srikanth addala visits vijayawada for mahesh babu bramahotsavam movie location | tollywood

Srikanth addala vijayawada tour for mahesh babu bramahotsavam movie

srikanth addala, mahesh babu, cinematographer rathnavelu, bramhotsavam, vijayawada temple, prakasham barriage, kanakadurga temple, rakul preet singh, pvp banner, prasad v potluri

srikanth addala vijayawada tour for mahesh babu bramahotsavam movie : director Srikanth addala visits vijayawada along with cinematographer rathnavelu to check best locations for mahesh babu's bramahotsavam movie.

విజయవాడ అందాలను రెట్టింపు చేసేందుకు అడ్డాల ప్లాన్

Posted: 05/27/2015 07:19 PM IST
Srikanth addala vijayawada tour for mahesh babu bramahotsavam movie

ప్రేమలో దాగివున్న ‘కొత్తబంగారు లోకాన్ని’ చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. అదేవిధంగా కుటుంబంలో ప్రేమానురాగాలు ఎలా వుంటాయో కళ్లకు అద్దినట్లుగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా చూపించాడు. ఆ రెండు సినిమాలో తన దర్శకత్వం మార్క్ ఏంటో నిరూపించుకుని.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ఇతను కూడా పెద్ద దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు.

ప్రస్తుతం ఈ సెన్సిబుల్ డైరెక్టర్ మరోసారి మహేష్ బాబుతో కలిసి ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని రూపొందించనున్న విషయం తెలిసిందే! ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31న లాంచ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్న రత్నవేలుతో కలిసి లొకేషన్ల వేటలో పడ్డారని సమాచారం!

విజయవాడ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీకోసం ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ ఆలయంలతోపాటు విజయవాడ పరిసరాలను దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఓసారి పరిశీలించారు. విజయవాడను ఇంతకుముందెన్నడూ చూడనంత అందంగా ఈ సినిమాలో చూపించేందుకు శ్రీకాంత్ అడ్డాల సిద్ధమయ్యారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srikanth addala  mahesh babu  bramhotsavam movie  rakul preet singh  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more