi roju movie sriram aditya director tollywood

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు వైవిధ్యభరితమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘ప్రేమకథా చిత్రం’తో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరో.. ఆ తరహాలోనే వెరైటీ ప్రేమకథాచిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. ఇతర యువకథానాయకులతో పోటీపడుతూ.. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసేస్తున్నాడు. తాను నటించే సినిమాల్లో కొత్తదనం వుండేలా జాగ్రత్తపడుతూనే, ఆడియెన్స్ తననుంచి ఏం కోరుకుంటున్నారో దానిని ప్రదర్శిస్తూ ఆదరణ పొందుతున్నాడు. ఇప్పుడు ఈ హీరోకి ‘భలే మంచి రోజు’ రావడంతో.. సంతోషంతో పొంగిపోతున్నాడు.

ఇటీవలే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ వంటి లవ్ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన సుధీర్.. ‘భలే మంచి రోజు’ సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుందని సమాచారం. ఇక ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న శశి-వంశీ మాట్లాడుతూ.. ‘టైటిల్ కి తగ్గట్టుగానే కథ ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా సాగిపోతుంద’న్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అటు ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని సుధీర్ భాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ఇదివరకు నటించిన సినిమాలకంటే ఈ చిత్రంలో సుధీర్ సరికొత్త తరహాలో కనిపించనున్నాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో సాగే ఈ చిత్రం కథ చాలా డిఫరెంట్ గా వుందని అంటున్నారు. ఆడియెన్స్ ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని, సుధీర్ కెరీర్ లో మంచి విజయం సాధించిన చిత్రంగా ఇది నిలిచిపోనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ సినిమా సుధీర్ కి ఎటువంటి విజయాన్ని అందివ్వనుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudheer babu  bhale manchi roju  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more