Akkineni akhil entry in tollywood with mass director vv vinayak

akkineni akhil, akkineni akhil latest news, akkineni akhil news, akkineni akhil movie news, akkineni akhil vv vinayak movie, akkineni movie latest news, akkineni nagarjuna vinayak movie, akkineni banner movies

akkineni akhil entry in tollywood with mass director vv vinayak in akkineni banner

అక్కినేని అఖిల్

Posted: 09/15/2014 03:48 PM IST
Akkineni akhil entry in tollywood with mass director vv vinayak

‘‘సిసింద్రీ’’గా ప్రధానపాత్రలో బాలనటుడిగా తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చుకున్న అక్కినేని అఖిల్... ఇప్పుడు హీరోగా రంగప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నాగార్జున తన తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు అందుకు తగ్గట్టు దర్శకుడి కోసం వేట మొదలుపెట్టారు. ఈ వేటలో ఆయన ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో భేటీ అయ్యారు. అయితే అందులో ఎక్కువ మోతాదులో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో చివరికి ఆయన వీవీ వినాయక్ ను సంప్రదించారు. ఈ సినిమాకు ఆయన ఫేవరబుల్ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడంతో అందుకు నాగార్జున ఒప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం! దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

కేవలం క్లాస్ సినిమాలకు మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా అక్కినేని కుటుంబం... మాస్ కమర్షియల్ డైరెక్టర్ చేతిలో అఖిల్ ఎంట్రీ ఎందుకు చేయిస్తున్నారంటూ సందేహాలు వెలువడుతున్నాయి. ఇందుకు బదులుగా.. అఖిల్ మాస్ హీరోగా చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం! అక్కినేని కుటుంబంలో ఇంతవరకు నటించిన చిత్రాలలో కేవలం క్లాస్ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బాగా హిట్ సాధించాయి. మాస్ సినిమాలు తీసినప్పటికీ అవి కేవలం కొద్దిపాటిమేరకే యావరేజ్ హిట్లతో బాక్సాఫీస్ దగ్గర నిలిచాయి. అందుకే ఈసారి మాస్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులతో బద్దలు కొట్టాలనే ఆలోచనతో అఖిల్ వున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే నాగార్జున, వివి వినాయక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. పైగా, వినాయక్ తెరకెక్కించిన ‘‘అల్లుడు శీను’’ కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ హిట్ గా నిలవడంతో.. అతనితోనే అఖిల్ ఎంట్రీ చేయిస్తే నాగ్ ఆశించినట్లు వర్గాలు తెలుపుతున్నాయి. అంటే.. అఖిల్ ‘‘మాస్’’ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట! ఇక, త్వరలోనే అఖిల్ ‘‘అక్కినేని బ్యానర్’’పై మాస్ హీరోగా మూవీ రెడీ కాబోతోంది. ఇంకా మిగిలిన సమాచారాలు త్వరలోనే తెలియనున్నాయని టాలీవుడ్ లో టాక్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more