అక్కినేని కుటుంబం నుంచి మరో వారసుడైన అఖిల్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే! కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ హీరో తన మొదటి సినిమా చేస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన నటిస్తున్న బాలీవుడ్ భామ సయేషా సైగల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఇదిలావుండగా.. గతకొన్నాళ్ల నుంచి ఎడతెరిపి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ స్పెయిన్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. ఇండియాకి తిరిగొచ్చిన ఈ యూనిట్.. అప్పుడే షూటింగ్ మొదలుపెట్టేసింది కూడా! కొద్దిరోజులపాటు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ షెడ్యూల్ చేయనున్నారు. జూన్ చివరి కల్లా హైదరాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసి జూలై 1 నుంచి సాంగ్స్ షూటింగ్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు. ఇప్పటికే అబ్రాడ్ షెడ్యూల్ కి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది.
మాస్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే వినాయక్.. చాలా జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అఖిల్ మొదటి సినిమా విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని నితిన్ దగ్గరుండి మరీ ప్రొడక్షన్ వాల్యూస్ ని చూసుకుంటున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. అఖిల్ తన మొదటి సినిమాతో అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించడానికి పర్ఫెక్ట్ గా సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more