Actor Sai Dharam Tej Is Preparing New Look For His Latest Movie | Dilraju | Anil Ravipudi

Sai dharam tej new look latest project anil ravipudi director dilraju

sai dharam tej, sai dharam tej news, subramanyam for sale, sai dharam tej new look, dilraju news, dil raju latest updates, sai dharam tej dilraju movies, rashi khanna news, rashi khanna movies

Sai Dharam Tej New Look Latest Project Anil Ravipudi Director Dilraju : Mega Hero Sai Dharam Tej Is Preparing New Look For His Latest Movie In Anil Ravipudi Direction Which Is To Be Produced By DilRaju.

కొత్త ‘లుక్’ కోసం నెలరోజులు గాయబ్

Posted: 07/29/2015 01:59 PM IST
Sai dharam tej new look latest project anil ravipudi director dilraju

ప్రస్తుతం ఇండస్ట్రీలో యువహీరోలందరూ రొటీన్ కి భిన్నంగా చేస్తున్నారు. సాధారణ కథాంశాలతో కూడిన సినిమాలు కాకుండా.. వైవిధ్యం, ఆసక్తికరంగా కొనసాగే సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సరికొత్తగా ప్రయోగాలు చేస్తే.. ప్రేక్షకులకు కొత్తదనం అనిపించడంతోపాటు తమ సినిమాలు సక్సెస్ అవుతాయని, అలాగే తమకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందనే ఆశతో ఆ దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ విధానాన్ని అవలంభించే యువకథానాయకల్లో ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా కనిపిస్తున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో మంచి జోష్ కనబరిచిన ఈ హీరో.. తన తదుపరి సినిమాల్లోనూ అదే జోష్ చూపిస్తూనే, సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేందుకు ఈ హీరో తాను నటించబోయే తదుపరి చిత్రంలో ‘కొత్త లుక్’తో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ప్రస్తుతం సాయి ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ కానుంది. ఈ సినిమా పూర్తవ్వడం ఆలస్యం.. అప్పుడే తన తదుపరి చిత్రంకోసం సాయి కసరత్తు చేస్తున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజుయే వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ ఇదివరకెన్నడూలేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఆ లుక్ కోసమే ఈ హీరో ఒక నెల సమయం తీసుకుని, సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అంటే.. ముప్పైరోజులపాటు ఈ హీరో గాయబ్ కానున్నాడన్నమాట. లవ్, కామెడీ, యాక్షన్ సీన్స్.. ఇలా అన్ని ఎలిమెంట్లతో రూపొందనున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడునున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej  rashi khanna  dil raju  anil ravipudi  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more